మానవుడు వ్యక్తి కాదు శక్తి
• మనం, మనకు సంబంధించిన ఎన్నో శ్రేష్టమైన విశిష్టతలను కలిగి ఉన్నాం . కానీ దురదృష్టవశాత్తు వాటిని మరిచిపోయి మాయ మైకం (ధూమం) లో పడి సత్యం ఏదో అసత్యం ఏదో తెలియని స్థితిలో జీవించడానికి అనేక జన్మలు గా అలవాటు చేసుకున్నాం.
• మనం మరచిపోయిన వాటిలో అత్యంత ముఖ్యమైన విషయం , మనం కేవలం శరీరం తో ఉన్న మనుషులం మాత్రమే కాదు , అద్వితీయమైన శక్తులం . మనిషి ఒక వ్యక్తి కాదు ఒక శక్తి . కానీ మన స్పృహలో ఈ విషయం పూర్తిగా నేడు విస్మరించాం, అందుకే ఏదైనా సమస్యను ఎదుర్కొవాలంటే నిస్సారం అవుతాం , మనసు లో అలజడి తో భయపడతాం.
• మనిషి వ్యక్తి కాదు శక్తి అనే విషయం ఆది మానవుడు నుంచి, మన పూర్వీకులు మునులు బుషులు అనేక విధాలుగా నిరూపణ చేశారు . కానీ నేటి కలియుగంలో మాయ ఆవహించిన మనిషి ప్రశ్నిస్తాడు , దానికి సైంటిఫిక్ ప్రూఫ్ ఏమిటి? అని.
అందుకోసమే నేమో , ఐన్స్టీన్ లాంటి శాస్త్రవేత్తలు కలియుగం లో జన్మించారు. ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ప్రకారం
E= MC^2
Energy = Mass * Velocity (square).
శక్తి = ద్రవ్యరాశి * కాంతి వేగం (రెండు రెట్లు)
ఇది భౌతిక శాస్త్ర ప్రకారం సృష్టి లోని ప్రతి జీవికి, నిర్జీవికి (వస్తువు కి) వర్తిస్తుంది అని ఐన్స్టీన్ నిరూపించాడు .
ఇదే సూత్రం మనిషి కి ఆపాదిస్తే . . .
మనిషి శక్తి = భౌతిక శరీరం (Mass) * మనసు చైతన్యం (Velocity) రెండు రెట్లు.
మన శరీరం మరియు మన మనసు లో ఆలోచనల చైతన్యం (ఆత్మ) రెండు రెట్లు కలిపితే అదే మన యొక్క మొత్తం శక్తి .
• మనుష్యులు అందరూ ఒకే విధమైన శరీర అవయవ నిర్మాణం తో ఉన్నా , ఒక్కొక్కరికి ఎనర్జీ లెవెల్స్ ఒకొక్క స్థాయిలో ఉండడం మనం గమనిస్తాం . దీనికి కారణం మనసు యొక్క చైతన్యం వేగం .
ప్రతి మనిషి యొక్క శక్తి స్థాయి ని నిర్ణయించేది ప్రధానం గా మనసు యొక్క ఆలోచన సరళి తో కూడిన చైతన్యం.
☘️☘️☘️☘️☘️☘️
• మానవ శక్తి రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి పాజిటివ్, రెండు నెగెటివ్.
ఏదైనా విషయాన్ని . . . అతిగా, వ్యర్థం గా , అలజడి గా , అసత్యం తో ఆలోచించే వారికి నెగెటివ్ శక్తి ఎక్కువగా ఉంటుంది.
శాంతి గా, మౌనం తో , సూక్ష్మంగా, నిజాయితీ తో అవసరం మేరకు ఆలోచించే వారు పాజిటివ్ శక్తి ఎక్కువగా కలిగి ఉంటారు.
ఈ రెండు శక్తుల లో ఒకటి ఆరోగ్యాన్ని , ఆహ్లాదాన్ని, తెలివితేటలు, ఆత్మానందాన్ని కలిగిస్తే మరొకటి దుర్భరత ను , నిర్లిప్తత ను , దుఃఖం కలిగిస్తుంది. ఈ శక్తులే ఎన్నో అంశాలను నిర్ణయించి , మనిషి కి ఆపాదన గా అవుతాయి .
