Tuesday, March 11, 2025

608. విధి - నిర్వాణం

 

విధి - నిర్వాణం 




• నాది   . . .   నాది

  నాదన్నది     ఏది .

• నేను   . . .   నేను

  నాకున్నది    ఎవరు .


• నిన్న      ఉన్నాను   

  కానీ   

  ఆ నిన్న    నేడు   లేదు .

• నేడు     ఉన్నాను    

  కానీ 

  రేపు   ఉంటానో    లేదో  తెలియదు  . . .


• నాది   . . .   నాది

  నాదన్నది     ఏది .

• నేను   . . .   నేను

  నాకున్నది   ఎవరు .


• నాదన్నది    అంతా

  నా   మనో నేత్రం   లో నే   ఉంది .

• నాకున్నది    అంతా 

  నా   తండ్రి    శివుడు .


• నేనొక     పూర్వజు  ను

  అనుభవాల   నిధి   నా సంపద .

• ఇహ  లోక   ఘటన లెన్నో 

  గత  స్మృతులు    తెరిచాయి .


• దృష్టి తో    రాసిన   

   సృష్టి      రచనలే

   ఈ  సంతుష్ట   పరిచయం.

• విఘ్నాలు    అన్నీ 

   విజయం  గా   మారాయి .


• కర్మల   ఖాతాల   చెల్లింపు  కోసం

  నిమిత్తమై   ఉన్నాను .

• అవి   ముగిసిన   తక్షణం

  నా సొంత   ఇంటికి   వెళతాను .

• బుణం    తీరిన    వారు

  నా మజిలీ ని     దాటారు .

  ఇక   తీరవలసిన   వారు    

  ఇంకొందరే   . . .


• నాది   . . .   నాది

  నాదన్నది     ఏది .

• నేను   . . .   నేను

  నాకున్నది    ఎవరు .


• మూలాల    స్పష్టత       సుకృతం.

  ఈ  జీవిత  పయనం    అత్యద్భుతం.

• ఈ గమ్యము    బహు   సుందరం 

  అది   దివ్య భరిత    సుగంధం.


• నాది   . . .   నాది

  నాదన్నదంతా    

  నా  తో నే   ఉంది  .

• నేను   . . .    నేను

  నాకున్నదంతా  

  నా   తండ్రి   శివుడే .  

  


విధి  =  నిర్వర్తించ  వలసిన కర్మ

నిర్వాణం  = ముక్తి ,  మరణం.

పూర్వజ = పూర్వ యుగాల నుంచి అనేక జనన మరణాలు  ఎత్తిన  ఆత్మ.

మజిలీ = జీవిత ప్రయాణంలో విడిది చేసిన చోటు.


ఓం నమఃశివాయ 🙏

ఓం శాంతి ☮️.

యడ్ల శ్రీనివాసరావు 11 March 2025 10:00 PM


Monday, March 10, 2025

607. దాది హృదయ మోహిని

 

దాది హృదయ మోహిని



• మధురం   మధురం

  మీ  దీవెనలు  మధురం.

• యజ్ఞ   సేవ లో

  శివుని కి   రధం   అయిన

  మీరు

  మాకు   ఎంతో  మధురం.


• మధురం    మధురం

  మీ  హృదయ   మోహనం

  మధురం.

• భావి  ఆత్మల   పురుషార్ధాని కి

  మీ   దివ్య ప్రేరణ

  మాకు   ఎంతో   మధురం.


• నవ వర్షం లో     శ్రీ కృష్ణ

  సాక్షాత్కారం     మీ  భాగ్యం.

• చిరునవ్వుతో     చిరంజీవిగా

  చేయడం     మీ  మహాన్నత్యం.


• వ్యర్దం   అంటే   అర్దం   తెలియని

  మీ  రూపం     దైవ  స్వరూపం.

• దేహం లో   ఓ  దేవత 

  అనుటకు   మీరే  నిదర్శనం.


• మధురం    మధురం

  మీ   దీవెనలు    మధురం.

• యజ్ఞ   సేవ లో

  శివుని కి   రధం  అయిన

  మీరు

  మాకు  ఎంతో  మధురం.


• త్యాగం   అంటే    భోగమని 

  యోగం   అంటే    రాజసమని

  సేవ       అంటే   సౌందర్యమని 

  సాకారం   చేసారు.


• నారి  యే  విశ్వ శక్తి   అని

  నవ  వసంత   స్థాపన  చేసారు.

• కళ్యాణ  కారిగా   

  మా మది లో   కొలువయ్యారు.


• మధురం    మధురం

  మీ   దీవెనలు   మధురం.

• యజ్ఞ    సేవ లో

  శివుని కి    రధం    అయిన

  మీరు

  మాకు   ఎంతో   మధురం.


గుల్జార్ దాది  అవ్యక్త దినం 11 March 2021. 

ఆ రోజు మహా శివరాత్రి పర్వదినం.


యడ్ల శ్రీనివాసరావు 11 March 2025 10:30 AM.


Sunday, March 9, 2025

606. శిలలో లేడు శివుడు

 

శిలలో లేడు శివుడు


• శిల లోని   లేడు   శివుడు . . .

  మన   శివుడు .

• సత్య బుద్ధి లో ఆసీన  మైనాడు  శివుడు . . .

  మన   శివుడు .


• అభిషేక   అభిముఖుడు  కాడు  శివుడు . . .

  మన  శివుడు.

• జ్ఞాన  ధారణతో   నిను

  పావనం    చేస్తాడు   శివుడు . . .

  మన  శివుడు.


• నీ  పూజలు   పువ్వుల తో

  శివుని కి    ఒరిగేది    ఏమి .

