Tuesday, February 25, 2025

603. HAPPY BIRTHDAY SHIVA BABA-శివోదయం

 

🎈HAPPY BIRTHDAY🎈

🎉 SHIVA BABA 💐

 🎂 🪐

🍭🍬🍫 


🙏 శివోదయం 🙏



• శివ  శివ  శంకర

  హర  హర  సుందర.


• రాగము    లెరుగని    ఈ ఆలాపన లో

  సవ్వడి   చేసే    నీ నామం .

  శివాయ    ….  ఓం నమఃశివాయ .


• పదములు   చేరని    ఈ పల్లవి లో

‌  కవ్వడి   చేసే    ఈ లేఖనం .

  శివాయ   …  ఓం  నమఃశివాయ .

 

• దోసెడు   జలధారణ  తో

  ధన్యము  చేస్తివి .

• కడివెడు   పుష్పార్పణ  తో

‌  భాగ్యము  నిస్తివి .

 

• ఎండిన   గుండె లో     

  జ్ఞానామృతం   నింపావు .

‌• మర  జీవము లో     

  మాధుర్యం   తెలిపావు .


• శివ   శివ   శంకర

  హర   హర    సుందర.


• రాగము   లెరుగని    ఈ ఆలాపన లో

  సవ్వడి   చేసే    నీ నామం .

  శివాయ  …   ఓం నమఃశివాయ .


• పదములు   కూడని   ఈ పల్లవి లో

  కవ్వడి   చేసే    ఈ లేఖనం .

  శివాయ   …   ఓం నమఃశివాయ .


తొలకరి     మొగ్గ లకు

  సౌందర్యం     నీ   దృష్టి రూపం .

• చిలకరి     జల్లు లకు

  సంతుష్టం     నీ    స్మృతి స్వరం .


• నీ   పాణిగ్రహణం  తో    చూసాము

  విశ్వం  లోని   గంధర్వం .

• వర్ణన    లేని    భావం తో

  విస్తారం   అయింది    ఆనందం .


• శివ    శివ   శంకర

  హర   హర   సుందర.


• రాగము   లెరుగని    ఈ ఆలాపన లో

  సవ్వడి    చేసే    నీ నామం .

  శివాయ    …    ఓం నమఃశివాయ .


• పదములు    కూడని    ఈ పల్లవి లో

  కవ్వడి   చేసే    ఈ లేఖనం .

  శివాయ   …    ఓం నమఃశివాయ .


• దివ్య కాంతి  లో    కనక మై   

  నా కనుపాప  న    నిండావు .   

• విను వీధి   న      ఓం కార మై

  నా వీనుల లో     వెలిసావు .

  శివాయ   …   ఓం నమఃశివాయ .


• శివ శివ శంకర

  హర హర సుందర.

• శివ శివ శంకర

  హర హర సుందర.


కవ్వడి =  రెండు చేతుల  సమ  శక్తి.

పాణిగ్రహణం =  చేయి పట్టుకొని.  

వీనులు = చక్షువులు, చెవులు.



Mount Abu  ...  Diamond Hall 💎 ✍️

ఓం నమఃశివాయ 🙏

ఓం శాంతి.

శివరాత్రి శుభాకాంక్షలు.💐🌹


యడ్ల శ్రీనివాసరావు 25 Feb 2025 , 6:00 pm


Sunday, February 23, 2025

602. చెప్పకు ఎపుడు శివుని తో

 

చెప్పకు ఎపుడు శివుని తో


• చెప్పకు   ఎపుడు   శివుని తో

  నేను  ఒంటరి  అని .

• చెప్పకు   ఎపుడు   శివుని తో

‌  నాకు   ఎవరూ   లేరని .


• దైవం    నీ తోడై   ఉంది   చూడు

  ఇక     లోటేముంది    నీకు .

• ధైర్యం   నీ నీడై   ఉంది   చూడు

  ఇక   భయ   మేముంది   నీకు.


• సముద్రం    ఈదితే  నే   

  ఏదో నాడు     తీరం   చేరుతావు . 


• ఉప్పొంగే     అల    కూడా

  ఆవిరి    అవుతుంది   …   తెలుసా.

• ఊహించే    కల    కూడా

  నిజం    అవుతుంది    …  తెలుసా.


• చెప్పకు    ఎపుడు    శివుని తో

  నేను    ఒంటరి   అని .

• చెప్పకు    ఎపుడు    శివుని తో

  నాకు    ఎవరూ   లేరని .


• దైవం    నీ తోడై   ఉంది   చూడు

  ఇక    లోటేముంది   నీకు.

• ధైర్యం    నీ నీడై   ఉంది   చూడు

  ఇక   భయ  మేముంది   నీకు.


• ఉరిమే    మెరుపు   కూడా

  కను మరుగవుతుంది  … తెలుసా .

• కరిగే   మంచు   కూడా

  తిరిగి ఘనమే  అవుతుంది  …  తెలుసా.


• మర జీవం   అంటే     మరణ స్థితి తో

  భగవంతుని    ఒడిలో     జీవించడం.


• చెప్పకు     ఎపుడు    శివుని తో

  నేను    ఒంటరి    అని

• చెప్పకు    ఎపుడు     శివుని తో

  నాకు    ఎవరూ     లేరని.


Diamond Hall ✍️

ఓం నమఃశివాయ 🙏

ఓం శాంతి ☮️

శివరాత్రి శుభాకాంక్షలు 💐


యడ్ల శ్రీనివాసరావు  24 Feb 2025 10:20 AM.



