Friday, March 21, 2025

610. తారలలో సితారలు

 

తారలలో  సితారలు  



• నా బడి   రాగం    సరాగం

  సవ్వడి   చేసే     నేడు   ఆనందం .


• తారలలో     సితారలు    రెండున్నాయి .

  ధృవ తార     ఇన్నయ్య   ఫాదర్

  దివ్య తార    జోజిబాబు   ఫాదర్          (2)


• ఆ   సితార ల    వెలుగు   మా   భాగ్యం .

  వారు  చూపిన   ప్రకాశం   మా  జీవన  యానం .


• విలువలెన్నో      నేర్పించారు . . .

  వరములు     ధారణ   చేశారు .

• ఆచరించిన    వారందరూ 

  అయ్యారు   భాగ్య శాలురు .


• క్రమ శిక్షణ    చొప్పించారు . . .

  కరుణను    వరుణం    చేశారు .   

• పాటించిన     వారందరూ

  అయ్యారు  ఎందరికో   మార్గదర్శకం  .


• నా బడి     రాగం    సరాగం 

  సవ్వడి    చేసే     నేడు   ఆనందం .


• తారలలో    సితారలు    రెండున్నాయి .

  ధృవ తార     ఇన్నయ్య    ఫాదర్

  దివ్య తార     జోజిబాబు ఫాదర్          (2)


తారలెన్నో    చూస్తున్నాయి 

  నేడు

  ఆ    సితారల     వైపు .

• విశ్వమంతా     వీస్తున్నాయి

  నేడు

  వారి    ప్రేమ     పరిమళాలు .


• తారలెన్నో     పిలుస్తున్నాయి 

  నేడు

  ఆ   సితారల    కోసం  .

• విశ్వమంతా   నిండి ఉన్నాయి 

  నేడు

  వారి     సేవా    సైన్యం.


• నా   బడి     రాగం    సరాగం

  సవ్వడి    చేసే    నేడు    ఆనందం.

• నా బడి     రాగం     సరాగం

  సవ్వడి   చేసే     నేడు     ఆనందం.



యడ్ల శ్రీనివాసరావు  18 March 2025 , 

2:00 PM

.


No comments:

Post a Comment

618. వెలుగు రేఖలు

  వెలుగు రేఖలు   • ఎన్నో   జన్మల    భాగ్యం   ఈ   వెలుగు   రేఖలు  . • అలసిన    వారే      తీరం    చేరును .   సొలసిన   వారికే    అమృతం   దొరక...