నవ్వు ఏది బిడ్డా
• నవ్వు ఏది బిడ్డా
నీ నవ్వు ఏది . . .
• నవ్వడమే పరమావధి
నవ్వు ఇవ్వడమే యోగనిధి .
• జననం తో ఏడుపు
మరణం తో ఏడుపు
• మరి నడి మధ్య నంతా
నవ్వే నా . . .
జీవితం . . . నవ్వుల పువ్వే నా .
• నవ్వు ఏది బిడ్డా
నీ నవ్వు ఏది . . .
• నవ్వడమే పరమావధి
నవ్వు ఇవ్వడమే యోగనిధి .
• ఉరుకుల పరుగుల లోకం లో
బ్రతుకు భారాల యాతనలు .
• ఆలోచనల వేగం లో
మనసు నిండా రోదనలు .
• వెలసి . . . కలసి
ఆవిరి అయ్యే నా నవ్వులు
ఎండి పోయే నా పువ్వులు .
• కపట కవ్వింపుల తాళాల తో
కొందరి నవ్వులు .
• వికట నవ్వుల మేళాలు గా
కొందరి చేష్టలు .
• కాలమే నవ్వుతోంది . . .
నవ్వు కై నువ్వు
పడే యాతన చూసి .
• నవ్వు ఏది బిడ్డా
నీ నవ్వు ఏది . . .
• నవ్వడమే పరమావధి
నవ్వు ఇవ్వడమే యోగనిధి .
• కొందామంటే నవ్వు ఎక్కడ
దొరుకుతుందో తెలియుట లేదు .
• కందామంటే కకల వికల
మనసుల కి సాధ్యం కావట్లే దు.
• నవ్వుల క్లబ్ కెళితే
వికారాల కితకితలు .
• సహజమైన నవ్వు
ప్రకృతి ఇస్తుంది కదా . . .
• నవ్వు ఏది బిడ్డా
నీ నవ్వు ఏది . . .
• నవ్వ లేని బిడ్డా
నీ నవ్వు ఏది.
• నవ్వడమే పరమావధి
నవ్వు ఇవ్వడమే యోగనిధి .
యడ్ల శ్రీనివాసరావు 4 May 2025 10:00 pm
No comments:
Post a Comment