Tuesday, October 7, 2025

697 . Life is not a Failure

 

Life is not a Failure 



• Life is not a failure to anyone. Life is a Lesson to everyone.


• జీవితం ఎప్పుడు ఎవరికీ కూడా అపజయం ఇవ్వదు. జీవితం అందరికీ పాఠాలు నేర్పిస్తుంది . అపజయం అనేది కేవలం ఒక భావన మాత్రమే. అనుకున్నది జరగలేదని, సాధించలేదని ఆలోచనలతో ప్రేరేపితమైన ఒక మానసిక భావన అపజయం. ఇది కేవలం అంతర్గత దృక్పథం. ఈ భావన లోనుంచి బయటకు వచ్చి చూసినపుడు ఎంతో విశాలమైన ప్రపంచం కనిపిస్తుంది.

• జీవితం ఎప్పుడు ఎవరిని ఓడించదు, అపజయాన్ని కలిగించదు. జీవితం ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. ఆ పాఠాలు అర్దం చేసుకోవడం లో అనుభవం కొరవడి విఫలం కావచ్చు, అంత మాత్రాన జీవితం లో ఓడిపోయాం అని అనుకోవడం, అవివేకం తో కూడిన అమాయకత్వం.

• జీవితం నేర్పే పాఠాలు నేర్చుకోవడానికి సహనం ఓర్పు అవసరం . ఈ ఓర్పు సహనం అలవడినపుడు అసలు అపజయం అనే పదానికి అర్థం ఉండదు. సరికదా ప్రతి అంశం పైన అర్దం చేసుకునే దృష్టి, అవగాహన పెంచుకునే ఏకాగ్రత పెరుగుతుంది. ఇది చివరకు నీ అంతర్గత స్వభావం అనే డిక్షనరీ లో అపజయం అనే పదాన్ని పూర్తిగా తుడిచి వేస్తుంది . అనగా ఆ పదం యొక్క అర్దం స్పృహ లో లేకుండా చేస్తుంది .


• బాహ్య ప్రపంచంలో మన చుట్టూ ఉన్న వ్యవహారాలు, ధోరణుల లో కొన్ని సార్లు అనుకున్న ది సాధించలేక పోవడం వలన అపజయం పొందినట్లు భావిస్తాం . ఇది ఒకరి మానసిక పరిస్థితి ని బట్టి వారిపై ప్రభావం చూపించడం జరుగుతుంది. దీనికి అపజయం అనే పదం అలంకరించే బదులు , ఈ సంఘటన నాకు ఏదో తెలియని విషయం తెలియచేస్తుంది అని పరిశీలిస్తే అద్భుతమైన రహస్యాలు తెలుసుకోవచ్చు . దీనినే కొందరు మహారధులు అంటుంటారు , జీవితం నిరంతరం పాఠం అని. తద్వారా కలిగేది అపారమైన అనుభవం .

• ఉదాహరణకు ఒక ఆటలో తర్ఫీదు పొందిన రెండు జట్లు A, B ఆటగాళ్ళు ఉంటారు. A జట్టు విజయం సాధించింది అని అంటారు. అలా అని B జుట్టు విఫలం అయింది అని కాదు . B జట్టు ఇంకా ఏదో నేర్చుకో వలసినది ఉంది అని అర్దం.

• ఇదే AB జట్లు మరో రోజు ఆడితే B జుట్టు గెలిచిందని అంటారు. అంటే A జుట్టు విఫలం అయింది అని కాదు.  ఇక్కడ గమనించవలసినది కాలం అనే ప్రయాణం లో కొన్ని సార్లు అనుకున్నది సాధించాం అదే విజయం అనుకుంటాం. కానీ కాలం అనుకూలించక సాధించలేకపోతే అదే అపజయం గా భావిస్తాం. జయపాజయాలు సహజం. ఈ రెండింటి మధ్య ఉత్పన్నమయ్యే భావోద్వేగాన్ని స్థిరీకరించడం , జీవితం నేర్పించే అతి పెద్ద పాఠం .


• జీవితం చాలా విలువైనది . అందులో విఫలం సఫలం , దుఃఖం సంతోషం, మంచి చెడు , పాపం పుణ్యం ఇలా ప్రతీ అంశం తో జరిగే కర్మల అనుభవాలు నిరంతరం నేర్చుకోవడానికి మనం పుట్టాం . ఇది జన్మ జన్మలు చేస్తూ ఉండవలసిన నిరంతర చర్య.


జీవితం ఎప్పుడు ఎవరిని ఓడించదు అపజయాన్ని కలిగించదు.  జీవితాన్ని అనుభవిస్తున్న మనమే మన ఆలోచనల లోని  సమర్థత శక్తివంతం గా మరియు  విధి విధాన లోపం  వలన అపజయం పొందినట్లు  భావిస్తాం .  మనం నేర్చుకోవడానికే  ఇక్కడ  ఉన్నాం,  అంతే కానీ  కుంగుబాటు (Depression) కి గురి అవడానికి గాని,  ఇతరులపై  అభియోగాలు మోపడానికి గాని , వ్యవస్థలను  వేలెత్తి చూపడానికి గాని లేము .  జీవితం ఒక ఆట. ఆటలో అన్నీ ఉంటాయి .  అవి సహజమైనవి గా  భావించి సానుకూల దృక్పథంతో ఉండాలి .


ఓం శాంతి 🙏 

ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు 7 Oct 2025 , 11:00 PM.


No comments:

Post a Comment

697 . Life is not a Failure

  Life is not a Failure  • Life is not a failure to anyone. Life is a Lesson to everyone. • జీవితం ఎప్పుడు ఎవరికీ కూడా అపజయం ఇవ్వదు. జీవిత...