మనో శతకం - 11
ఐహిక సుఖంబల విరక్తి గాంచిన
విజయంబు వెన్ను న వీడక
వినువీధిన గైకొని విశ్వంబు వేయుమాల .
వైఫల్యంబున బెణకణిచో కాలుడు
దెరుచు సాగుకు చిత్తమున
కల్పతరువు కమనీయంబుగా .
సుందర గుణేశ్వరా! సంపన్నేశ్వరా! |26|
భావం :
భౌతిక సుఖాల వ్యామోహం నుంచి మనసు విడుదలైన చో విజయము వెన్నంటే ఉంటూ . . . అందనంత ఎత్తున ఉన్న ఆకాశ వీధుల్లో కి , విశ్వం తీసుకెళ్లి మాల వేయును .
ఓటమి , దుఃఖము యందు బెదరక స్థిరముగా ఉండిన నాడు . . . కోరికలు పూరించే దైవీ వృక్షం వలే , మనసును తయారు చేసుకునేందుకు శివుడు సంతోషముతో కాలమును తెరచి ఉంచును.
సుందరమైన గుణములు గల ఈశ్వరా! సంపన్నుడైన ఈశ్వరా!
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
మూలంబున మునిగిన మైకము వీడి
దేహమును మించి దివ్యమున్నదనెన్ .
సృష్టిని జేరు దృష్టి కి
మౌనమనే సాధనము శక్తి కారకంబగున్ .
సుందర గుణేశ్వరా ! సంపన్నేశ్వరా ! |27|
భావం :
మనిషి తన మూలాల లోతులు తాకిన నాడు మాయా మైకము తొలగి . . . శరీరానికి అతీతమైన దివ్య శక్తిని అనుభవించును .
అంతర్దృష్టి సృష్టి ని తాకినపుడు , మౌనము శక్తి కారకమైన సాధనము అగును.
సుందరమైన గుణములు గల ఈశ్వరా! సంపన్నుడైన ఈశ్వరా!
ఓం శాంతి
శివ బాబా 🙏
యడ్ల శ్రీనివాసరావు 22 Oct 2026 12:00 PM

No comments:
Post a Comment