• కొందరు ఎంత కష్టతరమైన పనులనైనా సునాయాసంగా చేయడానికి కారణం తమ బలమైన ఆత్మ శక్తి . ఆత్మ శక్తి బలహీనంగా ఉన్న వారికి తాము చేసే పనులలో ఆటంకాలు , నిరాశ తరచూ కలుగుతుంటాయి .
🌹🌹🌹🌹🌹🌹
• మనం శక్తిని పెంచుకోవాలంటే నిరంతర సాధన అవసరం. శారీరక శక్తి కోసం సమతుల్యమైన పౌష్టికాహారం ఎంత ముఖ్యమో , మానసిక శక్తి కోసం రోజూ కొంత సమయం నిత్యం ధ్యానం, యోగం , భగవత్ స్మృతి అంత కంటే ఎక్కువ అవసరం . మనసు శక్తి శాలి గా తయారయితేనే మన శరీరం శక్తిని యిముడ్చుకుంటుంది .
• ప్రతీ రోజు తెల్లవారుజామున శివుని ధ్యానం చేయడం వలన అష్ట శక్తులు సిద్ధిస్తాయి. ఇవి సహన శక్తి , సర్దుబాటు శక్తి , ఎదుర్కొనే శక్తి, పరిశీలనా శక్తి, సంకీర్ణ శక్తి , సహయోగ శక్తి , నిర్ణయ శక్తి , యిముడ్చుకునే శక్తి . వీటినే రాజయోగ శక్తులు అంటారు.
1. సంకీర్ణశక్తి (Power to Withdraw) :
ఇది చాలా కీలకమైన మొదటి శక్తి . తాబేలు పరిస్థితులు సందర్భానుసారం తన అవయవాలను లోపలికి ఎలా ముడుచుకుంటూ జీవనం సాగిస్తుందో , అదే విధంగా మన ఇంద్రియాలను, మనస్సును బయట ప్రపంచంలో ఎదురైన దుర్భరమైన వ్యక్తులు వారి ద్వారా తలెత్తే పరిస్థితుల నుండి మనల్ని మనం ఉపసంహరించుకుని , అంతర్ముఖం కావడమే సంకీర్ణశక్తి .
ప్రాముఖ్యత: ఇది మన మనస్సును అలజడుల నుండి రక్షించి, ప్రశాంతతను, ఏకాగ్రతను పెంచుతుంది
2. సహన శక్తి (Tolerance Power) :
ఇది మనస్సును ప్రశాంతంగా, స్థిరంగా ఉంచే నిశ్శబ్ద బలం.
ప్రాముఖ్యత : ఇది అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ, ఇతరుల తప్పులను మన్నిస్తూ మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ, సానుకూల దృక్పథంతో వ్యవహరించే మానసిక సామర్థ్యం.
3. సర్దుబాటు శక్తి (Power to Adjust) :
కష్టతరమైన పరిస్థితులు, భిన్నమైన వ్యక్తులు మరియు కొత్త వాతావరణాలకు అనుగుణంగా మనస్సును, ప్రవర్తనను మార్చుకునే సామర్థ్యం.
ప్రాముఖ్యత: ఇది సంబంధాలను మెరుగుపరచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో మరియు శాంతియుతమైన, సమతుల్యమైన జీవనశైలిని పెంపొందించడంలో సహాయపడుతుంది.
4. ఎదుర్కొనే శక్తి (Power to Face) :
కష్టాలు, సవాళ్లు మరియు నిరాశలను అధిగమించడానికి సహాయపడుతుంది.
ప్రాముఖ్యత: నిశ్శబ్దాన్ని, ఏకాగ్రతను, మానసిక ప్రశాంతతను ఎదుర్కొని అంతర్గత స్థిరత్వాన్ని(self control ) పెంచుతుంది. ఆత్మ విశ్వాసం పెంచుతుంది.
