మనసు ఉహకు శిరోధార్యం
• ఈశ్వర పరమేశ్వర !
• నీ ఆటేమిటో, నీ పాట ఏమిటో, నీ లీల ఏమిటో......
• నీ పాదాల చెంత నిలిస్తేనే కదా తెలిసేది నేనేమిటో .....
• నీ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటావు....కారణం లేకుండా ఏదీ జరగదు అంటావు....కానీ కారణం తెలిసేనాటికి కాలాతీతం అయిపోతుంది.
🌹🌹🌹🌹🌹🌹
• రాయించెడిది నీవు, రాసేడిది నేను..... నిజము కాని నిజము సజీవమై నడిమధ్యన ఏమిటయ్యా ....ఈశ్వరా!
• ఎదురుపడిన చూపులకు చూపే కరువైనపుడు….
• ఎదురుపడిన మాటలకు మాటలే కరువైనపుడు….
• చూపులు లేని, మాటలు లేని నడుమ జీవం ఉంటుందా….
• చూపులు మనసులకే గాని మనుషులకు కాదా….
• మాటలు మనసులకే కానీ మనుషులకు కాదా….
* మనసు వేరు..... మనిషి వేరా.....
• అవుతుంది….అవుతుంది….అర్థం అవుతుంది.....
* మనసు అంటే ఊహా..... మనిషి అంటే నిజం....
* మనసు మనిషి కావచ్చు కానీ, ఊహా నిజం కాదేమో....
• మరి మనసులోని ప్రేమ, రాతలోని ప్రేమ ఊహలోని నిజం నిజమే కదా!
* ఊహాలోని నిజం నిజం కానపుడు , నా ప్రేమ కూడా నిజం కాదంటావా.....
• లేని మనసును ఉన్నట్టు చూపి, మనసులోని ప్రేమకు, ఊహతో నిజమైన ప్రాణం ఎందుకు పోశావు ఈశ్వరా!...
* ఊహలోని నిజం నిజం కాదంటే భరించేే శక్తి నాకెక్కడిది .......ఈ ఊహకు నీవే శిరోధార్యం పరమేశ్వరా!
• ఏమైనా..... నీవు ఆడించే ఆటలో ఎప్పుడూ మనిషి కీలుబొమ్మయే , శివయ్యా!...
* ఆశలు కల్పిస్తావు, అందలమెక్కిస్తావు.....ఆవిరి చేసేస్తుంటావు.....ఈశ్వరా... పరమేశ్వరా!
యడ్ల శ్రీనివాసరావు
6 Aug 2021, 10:30 pm
No comments:
Post a Comment