సిం ధూర్
• సింధూరమా దూరమా
సింధూరమా దూరమా
• సౌభాగ్య తోరణ మై
సక్కంగ మెరిసే సింధూరమా
దూరమా .
• లక్ష్మి కి లక్షణ మై
నుదుట విరిసే బంగారమా
దూరమా .
• రాకాసి మూకలు
రక్త దాహం తో రగిలాయి .
• నీ శక్తి తెలియక
పైశాచిక క్రీడలు ఆడాయి.
• సింధూరమా దూరమా
సింధూరమా దూరమా
• రక్తపు రంగు తో
మాంగల్య రక్ష గా నిలిచావు .
• ఆ రక్షణే అణగారితే
రక్తపు టేరులను సృష్టిస్తావు .
• సింధూరమంటే
ప్రేమ సింధువు లోని బిందువు .
• కాలరాసిన నాడు కాళిక యై
ఎగసి పడే రక్త సింధువు .
• సింధూరమే సౌందర్యము
భరతనారి భవిత కి
సింధూరమే సౌందర్యము .
• సింధూరమే సంహారము
రావణాసుర సంతతి కి
సింధూరమే సంహారము .
*సింధువు = సాగరం , సముద్రం.
పెహల్గాం లో జరిగిన దుర్ఘటన లో ఒక ఆరంభం మాత్రమే. ముష్కరులు ఎవరి సింధూరాలను నిర్దాక్షిణ్యంగా తీసివేశారో , ఆ సింధూరమే యావత్తు ప్రపంచాన్ని, జూన్ జూలై 2025 మాసాలలో అల్లకల్లోలం చేస్తుంది. ఊహించని మరణాలు, దహనకాండలు జరుగుతాయి. ఇది కలియుగ వినాశనానికి ఆరంభం .
భగవంతుడైన పరమపిత శివ పరమాత్మ ఒక వృద్ధ మానవ శరీరంలో శక్తి స్వరూపమై అవతరించి, జ్ఞాన రచన ద్వారా 1936 సంవత్సరం లో , చెప్పిన విధమే ఈ ప్రస్తుత కాలం. 2020 నుంచి అంతా సంగమ యుగం. అనగా ఒకవైపు కలియుగం పూర్తిగా అంతం అవుతుంది, మరో వైపు సత్య యుగం ఆరంభం అవుతుంది.
వైరస్ లు, యుద్ధాలు, అణుబాంబులు, ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, సునామీలు, అధిక వర్షాలు, కరువు అన్నీ కలిసి ఒకేసారి రాబోయే సమయం మొదలైపోయింది. దీనిని ఆపడం ఎవరి సాధ్యం కాదు. ఎందుకంటే ఇది సృష్టి రచన. ఈ సమయంలో విశ్వ శాంతి కోసం ఎవరైతే నిత్యం ధ్యాన యోగం చేస్తారో, వారు మాత్రమే కొంత సురక్షితంగా ఉంటారు.
కల్పం క్రితం అఖండ భారతం నుంచే సృష్టి ఆది మొదలైంది. అదే విధంగా విశ్వ పరివర్తన నిమిత్తం వినాశనం కూడా భారతదేశం నుంచే ఆరంభం అవుతుంది. తిరిగి సత్య యుగం భారత దేశంలో నే స్థాపన జరుగుతుంది. ఎందుకంటే భగవంతుడు అవతరించిన భూమి ఇది.
రాబోయే జూన్ జూలై నెలల్లో కుజుడు కేతువు ఒకే రాశిలో సంచారం చేయడం వలన ప్రపంచములో ఊహించని మారణకాండ జరగబోతోంది అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది.
ఓం శాంతి 🙏
ఓం నమఃశివాయ 🙏.
యడ్ల శ్రీనివాసరావు 17 May 2025 , 2:00 am .
No comments:
Post a Comment