మా బడి - మా సుగుణాలు
• మా బడి …. మా బడి
మా జీవన యాన గుడి.
• బడి లోని గురువు లందరూ దేవతలు
సుడి లేని ఎందరికో శ్రీకారం చుట్టారు.
• విలువలతో తిలకం దిద్దారు
బుద్ధి సంస్కారాలు నేర్పారు .
• క్రమ శిక్షణ ముఖ్యం చేశారు
క్రమం తప్పితే తాట తీశారు .
• మా బడి …. మా బడి
మా జీవన యాన గుడి.
• మా బడి హర్షిస్తుంది నేడు . . .
మాయా వ్యసన వికారాల బురదలో
మేము కూరుకు పోలేదని .
• మా బడి చెపుతుంది నేడు . . .
మేమంతా తన కొంగు బంగారం అని.
• విలువలను పాటిస్తాం . . .
అది మా మనస్సాక్షి కి తెలుసు .
• తోటి వారిని ప్రేమిస్తాం . . .
అది పంచభూతాల కి తెలుసు .
• సత్యాలనే చెపుతుంటాం . . .
అది ఆ పరమాత్మ కు తెలుసు.
• నిరహంకార నిర్మల వీరులం . . .
ఆది మా అంతరాత్మ కు తెలుసు.
• గురువులను ఆచరిస్తాం . . .
అది మా నడవడిక కు తెలుసు .
• స్నేహానికి ప్రాణం ఇస్తాం . . .
అది మా మిత్రులందరికీ తెలుసు.
• బడి దిద్దిన బ్రతుకు లు మావి
నేటికీ బడి తోనే ముడిపడి ఉన్నాయి .
• మా బడి …. మా బడి
మా జీవన యాన గుడి .
యడ్ల శ్రీనివాసరావు 20 March 2025 7:00 PM
No comments:
Post a Comment