వ్యక్తుల నుండి భావోద్వేగ స్వతంత్ర్యత
భావోద్వేగాలు
సంతోషం, విచారం, కోపం, భయం, ప్రేమ, శత్రుత్వం.
• మనకున్న బంధాలలో, కొన్ని బంధాలపై మనం భావోద్వేగంగా ఆధారపడి ఉంటాం. మనం ఇతరుల అవసరాలు , అభిప్రాయాలు మరియు భావాల గురించి ఆలోచిస్తూ అసమంజసంగా సమయాన్ని వెచ్చిస్తాము . మన సొంత అవసరాలు ప్రక్కకు వెళ్ళిపోతాయి ఎందుకంటే మన భావాలు , నిర్ణయాల నియంత్రణను పూర్తిగా ఇతరులకు ఇచ్చేస్తాము . వారు మనల్ని ప్రేమించాలని వారి నుండి ఆశిస్తూ వారిపై ఆధారపడి ఉంటాం, ఇది ఇరువురికీ మంచిది కాదు.
• మీ మనసు ఎవరితోనైనా భావోద్వేగంగా చిక్కుబడి ఉండటాన్ని ఎప్పుడైనా గమనించారా?
• ఏ వ్యక్తి అయినా ఎప్పుడూ మీ మనసులో ఉంటున్నారా ? అటువంటి వ్యక్తి ప్రవర్తనలో కొద్దిగా తేడా వచ్చినా మీ మనసు పాడవుతుందా ?
• భావోద్వేగంగా ఇతరులపై ఆధారపడటం మనం అనుకున్న దానికన్నా చాలా ప్రమాదకరమైనది. ఇది గాఢమైన వ్యసనంలా కూడా మారవచ్చు. మన మనసు కొందరి ప్రవర్తనపై ఆధారపడి ఉన్నప్పుడు , వారు మనం కోరుకున్న విధంగా ఉండాలని ఆశిస్తాం. ఎప్పుడూ వారి నుండి ప్రేమ , పలకరింపు , సాన్నిహిత్యం , అభిప్రాయాలు మరియు వారి సమ్మతిని కోరుకుంటాము . ఇందులో ఏ ఒక్కటి లభించకపోయినా గానీ మనకు అభద్రతా భావన కలుగుతుంది . నిజానికి మనకు భావోద్వేగంగా చాలా శక్తి ఉంది . మనకు వారి నుండి ఏమీ అవసరం లేదు . వారు ఎలాంటి వారో అర్థం చేసుకుని వారితో అలాగే వ్యవహరిద్దాం , అంతేకానీ నాకు భావోద్వేగ హాయిని వారు అందించాలని ఆశించ వద్దు . నిజమైన ప్రేమ అన్నింటి నుంచి శాశ్వతమైన విడుదలను ఇస్తుంది . అలాకాకుండా , ఆధారపడి ఉంటే అది వారినీ , మనల్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.
మిమ్మల్ని మీరు ప్రేమించు కోండి . మీ మనసుతో సమయాన్ని గడపండి. మనసుకు గుర్తుచేయండి – నా బంధాలు భావోద్వేగ స్వతంత్ర్యత మరియు ప్రేమ అను పునాదిపై నిల్చుని ఉన్నాయి.
• ప్రశాంతంగా కూర్చుని, వ్యక్తుల నుండి భావోద్వేగంగా ఆశ్రితమై ఉండే స్వభావాన్ని ఎలా తొలగించుకోవాలి , తిరిగి స్వాతంత్ర్యాన్ని ఎలా పొందాలి అని ఆలోచించండి . మిమ్మల్ని మీరు స్పష్టంగా చూసుకోండి , మీ అవసరాలను గుర్తించండి . మీ ఆత్మ గౌరవం పెరుగుతుంది , మీ మమకారాలు, ఆశ్రిత తత్వం తగ్గుతాయి .
మీకు మీరు ఇలా గుర్తు చేసుకోండి – నేను శక్తిశాలి స్వరూపాన్ని . నేను భావోద్వేగపరంగా స్వతంత్రంగా ఉన్నాను , నాకు ఎలా కావాలో , ఏమి కావాలో నాకు తెలుసు . నా ఆంతరిక ప్రపంచాన్ని ఎవ్వరూ ప్రభావితం చేయలేరు . ఇదే నా జీవన మంత్రం అని మననం చెయ్యండి .
భావోద్వేగాలు చూపడం , ఆశించడం కన్నా . . . . . గౌరవించడం , గౌరవించ బడడం మిన్న .
ఆశ్రితము = ఆశ్రయించడం, ఆధారపడడం
ఓం శాంతి 🙏
ఓం నమఃశివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు 17 Oct 2025 9:00 PM.
No comments:
Post a Comment