శివ శాంతి
• శాంతి స్వరూప శశి వదన
శాంతి స్వరూప శశి వదన .
• మా దేహం నీ స్మృతి సదనం
మా ప్రాణం శాంతి కాముకం .
• నీ వాసం పరంధామం .
సూర్యచంద్రులు చేరని తేజోమయం .
• నీ స్థానం నిర్వాణ ధామం .
పవనగీతికలు లేని మౌన సాగరం .
• క్షణము లో చేరే యోగము తో
నీ సన్నిధానం .
• తక్షణము పొందే ధ్యానము లో
నీ శక్తి ధారణం .
• శాంతి స్వరూప శశి వదన
శాంతి స్వరూప శశి వదన
• మా దేహం నీ స్మృతి సదనం
మా ప్రాణం శాంతి కాముకం .
• శివమను స్వరం
మన బంధానికి పాశం .
• తెలియక ఈ సత్యం
ఎన్నో భవబంధాలకు వశం .
• నీ మౌనం మనోహరం
అదే మేలుకొలుపు దివ్యాస్త్రం .
• నీ జ్ఞానం మనోవికాసం
అదే జీవనయానపు రాజరికం .
• నీ సహవాసం దివ్యానుభూతం.
అది జన్మ జన్మల పుణ్యఫలం .
• నీ స్నేహం మధురానుభూతం
అది వర్ణ కు రాని అతీంద్రియ సుఖం .
• శాంతి స్వరూప శశి వదన
శాంతి స్వరూప శశి వదన
• మా దేహం నీ స్మృతి సదనం
మా ప్రాణం శాంతి కాముకం .
ధన్యవాదములు శివ బాబా. 🙏
మీ కోసం రాయాలి అని మనసు తపన పడుతున్న ఈ సమయంలో , ఏమి రాయాలో తెలియక ఆలోచనల శూన్యం తో , చేతులు కదలడం లేదు . కానీ , నా మనసు ఈ క్షణం రాయాలి అని ఒత్తిడి చేస్తుంది . కానీ రాసే శక్తి లేదు .
ప్రేమ తో నోరు తెరిచి మిమ్మల్ని అడిగిన , కొద్ది క్షణాలలో నే మీరు ఈ ఆలోచనలను ధారణ చేశారు , ఇలా రాయించారు. నా ఆర్తి ని తీర్చారు . ఇది మీ శక్తి కి , మన బంధానికి నిదర్శనం అనడానికి , ఇంతకు మించి ఈ నిమిత్తమాత్రునికి ఏం కావాలి శివ బాబా.
ధన్యవాదములు శివ బాబా. 🙏
కాముకం = కోరుకోవటం
పరంధామం = ఇహ లోకం కానిది . పర లోకము.
నిర్వాణధామం = వాణి లేని లోకం. నిశ్శబ్ద లోకం
పవనగీతికలు = గాలుల అలలు
వర్ణ = వర్ణించు , వివరించు
యడ్ల శ్రీనివాసరావు 5 Oct 2025 9:30 AM.
No comments:
Post a Comment