• శుద్ధి లేని    బుద్ధి తో

  నీ వెన్ని   చేసినా  గానీ

  ప్రీతి పాత్రుడు   కాడు   శివుడు . . .

  మన   శివుడు.


• శిల లోని  లేడు   శివుడు . . .

  మన   శివుడు.

• సత్య బుద్ధి లో   ఆసీన మైనాడు  శివుడు . . .

  మన   శివుడు .


• కోరికల   కోసం   కోటి   దండాలెట్టినా 

  సేవ తోనే    కలుగు    సౌభాగ్యం .

• జ్ఞానం   తెలియనంత   వరకు

  భక్తి లో   ఒరిగే   ప్రాప్తి   ఆవగింజే .


• జీవం   ఇచ్ఛు వాడు   శివుడు . . .

  జీవన్ముక్తి   నిచ్చు వాడు   శివుడు .

• బంధాల  నిచ్చు వాడు   శివుడు . . .

  బంధన ముక్తి   నిచ్చు వాడు   శివుడు .

• ప్రేమ ను    పంచు వాడు   శివుడు . . .

  కపట ప్రేమ ల   ముక్తి   నిచ్చు వాడు  శివుడు.

• స్నేహం   చేయు  వాడు   శివుడు . . .

  వ్యర్ద  స్నేహల   ముక్తి   నిచ్చు వాడు   శివుడు.


• నిను  బురదలో    ఉంచే వాడు   శివుడు . . .

  కమల  వికసితం గా   చేయు వాడు   శివుడు.

• నీకు  క్షేమము   నిచ్చు వాడు   శివుడు

  క్షమాగుణం   ప్రసాదించు   వాడు   శివుడు.

• నిన్ను   నమ్మేవాడు   శివుడు

  నీవెవరొ  నీకు  తెలియ  చేయు వాడు  శివుడు.


• శిల లోని   లేడు   శివుడు . . .

  మన   శివుడు.

• సత్య బుద్ధి లో   ఆసీన మైనాడు  శివుడు . . .

  మన   శివుడు .


యడ్ల శ్రీనివాసరావు 10 Mar 2025 10:00 AM.



Saturday, March 8, 2025

605 . ఆనంద నంద రాగం

 

ఆనంద నంద రాగం


ఆనంద  నంద  రాగం

  ఏకాంత   కాంతి  వాసం.


• హృధయాన   మెరుపు  జననం . . .

  లయకార    స్థితి    ప్రేమం .

• ఆలోచన న     జాబిలి    జననం . . .

  వెన్నెల తో     లేఖ   తేజం .


• అనుక్షణా న   సంతోష   సంబరం . . .

  మనసు న      సౌందర్య   లేపనం.

• మరుక్షణా న   ఏకాంత   విహంగం . . .

  ఆకాశ   వీధి న  విహారం.


• అంతము   లేని    ప్రేమ కు

  ఆనందం  నిచ్చు   కాంతి  ఇది .

• మరణం    లేని    ఆత్మ కు

  ఆవాహనం   ఇచ్చు   శక్తి   ఇది .


• ఆనంద   నంద   రాగం

  ఏకాంత   కాంతి   వాసం .


• హృధయాన   మెరుపు   జననం . . .

  లయకార   స్థితి   ప్రేమం .

• ఆలోచన న    జాబిలి    జననం . . .

  వెన్నెల తో     లేఖ    తేజం .


• శూన్యం లో   సహ   నివాసం . . .

  శుభ సంకల్పాల   స్థిరత    కోసం .

• ప్రేమం   మనో గాయ   స్వస్థం . . .

  లాలనం  దివ్యా ను  భూతం .


• స్వ పరివర్తనం   విశ్వ కళ్యాణ  భోగం .


• ఆనంద   నంద   రాగం

  ఏకాంత   కాంతి   వాసం.


యడ్ల శ్రీనివాసరావు  8 March 2025, 2:30pm.


Tuesday, March 4, 2025

604. తీయని కోర్కెలు

 

తీయని కోర్కెలు



• తీయని కోర్కెలు     తీరని దాహం .

  జీవితం    ఒక   మాయ  రా

  పొందినది ఏది     చెందినది ఏది .


• ఉరకలు వేసే    తపనల లో

  అడుగులు   వేసాక   తెలిసింది

  చివరికి   అంతా   శూన్యం  అని.


• తీయని కోర్కెలు    తీరని దాహం .

  జీవితం   ఒక   మాయ రా

  పొందినది ఏది     చెందినది ఏది .


• నాదనుకున్నది    అంతా

  నాదైనాక     తెలిసింది

  నేనున్నది   నరకం లో   అని.


• మోహం    మత్తులో   మసకలు 

  మైమరిపించే     నా మనసు ని.


• తకదిమి    తైతక్క లతో

  ఆడిన     కర్మలే

  తలతిక్క గా    మారెను. 

• పొగిడిన   వారే     పోయారు .

  నమ్మిన     వారే     నవ్వారు .


• తీయని కోర్కెలు      తీరని దాహం .

  జీవితం    ఒక    మాయ రా

  పొందినది ఏది     చెందినది ఏది .


• ఇంద్రియ  సుఖాలు    ఇంద్ర భోగమని 

  అనుభవించినా  సరే 

  ఆనందం    ఏది .


• తీయని కోర్కెలు     తీరని దాహం .

  జీవితం    ఒక   మాయ రా

  పొందినది ఏది     చెందినది ఏది .


యడ్ల శ్రీనివాసరావు 4 March 2025 6:00 pm.


608. విధి - నిర్వాణం

  విధి - నిర్వాణం  • నాది   . . .   నాది   నాదన్నది     ఏది . • నేను   . . .   నేను   నాకున్నది    ఎవరు . • నిన్న      ఉన్నాను      కానీ ...