మనసు మాయ
• భ్రమ లలో బ్రతుకు భారము
మనసా ఓ మనసా
భ్రమ లలో బ్రతుకు భారము .
• భ్రమ చుట్టూ భ్రమణమే మాయ
అది యే
ఆనందపు అల్లకల్లోలాల లోయ .
• భ్రమ కలిగించు మోహము
అది యే
బుద్ధి లో నిలిచేటి వ్యామోహము.
• భ్రమ లలో బ్రతుకు భారము
మనసా ఓ మనసా
భ్రమ లలో బ్రతుకు భారము .
• నాది నాదనుకొంటు
నిమిషమైన నిలువవు మనసా .
• నేలను విడిచిన నాడు
నీతోడు నడిచేది ఏదో తెలుసా .
• మిధ్య లో మునిగి ఉన్న మనసా
భ్రాంతి లో తేలుతున్నావు తెలుసా.
• భ్రమ లలో బ్రతుకు భారము
మనసా ఓ మనసా
భ్రమ లలో బ్రతుకు భారము .
• నేత్రములు చూసేవన్ని నిజము కాదు .
మనో నేత్రం తెరచిన నాడు
అది నీకు తెలియును .
• వీనులు వినేవన్నీ నిజము కాదు .
మౌనం తో మెలిగిన నాడు
అది నీకు తెలియును .
• భ్రమ లలో బ్రతుకు భారము
మనసా ఓ మనసా
భ్రమ లలో బ్రతుకు భారము .
వీనులు = చెవులు
యడ్ల శ్రీనివాసరావు 4 Jan 2026 1:30 PM.

No comments:
Post a Comment