Self - Respect
•. Self Respect అనేది పూర్తిగా మనో భావానికి సంబంధించినది . అసలు దీని అంతరార్థం ఒకింత అర్దం చేసుకోవడం అంత సాధారణ విషయం కాదు .
• అసలు Self Respect అంటే ఏమిటి ?
Self అంటే “ నేను “ అని అర్దం.
ఈ “ నేను “ లో . . .
ఆత్మ ( Soul ) ,
శరీరం ( Body ) ,
అహం ( Igo ) . . . ఈ మూడు ఉంటాయి .
• Self Respect అంటే . . .
1. ఆత్మ గౌరవం .
2. దేహ(శరీర) గౌరవం .
3. అహనికి భరోసా .
• ముందుగా గ్రహించ వలసిన విషయం ఏమంటే
ఆత్మ వేరు . . . దేహం వేరు.
ఆత్మ నశించదు . . . దేహం నశిస్తుంది.
ఈ రెండు కూడా ఒకే నాణెం లో బొమ్మ బొరుసు వలే ఒకే మనిషి లో పైన శరీరం , లోన ఆత్మ ఉంటాయి
( ఆత్మ కి పేరు ఉండదు . . . దేహానికి పేరు ఉంటుంది. ఉదాహరణకు ఒక మనిషి పేరు "రాము" , జీవిస్తూ ఉన్నంత వరకు "రాము" అని పిలుస్తాం. రాము లో నుంచి ఆత్మ వెళిపోయిన తరువాత, అంటే చనిపోయిన తరువాత, వాకిట్లో రాము నిర్జీవం గా ఉన్నా సరే అందరూ శవం , Dead Body , Body ఎప్పుడు తీసుకెళతారు, ఇలా సంబోధిస్తారు కానీ, రాము అని పిలవరు. పేరు అనేది శరీరానికి మాత్రమే. ఆత్మ కి ఉండదు. ఆత్మ అంటే చైతన్య శక్తి. )
అహం అనేది ఆత్మ కి దేహానికి మధ్య వారధి .
ఆత్మ , అహాన్ని Neutralize చేయాలని . . .
దేహం ,అహాన్ని Accept చేయాలని అనుకుంటాయి.
🌹🌹🌹🌹
• Self Respect : దేహ గౌరవం . . .
సాధారణ భౌతిక జీవనం సాగించే మనిషి , తనను తాను ఉత్తమం గా భావించు కునే దృష్ట్యా , గౌరవాన్ని స్వతహాగా అన్వయించు కుంటాడు . తనకు ఏదైనా అంశం లో గౌరవానికి భంగం కలిగినప్పుడు కొంత మేరకు Igo hurt అవుతుంది . . . ఈ సందర్భంలో బాధ , అవమాన భారంగా అనిపిస్తుంది. తనను తాను మానసికంగా ధృఢ చిత్తం గా ఉంచు కోవాలి అనుకునే సందర్భంలో . . . ఈ Self Respect అనే పదం నోటి నుండి బయటకు వస్తుంది.
సామాన్య భౌతిక జీవనం లో ఉన్న వారు నేను ఫలానా “ ABC “ అనే పేరు గుర్తింపు తో శారీరక స్పృహ తో జీవిస్తారు .
ఇక్కడ సహజంగానే "ABC " కి తన దేహం పై మోహం, అభిమానం ఎక్కువ గా ఉంటాయి. "ABC" కి ఏదైనా లోటు కలిగితే అప్పుడు, నా Self Respect కి భంగం కలిగిందని . . . లేదా నేను ఎవరితో మాట పడను అనే అహం తో కూడిన బలమైన ఆలోచన మనసులో ఉన్నప్పుడు కూడా ఈ Self Respect అనే నినాదం వినిపిస్తుంది .
చెప్పాలంటే ఇది శరీరానికి , అహనికి సంబంధించిన విషయం. ఒక మనిషి తాను దేహ భావం లో మునిగి ఉన్నప్పుడు , " నేను " అనే identity కోరుకునే సందర్బం లో . . . గౌరవాన్ని ఆశిస్తాడు , అది జీవనం లో ఒక భాగం గా భావిస్తాడు . బయటకు కనిపించని అహమే , తన శక్తి అని భావించినప్పుడు . . . ఈ Self Respect అనే అంశం మనసు లో మెదులుతుంది .
విచిత్రం ఏమిటంటే ఈ మోహం , అభిమానం, అహం అనేవి " ABC " కి తనపై తనకు విపరీతంగా ఉంటాయని తన స్పృహ గమనించదు , ఒకవేళ గమనించినా అంగీకరించదు , ఒకవేళ అంగీకరించినా తప్పు ఏముంది? అనుకుంటుంది . . . అదే విచిత్రం. . . .
దేహభిమానము, మోహం, అహం అనేవే మనిషి తన దుఃఖానికి కారణం అని అంత సులభంగా గ్రహించలేడు.
🌹🌹🌹
• Self Respect : ఆత్మ గౌరవం . . .
ఆధ్యాత్మిక సాధనలో ఉన్న వారికి మాత్రమే తన ఆత్మ యొక్క స్థితిని గుర్తించ గలరు.
