తుమ్మెద
• బంగారమా బంగారమా
పువ్వు పై సింగారమా
• బంగారమా బంగారమా
పువ్వు పై సింగారమా
• ప్రకృతి కి ఆకృతి యై
రంజింప చేసే నయగారమా .
• కొమ్మ ల పై కిలకిల లతో
రెమ్మ ల తో రెప రెప లాడే
ఓ తుమ్మెదా పరవశమా . . .
• బంగారమా బంగారమా
పువ్వు పై సింగారమా
• బంగారమా బంగారమా
పువ్వు పై సింగారమా
• నీ మేని అందాలు
విరిసిన సప్త వర్ణాలు .
• నీ మౌన రాగాలు
కుసుమ శృంగ భంగాలు .
• ఎగిరే నీ హోయనం
ఎంత హయి నమ్మా .
• అదిమే నీ చుంబనం
ఎంత మురిపె మమ్మా .
• బంగారమా బంగారమా
పువ్వు పై సింగారమా
• బంగారమా బంగారమా
పువ్వు పై సింగారమా
• వనమంత తిరిగావు
పుప్పొడిని పంచావు .
• బంధాలు కలిపావు
జీవ వైవిధ్యాన్ని పెంచావు .
• పువ్వల సంపర్కం
నీ సహయోగమే కదా .
• ప్రకృతి పారవశ్యం
నీ చలవే కదా .
• బంగారమా బంగారమా
పువ్వు పై సింగారమా
• బంగారమా బంగారమా
పువ్వు పై సింగారమా .
యడ్ల శ్రీనివాసరావు 27 May 2025 9:00 PM.
No comments:
Post a Comment