సత్సంబంధాలు
• సత్సంబంధాలు అంటే ఎప్పుడూ ఒకరితో ఒకరు కోపం, కలతలు చెందకుండా లేదా చిరాకు పడకుండా ఉండటం కానే కాదు .
సత్సంబంధం అంటే కలత చెందిన దానిని మీరు త్వరగా పరిష్కరించుకొని తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడం.
• ఒకరితో వాదన , నమ్మక ద్రోహం , ప్రవర్తన లో లోపం , సహించలేని మోసం జరిగిన తరువాత మనం బాధపడి నిరాశకు గురవుతాము . ఎంతో సమయం కోపం లేదా బాధతో ఉండటాన్ని మనం ఎంచుకుంటాము . మన బాధను సమర్ధించుకొని , అది ఇతరులు చేసిన పొరపాటుగా భావించి వారు సరిదిద్దుకోవాలని ఆశిస్తాము . కొన్నిసార్లు , వారితో ఇక గతంలో వలే ఉండలేమని కూడా భావిస్తాము. జరిగిన సంఘటన తో సంబంధం లేకుండా సాధారణ స్థితికి రావడానికి కేవలం 1 ఆలోచన మాత్రమే కావాలి .
కానీ మనస్సు ఇలా ప్రశ్నించడం మొదలు పెడుతుంది , దానికి సమాధానాలు ఇలా ఇవ్వండి.
1. అది వారి తప్పు అయినపుడు , నేను దీన్ని ఇప్పుడు ఇలా ఎందుకు పునరుద్ధరించు కోవాలి?
ఎందుకంటే నా అహం కంటే నా సంబంధం ముఖ్యం కనుక .
2. ఇంత త్వరగా సమాధాన పరచడం ఎందుకు, కనీసం వారిని తమ తప్పును గ్రహించనివ్వాలి కదా ?
ఎందుకంటే గడిచిన ప్రతి క్షణం ఇరువురికి బాధను కలిగించి మా సంబంధాన్ని బలహీనపరుస్తుంది.
3. నేను ముందు అడుగు వేస్తే , నేను బలహీనంగా పరిగణించ బడతానేమో ?
క్షమించడం, మరచిపోవడం మరియు ముందుకు సాగడం అనేది శక్తి , కనుక ఇరువురికీ నేను ఆ శక్తిని ఇస్తాను.
4. నేను తిరిగి సాధారణ స్థితికి వస్తే , వాళ్ళు కూడా అలాగే తిరిగి మారుతారా ?
వారు మారడానికి సమయాన్ని తీసుకోవచ్చు, కానీ నేను సాధారణ స్థితికి వస్తే , మారే ప్రక్రియ ప్రారంభమైంది కనుక అతి త్వరలో వారు సాధారణ స్థితికి వస్తారు .
5. నేను ఉపేక్షించబడతానా ?
నేను చూపించే ప్రేమను, శ్రద్ధను ఇతరులు తక్కువ చేసి చూస్తే , అది నా అదృష్టం. నేను వారిని ఎప్పుడూ ప్రేమిస్తున్నానని వారు నమ్మడానికి నేను వారికి ఒక కారణం ఇచ్చాను .
ఈ విధంగా చాలా ప్రశ్నలు ఉండవచ్చు .
కానీ మన సంబంధమే మన ప్రాధాన్యత అని, తప్పొప్పులు కన్నా అందరి సంతోషం మనకు ముఖ్యం అని నిర్ణయించుకుంటే ప్రతి ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉంటుంది.
సత్సంబంధం = సత్ + సంబంధం
సత్యం తో నిజాయితీ ని నింపుకొనే సంబంధం సత్సంబంధం
అసత్యాలు , అప నమ్మకాలు , పొరపాట్లు జరిగిన విషయాలను వాస్తవ స్థితి తో అర్దం చేసుకుంటూ , సరిదిద్ది కుంటూ అంగీకరించడం జరుగుతూ ఉన్నప్పుడు సత్సంబంధాలు సురక్షితంగా ఉంటాయి .
స్వయం యొక్క అవసరాలు కంటే , ఇతరుల అవసరాలను యధార్థ రీతిలో గుర్తించి కొనసాగించే బంధం సత్సంబంధం.
Re - Lation .
Re = Again , Back (తిరిగి , మరలా)
Lation = The act of bearing ( భరించేది , మోయ గలిగేది ).
