ఈ దేహం
• శివ స్మరణం . . . శివ స్మరణం
బుద్ధి కి తస్మతం .
• హరి మననం . . . హరి మననం
సిద్ధి కి సంకల్పం .
• శివుని లోని హరి
విశ్వ రాజ్యాధికారి.
• బుద్ధి లోని సిద్ది
విఘ్న విజయ కారి.
• శివ స్మరణం . . . శివ స్మరణం
బుద్ధి కి తస్మతం .
• హరి మననం . . . హరి మననం
సిద్ధి కి సంకల్పం .
• లక్ష్మి నారాయణుల జీవనం
ప్రకృతి పురుషుల ఆదర్శం .
• రాధా కృష్ణుల బృందావనం
ఆలు మగల ప్రేమాన్వితం .
• బ్రహ్మం బహు జ్ఞానం .
శంకరం సృష్టి లయకారం .
• రావణం దశ వికారాల కాష్టం .
మాయం అరిషడ్వర్గాల వలయం .
• అష్ట శక్తులు
ఆది శక్తి ఉద్బోదకాలు .
• అష్ట సిద్ధులు
అర్థనారీశ్వరుని ఆవిర్భావాలు.
• సర్వ సారూప్యాల
ఆవాహనం
ఈ దేహం . . . ఈ దేహం .
• శివ స్మరణం . . . శివ స్మరణం
బుద్ధి కి తస్మతం .
• హరి మననం . . . హరి మననం
సిద్ధి కి సంకల్పం .
తస్మతం = ముత్యాలు గుచ్ఛడం.
యడ్ల శ్రీనివాసరావు 24 March 2025 8:30 pm.
No comments:
Post a Comment