మన నమ్మకాలు
మనం ఏది విశ్వసిస్తామో అదే సాధిస్తాం .
• జీవిత ప్రయాణంలోని నమ్మకాలన్నీ ఎక్కడ నుండి వచ్చాయని మనం కొన్ని సార్లు ఆశ్చర్యపోతుంటాం ? మనం సంతోషం, ప్రేమ, గౌరవం, కోపం లేదా ఒత్తిడి గురించి ఏది నమ్మినా అవి ఎక్కువగా మన సామాజిక స్థితి ఆధారంగా మనపై మనం తయారు చేసుకున్నవే .
• మనం ఎప్పుడైనా కాసేపు ఆగి, సరైనది అంగీకరించడానికి , సరికానిది వదిలేయడానికి పరిశీలించామా ?
ప్రతి పరిస్థితిని మన నమ్మకాలను బట్టి గ్రహిస్తుంటాము . మన ఆలోచనలు, భావాలు, వైఖరి, అలవాట్లు, వ్యక్తిత్వం మరియు చివరకు మన భాగ్యం మన జీవనశైలి పై ఆధారపడి ఉంటుంది. దీని అర్థం, మన నమ్మకాల ఆధిపత్యం , ప్రభావం మనం ఇది వరకు తయారు చేసుకున్న , ప్రస్తుతం చేసుకుంటున్న భాగ్యం పై ఉంటుంది.
మనం ఒక్క తప్పుడు నమ్మకాన్ని కూడా కలిగి ఉండకూడదు.
• సమాజం పరిమితం ( limited ) చేసే నమ్మకాలను వ్యాప్తి చేస్తుంది ఉదాహరణకు . . . కోపం అవసరం , విజయం సాధించడంలో ఆనందం ఉంది , ఒత్తిడి సహజం , వ్యక్తులు మరియు పరిస్థితులు నేను ఎలా భావించాలో నిర్ణయిస్తాయి . . . మొదలైనవి.
• కోపం అవసరమని నమ్మి, కోపాన్ని పదే పదే ఉపయోగిస్తున్నాం . కాబట్టి మనం శాంతియుతంగా ఉండాలనుకున్నా అది తాత్కాలికం అవుతుంది .
• కొత్త నమ్మకంతో ప్రయోగాలు చేయండి: కోపం హానికరం, ఏదైనా పనిని పూర్తి చేయించడానికి మార్గం ప్రేమయే . ఈ నమ్మకం ప్రేమ మరియు ఆనందాన్ని సహజం చేస్తుంది . తప్పుడు నమ్మకాల పొరలను సాధికారతతో భర్తీ చేద్దాం.
• మనకు మనం గుర్తు చేసుకుందాం : నేను ప్రతి నమ్మకం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని, ప్రయోజనకరమైన వాటిని స్వీకరిస్తాను. నా నమ్మకాలన్నీ నన్ను సంతోషంగా, ఆరోగ్యంగా మరియు నా ప్రపంచంతో సామరస్యంగా ఉంచుతాయి.
• మనం చిన్నతనం నుండి ఎన్ని నమ్మకాలను స్వీకరిస్తూ జీవించామో ఏనాడైనా కాస్త ఆగి పరిశీలించుకున్నామా ?
• మనం మన గురించి, ఇతరుల గురించి లేదా ప్రపంచం గురించిన నమ్మకాలను, వాటిని సొంతం చేసుకునే ముందు వాటి ప్రాముఖ్యతను తెలుసుకుంటున్నామా ?
లేదా
• మనం మన కుటుంబం , విద్య , సమాజం లేదా మన గత అనుభవాల ద్వారా మన మనస్సులో నింపిన నమ్మకాలను అంగీకరిస్తున్నామా ?
మన నమ్మకాలే మనకు పరమ సత్యాలు. నమ్మకాలను కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పోల్చవచ్చు. అవి మన జీవితాన్ని నడిపిస్తున్నాయి . మన ఆలోచనలు, మాటలు మరియు ప్రవర్తన లో , ఒక్క తప్పుడు నమ్మకం ఉన్నా అది చాలా హాని చేయగలదు. అందమైన జీవితాన్ని గడపకుండా మనల్ని అడ్డుకునే పరిమిత , తప్పుడు నమ్మకాలను మనం మనసులో పరిశీలించుకుని మార్చుకుందాం. కాసేపు కూర్చుని, మన స్వంత ఎదుగుదల, శ్రేయస్సు మరియు విజయానికి అడ్డంకులుగా ఉన్న నమ్మకాలను పరిశీలించుకుని తొలగించుకోవడానికి మన మనస్సును సిద్ధం చేసుకుందాం .
మనం ఒక నమ్మకం పై దృష్టి సారించినపుడు ఏ విధమైన. అలజడులు భయం లేని విశ్వసనీయత సంతోషం మనసు లో కలగాలి .
మన జీవితాన్ని ఒక పరిశోధనాలయం (Reasearch Lab) గా చూడగలిగినప్పడు , జీవితం లో జరుగుతున్న ప్రతి అంశం ఒక ప్రయోగం గా భావిస్తే , లభించే ఫలితం ఒకొక్క కొత్తదనాన్ని ఆవిష్కరిస్తుంది .
ఓం శాంతి 🙏
ఓం నమఃశివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు 13 Oct 2025 5:00 PM
No comments:
Post a Comment