తిరిగి భరించేది , మరలా మోయ గలిగేది
Re - lation .
💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐
నెగెటివ్ శక్తులు
• నెగెటివ్ శక్తులు గ్రహించకండి :
ఇతరుల నెగిటివ్ శక్తిని మనం వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు దానిని గ్రహించడం మరియు తిరిగి సృష్టించడం చాలా సులభం.
ఇందుకు చక్కని ఉదాహరణ – టి.వి చూడటం , సినిమా లకు ప్రభావితం అవ్వడం. వీటిలో ప్రదర్శించే నటుల నాటకీయ ( డ్రామా ) జీవితాలలో ఇరుక్కుపోయి నటన లోని భావోద్వేగ స్థితులను చూస్తూ ఉన్నవారు అవి నెమ్మదిగా తమలోనికి గ్రహిస్తుంటారు .
ఆ తరువాత , వారు తమ దైనందిన నిజ జీవితంలో అడుగు పెట్టినప్పుడు , నిర్ణయాలు తీసుకోవడంలో, ఇతరులను చూసే దృష్టి కోణంలో మునుపటి టి.వి , సినిమా డ్రామా ల ద్వారా చూసి స్వీకరించిన నెగిటివ్ శక్తి పని చేయడం ఆరంభం అవుతుంది .
ఇలా కేవలం సినిమా, టి.వి నాటకాల లోని ప్రభావం మాత్రమే కాకుండా , నిజ జీవితంలో సహచరుల సాన్నిహిత్యం లో మెలిగే సమయం లో ఒకరి యొక్క నెగెటివ్ శక్తి తెలియకుండా నే గ్రహించడం కూడా అనేక సార్లు జరుగుతుంది.
• నెగెటివ్ శక్తులు చూపించకండి :
మనం ఒకరి నుంచి స్వీకరించిన నెగెటివ్ శక్తి ని తిరిగి వారికి పంపితే ఏమవుతుంది ?
వారు తిరిగి మనకు పంపుతారు .
అప్పుడు మనమేం చేస్తాము ?
మళ్ళీ తిరిగి వారికి మనం పంపుతాము .
ఇలా జరుగుతూనే ఉంటుంది . దీనినే సంబంధాల గడియారపు లోలకం , డింగ్ డాంగ్ అంటారు.
ఇలా ఎంత కాలం జరుగుతుంది ?
కుటుంబాలలో జీవితాంతం కొనసాగుతుంది . కార్పొరేట్ ఆఫీసు లలో అయితే కొన్ని సంవత్సరాలు జరుగుతుంది .
• నెగెటివ్ శక్తులు మార్చండి :
మనందరికీ శక్తిని మార్చగల సత్తా ఉంది.
పిల్లవాడు తన కోపాన్ని తల్లిపై చూపిస్తే తల్లి తిరిగి కొడుకుపై కోపాన్ని చూపిస్తుందా ?
లేదు, పిల్లవాడి అప్పటి మూడ్‌ను అర్థం చేసుకుని, ఆ నెగిటివ్ శక్తిని స్వీకరిస్తుంది , దానిని మారుస్తుంది, తిరిగి సానుభూతి , ప్రేమ , ఆధారము వంటి సుగుణాలతో అతనికి ఇస్తుంది.
ఇలా మనం మన పిల్లలతో చేయగలిగినప్పుడు ఇతరులతో ఎందుకు చేయలేము ?
ఈ నెగిటివ్ చక్రాన్ని ఎవరో ఒకరు ఆపాలి కదా. లేకపోతే ఈ నెగిటివ్ శక్తి అలవాటుగా మారి దానినే ఇస్తూ ఉంటాము.
బంధాలు ఏవైనాకానీ , మనం ముందుగా మారి , ఇతరులకు పాజిటివ్ శక్తిని పంపుదాము . అప్పటికి ఇతరులలో నెగెటివ్ శక్తి అలానే ఉండి , ఆ శక్తి వలన కలుషిత స్థితి అధికం అవుతున్న వేళ , సంతోషంగా శాశ్వతం గా వారికి బిందువు (పుల్ స్టాప్) పెడదాం .
ఓం శాంతి 🙏
ఓం నమఃశివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు 10 Oct 2025 , 3:00 PM
No comments:
Post a Comment