తాండవ తన్మయం
• తాండవం తన్మయం
శివ తాండవం తన్మయం .
• తాండవమే అభినయాల ఆనంద హేల .
తాండవమే పరవశాల ప్రదర్శన లీల .
• భావాలు . . . భంగిమలు
అభిరుచులు . . . ఆస్వాదనలు
ఉద్వేగాలు . . . ఉపమానాలు
• శివుని వదనం చంద్ర బింబం
నఖశిఖ పర్యంతం తేజో విలాసం .
• ముని మౌనం మహిమాన్వితం
లయకర వలయం విశ్వ తరంగం.
• తాండవం తన్మయం
శివ తాండవం తన్మయం .
• తాండవమే జీవ కళా సౌజన్యం .
తాండవమే దివ్య సృష్టి రూపకం .
• త్రి శూలం . . . త్రిగుణ ఆత్మకం.
అర్ధ నారీశ్వరం . . . అగ్ని హోత్రం
అఖండం . . . జ్యోతి స్వరూపం .
• శివుని రహస్యం సృష్టి చేతనం
నృత్య రూపకం కళా విన్యాసం .
• ఢమరుక నాదం సింహ స్వప్నం
మాయా మోహం శంకరగిరి మాన్యం .
• తాండవం తన్మయం
శివ తాండవం తన్మయం .
• తాండవం శత్రు సంహారం
శివ తాండవం లయకరం .
• తాండవం శత్రు శేషం
శివ తాండవం స్థితి ఆవిర్భావం .
లయకర వలయం = ఆరా
యడ్ల శ్రీనివాసరావు 15 March 2025 6:00 pm.
No comments:
Post a Comment