అంతరం
• అంతరం ఓ రంగం
తదనంతరమే తీరం .
• అంతరం ఓ రంగం
తదనంతరమే తీరం .
• తరంగాల వలయాలు
తరతరాలుగా
తిరుగు లాడే ఆలోచనలు .
• లోతు పెరిగితే . . .
ఆ . . . లోతు పెరిగితే . . .
అవి సుడిగుండాలు .
• అంతరం ఓ రంగం
తదనంతరమే తీరం .
• అంతరం ఓ రంగం
తదనంతరమే తీరం .
• మనస నే ఊటబావి లో
ఊరుతుంటాయి కోరికలు .
• అవి ఉప్పెనలు కానివ్వక
అలలు గ నే ఆనందించాలి .
• విగతం లో జీవం
జీవితమైతే
సత్య సాధనం సహజం .
• అంతరం ఓ రంగం
తదనంతరమే తీరం.
• అంతరం ఓ రంగం
తదనంతరమే తీరం .
• అంతమే లేనిది ఈ అంతరంగం
అంతిమమున తెలుస్తుంది
దాని మూలం .
మనిషి మనిషికీ ఇదే జీవన వేదం .
• అంతరం ఓ రంగం
తదనంతరమే తీరం.
• అంతరం ఓ రంగం
తదనంతరమే తీరం.
పట్టిసీమ వీరభద్రస్వామి ఆలయం ✍️.
యడ్ల శ్రీనివాసరావు 28 May 2025 2:30 PM.
No comments:
Post a Comment