Thursday, February 20, 2025

601. శివ సంగమం

 

శివ సంగమం


• మనసే   మందిర   మాయే

  శివ   బాబా

  నీ తలపే    సుందర  మాయే.


• నీ ఛత్రఛాయ లో    సేవ యే    మాకు సేద.

• అబముసుబము    తెలియని    పిల్లలము 

  నీ ఒడి యే    మాకు    ప్రీతిపాత్రము.


• మనసే    మందిర   మాయే

  శివ    బాబా

  నీ తలపే    సుందర  మాయే


• నీ శక్తి తో    నడిచే   జీవులం.

  నిను తెలుసుకో    లేక   జీవిస్తుంటాం.

• విషయ    వికారాల విధి   వంచితులం 

  భ్రమణ   బుద్ధి తో     పరి భ్రమిస్తుంటాం.


• నీ స్మరణ తో   నిండెను    మనో ధైర్యము.

  నీ దృష్టి తో     కలిగెను      శాంతి సుఖము.


• మనసే     మందిర   మాయే

  శివ    బాబా

  నీ తలపే    సుందర    మాయే


• ఆలోచనల   కళ్లెం

  ఆనంద     సంభూతం.

• అనుభవాల    పళ్లెం

  విరిసిన     వైకుంఠం.


• దివ్య  లోకం లోని   నీవు

  దూర తీరంలో     మేము

  సంగమ   మైతిమి   నేడు.


• ఈ వర్తమానం లో   మేము

  పరివర్తన    అయి

  నిన్ను    చేరుకుంటాము.


• మనసే మందిర మాయే

  శివ బాబా

  నీ తలపే సుందర మాయే.


సంభూతం = పుట్టినది

పళ్లెం = తాంబూల పాత్ర


On the way to Mount Abu ✍️

శివరాత్రి శుభాకాంక్షలు 💐

ఓం శాంతి

ఓం నమఃశివాయ 🙏


యడ్ల శ్రీనివాసరావు 21 Feb 2025 11:00 AM.



Wednesday, February 19, 2025

600. శివరాత్రి

 

శివరాత్రి



• శివరాత్రి అంటే తెల్లవారుజామున లేచి నదీస్నానం చేసి, శివుని దర్శనం చేసుకొని, ఉపవాసం తో , ఆ రాత్రి జాగారం చేస్తుంటాం .  రాత్రి సమయంలో  శివపార్వతుల కళ్యాణం  ఆలయాలలో  నిర్వహించడం  శివరాత్రి విశిష్టత.   భక్తి శ్రద్ధలతో భజనలు, ప్రార్థనలతో శివమయం అవుతుంది. శివుడు ఈ సృష్టికి  మూలం . ఆది దేవుడు . 

సృష్టి రహస్యం, స్థితి చేతన ,  లయ కారం  వంటి  శివుని జ్ఞాన యుక్తమైన విషయాలను  నేటి  మానవులు  యధార్థ రీతిలో  తెలుసుకో లేక పోతున్నారు.  ఎందుకంటే  నేటి మానవుని  బుద్ధి ని  వ్యర్ద  ఆలోచనలు  అల్లకల్లోలం చేస్తున్నాయి .  ఏది సత్యం    ఏది  అసత్యం,   ఏది అవసరం    ఏది అనవసరం ,  అనే స్పృహ  లేని  నిర్ణయాలతో , అలజడులతో  అనుదినం  గడుస్తుంది.


ఉపవాసం  : ఒకసారి ఆలోచించండి?

• ఉపవాసం అంటే  ఖాళీ  కడుపు తో  ఉండడమా ?.. అలా చేస్తే పుణ్యం వస్తుందా?   ఆకలితో ఉంటూ భగవంతుని ప్రార్ధిస్తే   మనసు  భగవంతుని పై లగ్నం అవుతుంది అనేది వాస్తవమా ?  ఆలోచించండి.


• శివరాత్రి కి ఉపవాసం ఉండాలి అంటారు.  నిజమే , కానీ  ఉపయోగం, అర్థం ఏమిటో ఎవరూ చెప్పరు.

ఉప అనగా  సమీపం, దగ్గరగా. 

వాసం అనగా  ఉండడం, నివసించడం.

 ఉపవాసం అంటే,   అన్య చింతన మాని , బుద్ది లోని  మలినమైన ఆలోచనలను  పూర్తిగా ఎండగట్టి ,  శివుని పై మనసు లగ్నం చేస్తూ,   నేను  శివునికి సమీపం గా ఉన్నాను  లేదా  శివునితో కలిసి నివసిస్తున్నాను  అనే భావన అనుక్షణం కలిగి ఉండడం  ఉపవాసం. దీనినే శివ స్మృతి  మరియు  ఉపవాసం  అంటారు.  

సాధారణంగా  శివ స్మరణ  నోటితో  బిగ్గరగా  చేయడం వలన కొంత  సమయానికి  అలసి పోవడం జరుగుతుంది.  కానీ  మనసు తో  మౌనం గా  శివ ధ్యాన  స్మృతి చేస్తూ  ఉంటే  శక్తి  మరింత పెరుగుతుంది. 

ఇదే  శివుని కి   ఉప వాసి  గా అయ్యే విధానం.

అంతే కాని,  ఉపవాసం అంటే అన్న పానీయాలు మాని  పండ్లు పాలు తీసుకో మని కాదు.  

సాధారణంగా  వారం లో  ఒక పూట   పూర్తిగా అన్నపానీయాలు మాని  ఉపవాసం ఉండడం అనేది జీర్ణాశయానికి  విశ్రాంతి  కలిగి, శరీరం ఆరోగ్యం నిలకడగా ఉంటుంది అని అర్థం.

