Tuesday, August 3, 2021

75. ఏమనాలి.... ఏమనుకోవాలి

 

ఏమనాలి…. ఏమనుకోవాలి

• కలయిక కల కాదులే..... కల్పన కాదులే..... కారణముంటుంది లే.

• నా వేదన నీ రోదనలా.....నా సంతోషం నీ ఆనందంలా.... నే చెప్పకనే నా అనుభూతులు నీవి అవుతుంటే, ఏమనాలి.... ఏమనుకోవాలి.

తడబడిన మాటలే, నీ కోసం......తపన పడుతుంటే,

• అర్థం లేని ఈ అక్షరాలే సమూహమై,   నీకోసం..... ఆరాధనగా మారుతుంటే,

• నిరాశ తో దిక్కులు చూసే కనులే, నీకోసం...... దేదీప్యమవుతుంటే,

• నీ మాట లోని శబ్దం కోసం.....నా గుండె లోని శబ్దం ఎదురుచూస్తూ ఉంటే.....ఏమనాలి..... ఏమనుకోవాలి.

• నువు చెప్పకనే, చెప్పిన చెప్పలేని భావాన్ని......చెప్పినాక, చిగురించిన భావానికే అర్థం తెలిసింది,   నీవు నాకు తోడుగా ఉంటే....నా నీడకు నీవే జీవమని.

• నీ అదరముల అలజడికి జ్వలించిన, నుదుటిపై స్వేదము నేనని తెలియడం లేదా....

• నీ స్వరూపానికి సారూప్యతను నిచ్చే సమతుల్యం నేనని తెలియడం లేదా....

• చెలి ఓ చెలి, చాచే నీ చేతుల్లో ఒదగాలని.....నిలిచే నీ పాదాల చెంత కరగాలని.......మనసు పడే ఆరాటాన్ని ఏమనాలి......ఏమనుకోవాలి.

యడ్ల శ్రీనివాసరావు

31 July 21 7:30 am


No comments:

Post a Comment

709. భగవంతుని జ్ఞానం - మనిషి భక్తి

  భగవంతుని జ్ఞానం - మనిషి భక్తి • భగవంతుని జ్ఞానం ఆధారంగా శాస్త్రాలలో ఎన్నో విషయాలు పొందుపరచబడ్డాయి. భక్తి మార్గం లో ఈ విషయాలను కధల రూపం లో...