సాహితీ బంధం ✍️
• కల వో … కళ వో …
కనులలో విరిసిన కవిత వో ...
• శిల వో … శిల్పాని వో ...
రాతలలో చెదరని సాహితి వో.
• మనస నే రధము కు రంజని వై
లత లలే అల్లుకున్న పద కావ్యమా
ఏ జన్మ బుణమో … ఈ రచనా భాగ్యం.
• తలప నే బావి లో గంగ వై
అల లొలికే పరవళ్ల పద కోశమా
ఏ నాటి బంధం ... ఈ అక్షర సౌభాగ్యం.
• కల వో … కళ వో …
కనులలో విరిసిన కవిత వో ...
• శిల వో … శిల్పాని వో
రాతలలో కదిలిన సాహితి వో.
• సరి కొత్త సృష్టి కి కల్పన వై
పుష్పక విమాన విహంగ మైనావు
ఏ జన్మ లిప్తం … ఈ వ్యాసం.
• కానరాని అందాలకు దర్శిని వై
మస్తక మణి తేజో కమనీయ మైనావు
ఏ నాటి కృతం … ఈ చరితం.
• చిగురించే పూవుల జీవం … రచన
ఆమని రాగాల హ్లదం … కవిత
సాగర కెరటాల సంబరం ... సాహితి
మంచు తెరల లాలన సమీరం … కావ్యం
మస్తక మణి = భృకుటి స్థానం లోని ఆత్మ
కృతం = గతం లో చేసినది.
లిప్తం = పూయబడినది, అంటించ బడినది (plastered).
యడ్ల శ్రీనివాసరావు 13 Aug 2024 , 3:30 pm.
No comments:
Post a Comment