అంతే కాని ఈ ఆహర ఉపవాసానికి, శివుని కి ఏ విధమైన సంబంధం ఉండదు.  ఆహారం మాని నంత మాత్రాన  శివుని కి చేరువ కాలేరు.


జాగరణం (జాగారం)

• శివరాత్రి జాగారం అంటే  నిద్రపోకుండా మేల్కొని ఉంటూ, శివనామ స్మరణ చేయడం అంటారు. 

ఒకసారి ఆలోచించండి,  పూర్తిగా  రాత్రి  అంతా  మెలుకువ గా  ఉండడం మనిషి కి  సాధ్యమా ?   ఈ జాగరణం  యొక్క మూలార్దం ఎవరు చెపుతారు ?

 

శివరాత్రి  రోజున  జాగారం అంటే,  మనిషి లో ఉన్న ఈర్ష్య, ద్వేషం, స్వార్థం, కామం, క్రోధం, అహం అనే  పలు వికారాల,  అజ్ఞానం అనే చీకటి నిద్రావస్థ నుంచి  మస్తిష్కం , బుద్ధి లో  స్పృహ ను మేల్కొలపడం .   ఆది సనాతన దేవి దేవత ధర్మం లో  భాగమైన,  శివ ధ్యానం , శివ జ్ఞానం తో  యోగ (అనుసంధానం) యుక్తం కాబడడమే   జాగరణం.  జాగరణం అంటే జాగృతం.  

కేవలం నిద్ర మాని నంంతలో శివుని కి చేరువ కాలేరు.


శివరాత్రి 

• వాస్తవానికి శివరాత్రి అనగా శివ జయంతి. జయంతి అంటే జన్మించడం. విచిత్రం గా ఉంది కదా…. శివుడు జన్మించడం ఏమిటి? అని.

  అవును , సత్య త్రేతాయుగాలలో అందరూ దేవతా గుణాల తో ఉండడం వలన వారికి భగవంతుని అవసరం ఉండేది కాదు.

  కానీ , ద్వాపర , కలియుగాలలో అందరూ  మాయా వికారాలకు వశం అయి పూర్తిగా దుఃఖితులు గా అయి,  భగవంతుని కోసం ప్రార్థిస్తూ, ముక్తి కోసం ఆర్తనాదాలు చేస్తారు. పరలోకంలో ఉన్న పరమాత్ముడైన  శివుడు, తన సంతానం అయిన మానవ ఆత్మల కోసం భూమి పై అవతరించిన రోజు  జ్ఞాపకార్థం గా   ప్రతి సంవత్సరం శివరాత్రి జరుపుకుంటారు. అదే శివ జయంతి, శివరాత్రి.


 రాత్రి అనగా చీకటి, అజ్ఞానం అని అర్థం. ఈ ప్రపంచంలో మానవులు ఏ నాడైతే  అజ్ఞానం అనే చీకటి అంధకారంలో ఉంటారో , అప్పుడు శివుడు అవతరించి జ్ఞానం అనే వెలుగు తో దుఃఖ విముక్తి చేస్తాడు. ఇది యే శివరాత్రి రహస్యం.


శివరాత్రి కళ్యాణం 

• పరమాత్మ శివుడు సద్గురువు, తండ్రి, టీచరు, ప్రియుడు. ఆ పరమాత్మ ను ఆకళింపు చేసుకున్న ఆత్మలు అనగా మానవులందరూ శిష్యులుగా, పిల్లలుగా, ప్రేయసి లు గా పిలవబడతారు.

• శివరాత్రి రోజున శివ పార్వతుల కళ్యాణం చేస్తారు. శివుడు అనగా సృష్టి కర్త. పార్వతి అనగా శివుని లోనుంచి ఉద్భవించిన శక్తి స్వరూపం. ఆ శక్తి స్వరూపం తో ప్రాణం పోసుకొని జీవిస్తూ ఉన్నది జీవులైన మానవులు. అనగా శివుడు ప్రియుడు అయితే, మానవులు ప్రేయసిలు అవుతారు. వీరి కళ్యాణమే  శివరాత్రి రోజున జరిగే కళ్యాణం. ఇది లోక కళ్యాణమే కానీ శివుని స్వకళ్యాణము కాదు.

 ఈ కళ్యాణం యొక్క అర్దం, శివుని తో కలిసిన మానవుల యొక్క క్షేమం, సుఖం, శాంతి కోసం జరిగే లోక కళ్యాణం. అంతే కాని ఇది ఒక వివాహ కళ్యాణం వలే చూడరాదు.



శివ అంటే శుభం

• శివుడు జ్ఞానసాగరుడు . శాంతి కాముకుడు. మానవుడు భగవంతుని కోసం భక్తి చేస్తాడు. ఎంతో వ్యయ ప్రయాసలతో పూజలు, అభిషేకాలు చేస్తాడు.

• శివుని కి దోసెడు నీళ్లు పోస్తే సంతోష పడతాడు అంటారు. అదే విధంగా, శివుని కి  జిల్లేడు పువ్వులు అంటే ఇష్టం అంటారు.   ఇటువంటి వి ఎన్నో చెపుతారు. కానీ వీటి సూక్ష్మ అర్దం ఎవరూ చెప్పరు.

  నీరు సహజంగా లభిస్తుంది. ఏ ధనం  వెచ్చించ లేని పేదవాడు కూడా శివ స్మరణ చేసినా శివుడు అభయం పొందుతాడు.

