కొడుకా ఓ కొడుకా !
• కొడుకా ఓ కొడుకా !
కొడుకా ఓ కొడుకా !
• అమ్మవారి కంటే ముందు
నీ అమ్మను కొలువ రా . . .
• పండుగలు పబ్బాలు
ఇంటి అమ్మతోనే కద రా . . .
• ఆ అమ్మవారి రూపమే
నీ అమ్మ అని తెలుసుకో . . .
• ముసలిదైన గాని ముగ్గురమ్మల
మూలపుటమ్మగా కొలచుకో రా . . .
కొడుకా ఓ కొడుకా !
• పిండి పెట్టి ఒళ్ళు నలచి
వండి పెట్టి వడ్డిస్తే . . .
• ఇంటివాడి వైతివి
ఓ జంట తోడు వైతివి రా .
• ఆలి నీ అంతరమై నా కానీ
అమ్మ నీ ఆరాధన రా .
• గర్భం లో పంచింది అమ్మ ఊపిరి
దర్పం తో దీనం గా చూడకు రా .
• నీ కంటిలోన నీరు
తుడిచేది అమ్మ రా . . .
• నీ వొంటిలోన సత్తువను
సేర్చేది నీ అమ్మే రా .
కొడుకా ఓ కొడుకా !
• నీ గుండెలో లేని అమ్మ
గుడి లోన ఉండదు రా . . .
• గుడి లోన అమ్మ కూడా
ఒక అమ్మకు బిడ్డే రా .
• ఇంటిలోన అమ్మను బొమ్మగా చూస్తావు
గుడిలోన బొమ్మను అమ్మగా కొలుస్తావు .
• ఆకలేసిన అమ్మకు పస్తులు వడ్డిస్తావు
గుడిలోన బొమ్మకు నైవేద్యాలు నివేదిస్తావు .
• వెతికితే నీకు వెయ్యి దేవుళ్ళు . .
ఆ . . .
వెతికితే నీకు వెయ్యి దేవుళ్ళు . .
దొరుకుతారు గానీ
• నీ కన్నతల్లి సాటిరాదు
వేరెవరూ ఈ లోకములో . . .
• తెలుసు కో రా కొడుకా . . .
తెలుసు కో
లేకపోతే . . .
అమ్మ పాణం వదిలాక . .
ఆ . . .
అమ్మ పాణం వదిలాక . .
నువు పెట్టే పిండా కూడు
కాకులు కూడా
ముట్టవు రా . . . ముట్టవు రా .
• తెలుసు కో రా కొడుకా . . .
తెలుసు కో
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రా . . .
కొడుకా ఓ కొడుకా !
కొడుకా ఓ కొడుకా !
ఓం శాంతి . . . ఓం నమఃశివాయ 🙏
🌹 🌹 🌹
అమ్మలకు . . .
అమ్మలను కన్న పెద్దమ్మ కు
వందనములు 🙏
అందరికీ విజయదశమి శుభాకాంక్షలు 🙏.
💐 💐 💐
తులసి రామకృష్ణ , యడ్ల శ్రీనివాసరావు .
1 Oct 2025 . 10:00 PM
No comments:
Post a Comment