శశి - కళ
• నగుమోము చంద్రుడా
నగవు నేడ దాచావు
నీ నగవు నేడ దాచావు .
• సిగము తోన సిగ పాటు లే కాని
సిగపూలు కాన లేదు
నీ సిగపూలు కాన లేదు .
• పౌర్ణమి కౌగిలింత పరిమళాలు
నెలవంక నెలవు నీయ లేదు
గుబాళింపు నిలువ నీయ లేదు .
• నగుమోము చంద్రుడా
నగవు నేడ దాచావు
నీ నగవు నేడ దాచావు .
• నీ వెన్నెల నీడలో ఆదమరచి ఉన్నాను
నా కన్నుల జాడలో జాలువారుతున్నావు .
• రోహిణి చెంతకు ఆరోహణ ఎలాగని
ఈ పెదవులు అడుగుతున్నాయి .
• పక్షానికి నీ పలకరింపు దిగులు
అనుక్షణం నీ శోభ కే నా ఎదురు .
• నగుమోము చంద్రుడా
నగవు నేడ దాచావు
నీ నగవు నేడ దాచావు .
నగుమోము = నవ్వుతూ ఉండే ముఖం
నగవు = చిరునవ్వు
సిగము = దేవతా ఆవేశము
సిగ పాటు = కలహం
సిగపూలు = శిఖ లోని పుష్పాలు
యడ్ల శ్రీనివాసరావు 12 May 2025 10:00 pm
No comments:
Post a Comment