• అదే విధంగా, దేనికి ఉపయోగ పడని జిల్లేడు పువ్వులు మాదిరి ఎన్నో పాపాలు చేసిన , ఎందుకూ ఉపయోగ పడని  నిర్భాగ్యుడు  కూడా శివ స్మరణ చేస్తే పాపాలు తొలగుతాయి.  ఎందుకంటే శివుడు శుభకరుడు . ఆయనకు మంచి చేయడం మాత్రమే తెలుసు. శివుడు ఎప్పుడూ ఎవరిని శిక్షించడు . ఎందుకంటే తండ్రి కి తన పిల్లల పై ప్రేమ మాత్రమే ఉంటుంది. దుఃఖం  మరియు శిక్షలు అనేవి మానవులు తాము జన్మాంతరాలుగా చేసిన కర్మల ఫలితాలు. వాటికి శివుడు తన ఎప్పుడూ బాధ్యత వహించడు .


శివుని భక్తి శ్రద్ధలతో పూజించండి.  భక్తి ద్వారా ఏది ఎందుకు    చేస్తున్నామో  అర్ద సహితంగా తెలుసుకో గలగాలి.  శివ తత్వం అంటే ఏమిటో తెలుసుకొని ఆచరించడం మనిషి కి మోక్షం.


శివ ధ్యానం చాలా శ్రేష్టం.  శివుని ద్వారా  త్రిమూర్తి  సృష్టిలో భాగమైన,  శంకరుడు నిత్యం ధ్యాన ముద్రలో నే  ఉంటాడు.  దీని అర్థం జ్ఞాన ధ్యాన యోగం ద్వారా శివ సాధన సిద్ధిస్తుందని అర్దం. 


శరీరం అశాశ్వతం.  నదీ స్నానం చేయటం వలన  శరీరం  శుద్ది అవుతుంది. 

ఆత్మ శాశ్వతం.  శరీరం లోపల ఉండే  ఆత్మ, మనసు, బుద్ధి , సంస్కారం  శుద్ధి కావాలంటే శివుని జ్ఞాన సాగరం లో  స్నానం చేయాలి.  


✍️ On the way to Mount Abu . . .

మహా దేవుని శివరాత్రి శుభాకాంక్షలు

ఓం నమఃశివాయ 🙏.

ఓం శాంతి.

యడ్ల శ్రీనివాసరావు 20 Feb 2025, 7:00 AM.

+91 9293926810.



Sunday, February 16, 2025

599. కోటప్పకొండ - త్రికూటుడు

 

కోటప్పకొండ … త్రికూటుడు


• కొ.. కొ.. కొ ….

  కొ.. కొ.. కొ ….

• కోరిక   లెన్నో   తీర్చేవాడు

  త్రికూటుడు   . . .  త్రికూటుడు .

• ఆ త్రికూటుడే   బ్రహ్మ   విష్ణు  శంకరుడై 

  వెలసెను   ఒక   అచలమున

• అదే   అదే   కోటప్పకొండ  . . .  కోటప్పకొండ .


• మూడు   కొండల   రూపాలు

  బ్రహ్మ    విష్ణు    శంకరులు.

• శివుడే    దక్షిణామూర్తి యై

‌ బ్రహ్మ కు    జ్ఞానోపదేశం   చేసెను   ఇక్కడ.


• కోటప్పకొండ లో 

  జ్ఞాన సాగరుడు    నా శివుడు.

• కోటప్పకొండ లో 

   కొంగు బంగారం    నా శివుడు.


• కార్తీకమున       తిరునాళ్ళు

  శివరాత్రి న        ప్రభల దివ్వెలు 

  ఎడ్ల బండ్ల తో     ఊరేగింపులు

  మువ్వల సవ్వడి    వాయిద్యాలు

  రంగు   రంగుల      రంగవల్లులు

  హోరెత్తెను    సంబరాలు .

  నింగిని    తాకేను  అంబరాలు .


• ఈ కోటప్ప కొండ     రుద్రుని కొండ …

 ఈ కోటప్ప కొండ      రుద్రుని కొండ

• రుద్రుని కొండ    …    రుద్రుని కొండ

  రుద్రుని కొండ     …   రుద్రుని కొండ.


• కొ.. కొ.. కొ ….

  కొ.. కొ.. కొ ….

• కోరిక   లెన్నో   తీర్చేవాడు

  త్రికూటుడు . . . త్రికూటుడు .


• అరిసె    నివేదన    అమరామృతమయి

‌ ప్రభల   జ్యోతులు    ఆత్మానందమయి

• ఎద్ధుల    నృత్యాలు …

  ఎద్ధుల    నృత్యాలు …

  ఆ …  ఎద్ధుల నృత్యాలు

  ఆ …  ఎద్ధుల నృత్యాలు

  ఎలుగెత్త గా

  ఆ కైలాసము నే   నాట్యమాడెను   నా శివుడు.

• నా శివుడు …

  నా శివుడు …

  నా శివుడు …

  నా శివుడు …


On the way Kotappakonda ✍️

యడ్ల శ్రీనివాసరావు 17 Feb 2025 6:00 AM.


Thursday, February 6, 2025

598. శివుని కి అంకితం

 

శివుని కి  అంకితం



• ఈ జీవితం    నీకు   అంకితం

  ఈ జీవితం    నీకు   అంకితం

• సత్య మైన   ప్రేమను   చూపినందుకు .

• ముళ్ల వంటి   మమ్ము

  పుష్పాలు గ   చేసినందుకు.


• ఈ జీవితం    నీకు    అంకితం

  ఈ జీవితం     నీకు.   అంకితం.