5. పరిశీలనా శక్తి (Power to Observation) :
మనిషి తన చుట్టూ ఉన్న పరిస్థితులు మరియు మనుషుల గుణదోషాలను , కంసాలి బంగారం నాణ్యతను పరీక్షించినట్లుగా వెంటనే గ్రహించగల శక్తి. ఇది సత్యాసత్యాలను తెలుసుకోవడానికి, అంతర్గత స్థితులను గమనించడానికి మరియు ఆందోళన లేని జీవితానికి తోడ్పడుతుంది.
ప్రాముఖ్యత : దీని ద్వారా మనిషి ఇతరుల గుణదోషాలను పరిశీలించి, అవగుణాలను చూడకుండా సుగుణాలను మాత్రమే స్వీకరించగలుగుతాం.
6. సహయోగ శక్తి (Power to Cooperative) :
ఒక గొప్ప కార్యం కోసం ఇతరులతో కలిసి పనిచేయడం మరియు అవసరమైనప్పుడు నిస్వార్థంగా సహాయం అందించడమే "సహయోగం". ఈ శక్తి ద్వారా మనస్సులోని వ్యర్థ సంకల్పాలు తగ్గి, శాంతి లభిస్తుంది. ఇది ఇతరులతో సంబంధాలను మెరుగుపరుస్తుంది మరియు సవాళ్లను సులభంగా ఎదుర్కోవడానికి తోడ్పడుతుంది.
ప్రాముఖ్యత : సమిష్టి తత్వాన్ని వృద్ధి అయి , ఉదారత మరియు నిస్వార్థ స్వభావం పెరుగుతుంది.
7. నిర్ణయ శక్తి (Decision Making Power) :
సాధన ద్వారా మనస్సును నియంత్రించి, అంతర్గత శక్తులను పెంపొందించడం ద్వారా సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ప్రసాదిస్తుంది
ప్రాముఖ్యత : మానసిక స్పష్టత, ధైర్యం మరియు దూరదృష్టిని పెంచి, క్లిష్ట పరిస్థితుల్లో కూడా స్థిరమైన, తెలివైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది.
8. యిముడ్చకొనే శక్తి (Accommodate) :
అనేది ఆత్మ యొక్క ఎనిమిది ప్రధాన శక్తులలో ఒకటి. ఇది సముద్రం వలే వివిధ రకాల వ్యక్తులు, పరిస్థితులు మరియు భావాలను తనలో ఇముడ్చుకుని, ఏకాగ్రతను మరియు అంతర్గత శాంతిని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఈ శక్తి ద్వారా యోగి, ఎలాంటి కఠిన పరిస్థితులలో నైనా సర్దుబాటు చేసుకుంటూ, స్థితప్రజ్ఞతతో వ్యవహరిస్తాడు .
ప్రాముఖ్యత : సర్దుబాటు తత్వం విశాల హృదయం , ఇతరుల ఆలోచనలు మరియు అభిప్రాయాలను స్వీకరించడం.
ఈ శక్తి వల్ల మనశ్శాంతి, సహనం పెరుగుతాయి మరియు సంబంధాలలో ఘర్షణలు తగ్గుతాయి.
💐💐💐💐💐💐
• నిత్యం ధ్యానం యోగం చేయడం , రోజూ కొంత సమయం భగవంతుని స్మృతి చేయడం వలన ఈ శక్తులు మనిషి లో సహజంగా , క్రమేపీ వృద్ధి అవుతాయి. వీటినే రాజయోగ శక్తులు అంటారు.
హనుమాన్ చాలీసా లో “అష్ట సిద్ధి కే నవనిధి ధాత” , హనుమంతుడు ధ్యానం ద్వారా ఈ అష్ట శక్తులు , తొమ్మిది నిధులు పొందినట్లు చెప్పబడింది .
ఓ మనిషి తెలుసుకో . . . నీవు వ్యక్తి కాదు శక్తి.
నీ శక్తి , నీ చేతుల్లో . . . చేతల్లో .
ఓం శాంతి 🙏
ఓం నమఃశివాయ 🙏
On the way to Mount Abu ✍️
యడ్ల శ్రీనివాసరావు 7 Feb 2026 11:30 PM.



.png)
.png)
.png)
%20(1).png)

