Wednesday, October 29, 2025

702. ప్రియ సఖుడు

 

ప్రియ సఖుడు


• మదిలో    మెరుపు    మైమరిపించే

  ఈనాటి    స్వప్నం లో .

• ఒడిలో    తలపు   వరమనిపించే 

  ఆనాటి    జన్మం  లో .

• కనులు     తెరవ గానే

  కాంతి    లోన    నీవు .

• కనులు  మూయగానే 

  కవ్వింత  లో      నేను .


• ఆనంద  నాధుడా 

‌  అరవిరిసిన     నీ   ప్రేమ ని

  ఆదమరచి    నాను .


• ఊపిరి   తాకిన   నీ    స్నేహం .

  ఈ కాలం   ఎరుగని    బంధం .


• ప్రియడి వైన    నీ    ఆరాధన లో

  పంచభూతాల    పరిమళం   తాకింది .

• సఖుడ వైన      నీ    సాంగత్యం లో

  ఈ పదములు    ప్రాణం    పోసుకున్నాయి .


• విరహం    ఎరుగని      ఈ  రాగం లో

  వైరాగ్యం   లేదు .

• కొలమానం   ఎరుగని   నీ  ప్రేమం లో

  కలవరం    లేదు .


• మదిలో   మెరుపు    మైమరిపించే

  ఈనాటి     స్వప్నం లో .

• ఒడిలో    తలపు     వరమనిపించే

  ఆనాటి      జన్మం లో .

• కనులు      తెరవ  గానే

  కాంతి  లోన   నీవు .

• కనులు      మూయగానే

  కవ్వింత లో    నేను .



యడ్ల శ్రీనివాసరావు 30 Oct 2025 , 9:30 PM.


No comments:

Post a Comment

702. ప్రియ సఖుడు

  ప్రియ సఖుడు • మదిలో    మెరుపు    మైమరిపించే   ఈనాటి    స్వప్నం లో . • ఒడిలో    తలపు   వరమనిపించే    ఆనాటి    జన్మం  లో . • కనులు     తె...