• గతి    తెలియని   మాకు

  సద్గతి ని     ఇచ్చావు.

• బొమ్మలా  ఆడే    ఆటే

  ఈ జీవితం   అని   చెప్పావు.

• నీవు     తెలుపకుంటే

  పాప పుణ్యాల   సూక్ష్మం  ఎరుగము.

• నీవు  మాటాడక   ఉంటే

  భక్తి    జ్ఞానాల   భేధం    తెలియకుంటిమి.


• ఈ జీవితం   నీకు   అంకితం

  ఈ జీవితం   నీకు   అంకితం

• సత్య మైన   ప్రేమను   చూపినందుకు.

• ముళ్లు వంటి     మమ్ము

  పుష్పాలు గ     చేసినందుకు.


• మాయ  మోహల   ఆదరణ

  నిజమని     అనుకున్నాము.

• ఆశ    అత్యాశ ల    నడుమ

  ఊయల     ఊగాము.


• కల్లబొల్లి   కబుర్లు తో     కాలక్షేపం  చేస్తాము.

  కానీ . . .

• కాల  క్షేమానికి    కావలసిన

  జీవన్ముక్తి ని    తెలుసుకోము.


• నీవు   తెలియకుంటే 

  ఈ జీవితం    వృధా యే


• ఈ జీవితం    నీకు   అంకితం

  ఈ జీవితం     నీకు   అంకితం

• సత్య మైన    ప్రేమను   చూపినందుకు.

• ముళ్ల   వంటి  మమ్ము

  పుష్పాలు గ    చేసినందుకు.


• ఈ జీవితం    నీకు   అంకితం

  ఈ జీవితం    నీకు    అంకితం.


యడ్ల శ్రీనివాసరావు 6 Feb 2025, 4:00 pm







597. స్వర్ణిమ లోకం

 

స్వర్ణిమ లోకం


• పూవులు    పలికిన   వేళ

  ఓ హృదయం   గుసగుసలాడింది.

• మల్లెలు    విరిసిన   వేళ

  ఓ మనసు   ముసి ముసి గా   నవ్వింది.


• సంపెంగ ల     కోలాటం తో

  ఈ చల్లని   గాలి

  చిందులు    వేస్తుంది.

• సెలయేటి     తుంపర లు

  ఆ   తామర లను

  ఉక్కిరిబిక్కిరి   చేస్తున్నాయి.


• ఇది   యే   స్వర్గము …

  కనులను   దాటిన  లోకము.


• పూవులు   పలికిన   వేళ

  ఓ   హృదయం   గుసగుసలాడింది.

• మల్లెలు   విరిసిన    వేళ

  ఓ   మనసు    ముసి ముసి గా   నవ్వింది.


• ఏ కాంతపు    ఈ రాతిరి లో

  వెన్నెల    కాంత గా    నిలిచింది.

• అందుకే   …   అందుకే

  కోమలం    కాని    చీకటి

  కలవరం    లేక   హాయిగా   ఉంది.


• ఏ చింత   లేని    ఆ చామంతి

  కన్నులు    తెరిచే    నిదురిస్తుంది.

• అందుకే  …   అందుకే

  మధువు   గోలే   తూరీగ

  మౌనం గా   వాలి    ఉన్నది.


• ఇది   ఇంద్ర  లోకం.

  దేహం   దాటిన    లోకం.


• పూవులు   పలికిన   వేళ

  ఓ   హృదయం   గుసగుసలాడింది.

• మల్లెలు   విరిసిన  వేళ

  ఓ మనసు   ముసి ముసి గా   నవ్వింది.


యడ్ల శ్రీనివాసరావు 5 Feb 2025, 7:40 pm.






Sunday, February 2, 2025

596. మానవులు యంత్రాలు కాదు...జీవులు - 2

 

మానవులు యంత్రాలు కాదు . . .

 జీవులు - 2


• మీరు ప్రతిరోజు దినచర్యను ప్రారంభించినప్పుడల్లా, మీ చుట్టూ  ఉన్న ప్రతిదీ  మరియు  ప్రతి ఒక్కరినీ చూస్తూ  నా విద్య,  నా వృత్తిపరమైన అర్హతలు,  నా సంపద  మరియు నేను  ప్రస్తుతం పోషిస్తున్న పాత్ర –  వీటితో పాటు  ఇంకా మరెన్నో కూడా   నాది కాదు ,  నిజం గా  నావి కావు  ,  నా సొంతం  కాదు అనే  విషయాన్ని  లోతుగా   గ్రహించండి.


• ఎందుకంటే,  ముందుగా  మీ అసలు మూలం లోకి  వెళ్లి చూస్తే ,  మీరు భౌతికం (Mass శరీరం)  కానటువంటి  శాంతి,  ప్రేమ  మరియు ఆనందంతో  మొదట పూర్తిగా నిండి  ఉన్నారు (ఉండేవారు) .   మీ  భౌతిక శరీరం ,  వస్తువులు,   వ్యక్తులు, సన్నిహిత సంబంధాలు మరియు  మిగతావన్నీ  కూడా  మీరు  తరువాత  కర్మల  అనుసారంగా  పొందినవి.

• భౌతికం  కానిదొకటి  (శక్తి ) భౌతికతను  నియంత్రిస్తూ నడుపుతుంది  అని గ్రహించాలి.  భౌతికం కానిదే శాశ్వతమైనది.   భౌతికం అనేది  కేవలం ఈ ఒక జీవితకాలానికి  మాత్రమే  పరిమితం చేయబడింది.