ఇక ఆత్మగౌరవం అంటే నా దేహం , నా పేరు అనే ప్రసక్తి లేకుండా వాటిని మించి తమను తాము ఉన్నతం గా , అతీతంగా తయారు చేసుకోవడం .
ఆత్మ గౌరవం (Self Respect) తో జీవించాలి, లేదా పొందాలి అనుకునే వారు చాలా విశాలమైన దృక్పథంతో , దూరదృష్టితో ఉంటారు. బాధలు , అవమానాలు , కష్టాలు సంభవించినా సరే వాటిని మనసు లోకి తీసుకుని అనుభవించరు , అంటే ఫీల్ అవరు . పైగా వాటిలో మంచి వెతకుతారు. అదే విధంగా ఇతరులకు ఎటువంటి బాధను కలుగ చేయరు. వారి మాటల స్పష్టతతో ఇతరులకు భావాన్ని ప్రస్ఫుటం చేయ గలరు . ఎందుకంటే , తాము చేసే ప్రతీ పని పై సూక్ష్మ దృష్టి మరియు పొందే ఫలితం పై అవగాహన కలిగి ఉన్నాము అని వారికి తెలుసు .
అసలు నేను ఒక ఆత్మ ను అని స్పృహ ఉన్నవారు , వారి ఆత్మకు కావాల్సిన గౌరవం ఎలా పొందాలో, ఎలా కాపాడు కోవాలో వారికి ముందే పూర్తిగా తెలుస్తుంది . అటువంటి వారు Self Respect అనే మాటను తమ మనసు తో లోలో నే పంచుకుంటారు. ఎందుకంటే ఆత్మ గౌరవం అనేది అంతరంగానికి సంబంధించినది అని వారికి ముందే తెలుసు.
అసలు గౌరవం పొందాలన్నా, కాపాడుకోవాలన్నా , ఫీల్ అవ్వాలి అన్నా . . . ఇతరులకు ఇస్తూ ఉండాలి మరియు తమపై తమకు స్వీయ నియంత్రణ , వాస్తవిక దృష్టి కలిగి ఉండాలి.
ఆత్మ గౌరవం, ఆత్మ విశ్వాసం, ఆత్మాభిమానం వంటి పదాలు వాడుతూ ఉంటారు కానీ, వాస్తవానికి ఆత్మ కి ఇవేమీ అవసరం లేదు.
ఎందుకంటే . . . ఆత్మ యొక్క స్వధర్మం శాంతి .
ఆది సనాతన దేవి దేవతా ధర్మం ప్రకారం ఆత్మ శాంతి నే కోరుకుంటుంది. ఈ ధర్మాన్నే నేడు సనాతన ధర్మం అంటున్నారు.
గౌరవం, విశ్వాసం , అభిమానం వంటివి ఇవన్నీ శరీరం పై మమకారం ఉన్న వారికి అవసరం . ఎందుకంటే ఇంకా ఉన్నతమైన గుణాలను రూపు దిద్దు కోవడం కోసం.
🌹🌹
• Self Respect : అహనికి భరోసా . . .
Self Respect ని అహం యొక్క భరోసా అని కూడా చెప్పవచ్చు.
అహం (నేను ) అనేది మనిషి జీవనానికి ఇంధనం.
ఈ అహం అనే ఇంధనం లో , సేవ, నిజాయితీ, నిస్వార్థం వంటివి చేరితే మనిషి కి జీవనం అనే ఇంజను (యంత్రం) సమర్ధంగా పని చేస్తుంది. అలా కాకుంటే , అహం అనే ఇంధనం మండి మనిషి జీవనం తగలబడి పోతుంది.
అహం అనే ఇంధనానికి , గర్వం, కోపం , కామం , స్వార్థం వంటివి తోడైతే కాలుష్యం పెరిగి మానవ జీవనం అనే ఇంజను (యంత్రం) పాడై పోతుంది .
అహం (నేను ) తప్పని సరిగా గౌరవం ఆశిస్తుంది . సత్యత , సేవ అనే లక్షణాలు ఉన్నప్పుడు అహనికి భరోసా పుష్కలంగా ఉంటుంది. అంటే Self Respect స్వతహాగా సమృద్ధిగా లభిస్తుంది.
నడవడిక కు దర్పణం గౌరవం.
మనిషి నడవడిక లో వినయం, విధేయత, నిజాయితీ ఉన్నప్పుడు గౌరవం సహజంగా నే ప్రకృతి , తదితరులు ద్వారా లభిస్తుంది. ఇక స్వీయ గౌరవం Self Respect అనే ప్రస్తావన ఏ మనిషి కి ఉండదు .
• అర్దం చేసుకో గలిగితే . . . మనిషి తాను పొందిన, పొందుతూ ఉన్న ప్రతీ భావనకి పూర్తిగా తానే బాధ్యుడు . . . కాకపోతే తనను తాను అన్ని కోణాలలో ను విశ్లేషించు కుంటే నే , తన యధార్థ స్థితి అంగీకరించ గలుగు తాడు . . .
ఇది రాసిన వ్యక్తి తో సహా . . .
యడ్ల శ్రీనివాసరావు 5 May 2025 , 11:00 AM.
No comments:
Post a Comment