• సంతోషం అనేది మనం వెతుకుతున్న ప్రాథమిక సుగుణం.  అలాగే,   మనం శాంతి  మరియు  ప్రేమ కోసం వెతుకుతున్నాము.   మీ స్మృతి ,  తలంపు భౌతికత   చుట్టూ   కేంద్రీకృతమై   ఉన్నంత  వరకు,    ఈ మూడు  భావోద్వేగాలను  (ప్రేమ , శాంతి , సంతోషం ) మీరు  శాశ్వతంగా మరియు  ఎప్పటికీ  అనుభవం  చేసుకోలేరు.  అవి తాత్కాలికంగా  వస్తూ,  పోతూ ఉంటాయి.  

ఎందుకంటే,  భౌతికమైన  ప్రతిదీ  తాత్కాలికమైనది  మరియు  సందర్భానుసారంగా   మార్చుకోగలిగేది.  ఈ రోజు   మీ సంబంధాలు బాగుంటాయి,  మరొక రోజు  సహకారం  లేనప్పుడు  బాగుండవు.  కొన్నిసార్లు,  ఆఫీసు కార్యాలయంలో   ప్రతిదీ సజావుగా   జరుగుతుండగా,   మరొకటి అసంపూర్ణమైన  పనులు  మరియు  గడువుల ఒత్తిడి ఉంటుంది.  ఇది  మీకు  శాంతి లేని అనుభూతిని కలిగిస్తుంది.

• అలాగే,  కొన్నిసార్లు   భౌతిక మైన  మీ  శరీరం ,  ఆరోగ్యంగా  బాగా నడుస్తుంది. అకస్మాత్తుగా ఒక అనారోగ్యం తలెత్తినప్పుడు  మీరు  మీ అంతర్గత సంతృప్తిని  మరియు   ఆరోగ్య అనుభూతిని కోల్పోతారు.  కాబట్టి,  జీవితం   మలుపులతో కూడినది.   మీ స్మృతి   మీ అంతర్గతమైన దానిపై  (శక్తి పై)  కేంద్రీకృతమైనప్పుడు ,  మీరు  సదా శాంతియుతంగా,   ప్రేమగా  మరియు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే మీ శాంతి, ప్రేమ, సంతోషానికి పునాది  శాశ్వతమైనది  మరియు  మార్చలేనిది . 


అలాగే, మీ ఉనికికి  అనాది యైన  మీ  అంతర్గత  స్వయాన్ని  ఆధారంగా చేసుకున్నప్పుడు , మీరు  మీ చుట్టూ ఉన్న  బయటి పరిస్థితులకు  ఏ మాత్రం  ప్రభావితం కాలేరు. అవి వస్తూ పోతూ ఉంటాయి (just like passing clouds)  కానీ మీరు మాత్రం స్థిరంగా, నిశ్చలంగా ఉంటారు.  ఎందుకంటే  మీరు  శాంతి,   ప్రేమ, సంతోషాలకు మూలం మరియు  చిరునామా.   మీరు మీ జీవితంలోని  ప్రతి పరిస్థితిని  వాటితో  మీ కోసం మరియు  ఇతరుల కోసం కూడా నింపుతారు.


• ఇకపై వాటికోసం మీకు నేడు  ఉన్న పరిస్థితులు మూలం మరియు ఆధారం కాదు.   శాంతి,   ప్రేమ, సంతోషాలను   మీరు నింపుకుని  ఉండటానికి ,  ఇకపై మీ చుట్టూ  ఉన్న పరిస్థితుల  మీద  మీరు  ఏ మాత్రం ఆధారపడరు .


యడ్ల శ్రీనివాసరావు 2 Feb 2025, 1:00 PM





Saturday, February 1, 2025

595. మానవులు యంత్రాలు కాదు...జీవులు - 1

 

  మానవులు యంత్రాలు కాదు . . .

 జీవులు  - 1



• మనమందరం  ఈ ప్రపంచంలో  ఉన్నత ప్రయోజనం కోసం జన్మించిన ప్రత్యేకత కలవారం .  అందులో భాగంగా ఉదయం నుండి రాత్రి వరకు జీవితాన్ని గడపడం,  ఉదయం తయారవ్వడం, పనికి వెళ్లడం, భోజనం వండడం మరియు రోజు  చివరిలో నిద్రపోవడం  వంటి పనులతో నిత్యం జరుగుతూ ఉంది.

• ఇది మాత్రమే కాకుండా ఈ జీవితకాలంలో మనకు గొప్ప లక్ష్యం కూడా ఉందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? …  ‘ నేను ‘  ఈ జన్మలో జీవం తీసుకున్నందుకు (పుట్టినందుకు),  నాకు ఒక ప్రత్యేక కారణం ఉంది,  అనే విషయం ఏనాడైనా ఆలోచించారా?  ఆ కారణం నేను తెలుసుకున్నాను లేక తెలుసుకోకుండానే మరణించి , మరలా అది తెలుసుకునేంత  వరకు  మరణిస్తూ ,  జన్మిస్తూ నే ఉంటాను అనే వాస్తవం గ్రహించ గలిగారా ?

• ఉదాహరణకు మీ ఇంట్లో ఎయిర్ కండీషనర్ లాంటి యంత్రం ఉంది. మనం దానిని ఆన్ చేసినప్పుడు అది నడుస్తుంది  మరియు  మనం ఆఫ్ చేసినప్పుడు అది ఆగిపోతుంది.  అంతకు మించి దానికి గొప్ప పని ఏమీ లేదు. అది పాడైనపుడు, ఎందుకూ పనికి రాక ఊరకనే ఉంటుంది. అప్పుడు ఎదో ఒక రోజు మనం దానిని శాశ్వతంగా విస్మరించి, దానిని విడిచిపెట్టే సమయం వస్తుంది.

• మనమందరం మొదట మానవ జీవులం, కేవలం మానవ యంత్రాలం మాత్రమే కాదు. మానవ యంత్రాలు ఉదయం నుండి రాత్రి వరకు పనిచేస్తాయి, ఉన్నత ప్రయోజనం అంటే ఏమిటో తెలియకుండా వివిధ చర్యలను చేస్తాయి.

• మానవులకు ఒక ఉన్నత లక్ష్యం ఉంది – జీవితానికి అవసరమైన చర్యలను చేస్తూ ,  జీవి  (నశించని ప్రాణం)  పైన ద్రుష్టి పెట్టడం. కాబట్టి, మానవుడు తానొక  యంత్రంలా ఉండకూడదు.

• మనం మన ఆఫీస్ లోకి అడుగు పెడుతున్నపుడు లేదా మన ఇల్లు మరియు కుటుంబాన్ని చూసుకుంటున్నపుడు, మన స్నేహితులతో సంభాషించినప్పుడు , ఏదో ఒక రోజు మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టి, మనతో ఏమీ తీసుకెళ్లలేమని తెలుసుకొని  వాస్తవిక స్పృహ లో ఉందాం.

• ఈ శరీరాన్ని అలంకరించిన దుస్తులు, శరీరం  లేనప్పుడు వెంట రావు. మీరు సాధించిన ఆర్థిక విజయం అనేది కేవలం వృత్తిపరంగా పొందినది. ఈ వృత్తి , ఏదొక రోజు శాశ్వతం గా ఆగిపోతుంది. అందమైన సంబంధాలు, రూపాలు మరియు బాహ్య వ్యక్తిత్వం అనగా బయట మీ కళ్లకు కనిపించేవి ఏ ఒక్కటీ మీతో పాటు కూడా రావు అనే వాస్తవం , మీ స్పృహ లో బలం గా ఉండాలి.


• కాబట్టి,   ఈ క్షణం కాసేపు  ఆగి  లోలోపలికి చూసుకోండి.  నేను ,  నా కొడుకు,  నా కుమార్తె లేదా   నా భర్త  ,  నా భార్యను  ప్రేమిస్తున్నాను,  కానీ ఏదో ఒక రోజు   నేను  ఈ భౌతిక  వస్త్రాన్ని  (శరీరం) విడిచిపెట్టినప్పుడు  వారు నాతో ఉండరు.  నాకు, నా జీవిత లక్ష్యం వారిని చూసుకోవడం కావచ్చు. కానీ నా ఉన్నత ఉద్దేశ్యం నా అంతర్గత స్వభావాన్ని,  నా సంస్కారాలను, నా అంతర్గత అస్తిత్వాన్ని చూసుకోవడం,  వీటిని నేను నాతో పాటు తీసుకువెళతాను.  నేను తిరిగి జన్మించినపుడు,  ఇవే నాతో మరలా ఉంటాయి.

కాబట్టి ,  ప్రతి ఉదయం ఒక ధృవీకరణ తీసుకోండి – నేను రోజంతా నా అంతర్గత స్వభావాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడాన్ని  మరియు  నేను కలిసే ప్రతి ఒక్కరికీ  ఆనందాన్ని  ఇవ్వడాన్ని ఎంచుకుంటాను. నేను పనిలో  మంచిగా ఉండటాన్ని ఎంచుకుంటాను, కానీ నా చర్యలపై కూడా పని చేస్తాను, ఇది నాకు అందరి నుండి ఆశీర్వాదాలను పొందేలా చేస్తుంది.

అలాగే, నేను ప్రతి ఒక్కరికీ మంచితనానికి అద్దంలా ఉండటాన్ని ఎంచుకుంటాను,   దీనిలో ఇతరులు సానుకూలతను చూస్తారు మరియు మంచి మనుషులుగా మారడానికి ప్రేరణ పొందుతారు. ఎందుకు?   ఎందుకంటే మీరు ప్రత్యేకమైన వారు, ప్రత్యేకమైన  మానవులు,   సాధారణ  మానవులు కారు!


యడ్ల శ్రీనివాసరావు 2 Feb 2025, 1:00 PM.



594. ఆనంద సృష్టి

 

ఆనంద సృష్టి



• పువ్వులను  మనం  సృష్టించలేం.   వాటికవే పుష్పించి,   వికసించి   అందరికీ   ఆనందం కలగజేస్తాయి.  నవ్వులను  మనం సృష్టించుకోగలం . ఆ నవ్వుల్లో   మునిగి  ఆనంద  డోలికల్లో తేలియాడగలం.  కొన్ని  మన  చేతుల్లో ఉంటాయి.  పెద్ద పెద్ద  పనుల్ని  మనం  చెయ్యలేకపోయినా చిన్న చిన్న  పనులను  పెద్ద హృదయంతో  చెయ్యాలి.


• గొప్ప  పనులు  చెయ్యలేకపోతున్నామని  బాధ పడకూడదు.   ఆ సందర్భం వస్తే   అనుకోకుండా అద్భుతమైన,   పనుల్లో   మనం భాగస్వాములం అవుతాం.   ఆనందం  ఎప్పుడూ ,  మనం చేస్తున్నది చిన్నపనా  పెద్దపనా   అని కొలతలు   వెయ్యదు. ఎంతగా  మనసు పెట్టి,  హృదయపూర్వకంగా పసివాడిలా   ఆ పని చేస్తున్నామా  అని చూస్తుంది. ఆనందానికి  మనం   చిరునామా   అయిపోవాలి. బాధలు  కేవలం  కిటికీ   తెరలు.   మహాద్వారం మాత్రం మన అంతులేని  సంతోషమే.  దాన్ని నిలబెట్టుకోవాలి.

• అటువంటి  గృహంలో   నిత్యం  గంతులు వేస్తూ ఉత్సవం  చేసుకోవాలి.   చెట్టును,  పిట్టను , కొంగను , కోడిని ,  ఉడతను  చూసి  మురిసిపోవాలి.   ప్రతీ దృశ్యం   సూర్యోదయంలా   ఉండదు.  ప్రతి సందర్భం పడమట సంధ్యారాగంలా   సంగీతాన్ని  ఆలపించదు.

కానీ,  చేతిలో ఉన్న  చిన్న   వెదురు ముక్క  లోని  నాలుగు  రంధ్రాల  ద్వారా  చక్కటి   వేణుగానం  వినిపిస్తుంది.  హృదయంలో   సంతోషం సెలయేరు లా ఉండాలి .   మనసులో   మంచి   జ్ఞాపకాల మంచు  కురుస్తూ  ఉండాలి.    ప్రేమ  లేకుండా మనిషిని  భగవంతుడు  సృష్టించలేదు.  ఆనందం లేకుండా  ఎవరిని   జీవించమని  చెప్పలేదు.  మనిషి ఆనందిస్తుంటే  మురిసిపోయేవాడు  ఆ దేవదేవుడే .


• ఉదయం  లేవగానే   రెండే రెండు  అవకాశాలు మన ముందుంటాయి.  రోజంతా  సంతోషంగా ఉండాలా, లేదంటే  వేదనతో  కాలం గడపాలా  అని.  ఆనందం మన  హక్కు . ఆనందంగా  ఉండటం మన స్వభావం. పుట్టుకతో నే   బాధలు  అందరికీ ఉండవు.  మధ్యలో  వచ్చేవి  మధ్యలోనే   పోతాయి.  ఆనందాన్ని  సృష్టించు.   అపరిమితంగా   సృష్టించు. గడ్డిపువ్వుల్లోనూ   మానస సరోవర  బ్రహ్మకమలాన్ని చూడగలిగే   మనసును   తయారుచేసుకోవాలి. బతకడానికి   సిరులు-సంపదలు  కాదు కావాల్సింది. పెద్ద   హృదయంలో   చిన్ని  చిన్ని  ఆనందాలు,  సృష్టించుకోవడం   తెలిసిన   నేర్పరితనం  కావాలి. శివాలయం  లోనికి  ప్రవేశించినంతనే   ఈశ్వరుని దర్శనం కాదు.  అదే పరమాత్మను  నిత్యం మనసులో  ద్యానిస్తూ  ఉండగా   ప్రతి మొక్క,  ప్రతి పూవు,  చిరు గాలి,  సెలయేటి  నీరు   నీతో   మాట్లాడతాయి.  కాకపోతే   మనసును   తెరచి  ఉంచుకోవాలి .... అంతే !


• మన లోపల   ఆ శివుని  ప్రేమ  వ్యాపిస్తే,   కళ్లకు విశ్వమంతా   ప్రేమ మయంగా   అనిపిస్తుంది.  దైవాన్ని   భావనతో   మనం  లోపల  సృష్టించకపోతే  బాహ్య ప్రపంచంలో  ఆయన ఎలా కనిపిస్తాడు ... నిత్య  సంతోషికి  దూరంగా  దేవుడు  ఉండగలడా ? కొంత  సంతోషం  ఇతరుల  మీద  చల్లగలిగితే  మనకు అది రెట్టింపై  తిరిగి వస్తుంది.   జీవితాంతం నవ్వుతూ ఉండటం  అనేది  ,   జీవన రహస్యం తెలిసినవాడికి మాత్రమే  సాధ్యమవుతుంది.  అతడే జ్ఞాని ,  అతడే తనకు తాను  చాలా  ఇష్టమైనవాడు  అంటాడు గీత ఆచార్యుడు.   బాధలు,   బాధ్యతలు  అందరికీ ఉంటాయి.   ప్రపంచం  భూతం లాగా  కనిపిస్తుంది.  సంసారం   సముద్రం  లాగా అనిపిస్తుంది.    విరక్తి తో మనసు  చేదెక్కి  ఉంటుంది.  అక్కడే మనిషి తన  భావాన్ని మార్చుకుని  చిరునవ్వు  నవ్వగలిగి ఉండాలి.  వెంటనే మరిచిపోయి, కళ్లు తుడుచుకున్న చిన్న పిల్లాడిలాగా   జీవితాన్ని  ఆహ్వానించాలి. ప్రపంచాన్ని  కౌగిలించుకోవాలి.  నవ్వుతూ అందరినీ పలకరించాలి.  ఇది అంతా ఒక సత్యతతో,  పరివర్తన తో,  సహృదయంతో జరగాలి .... అంతే కాని స్వీయ వంచన తో   మాత్రం ఉండకూడదు. 


 సర్వం  ఈ శ్వరం .

  ఓం శాంతి.


యడ్ల శ్రీనివాసరావు 1  Feb 2025. 1:00 pm.






608. విధి - నిర్వాణం

  విధి - నిర్వాణం  • నాది   . . .   నాది   నాదన్నది     ఏది . • నేను   . . .   నేను   నాకున్నది    ఎవరు . • నిన్న      ఉన్నాను      కానీ ...