ఎదురు చూపుల క్షణాలు
• నది కనపడని మదిలో
నీరు ఎక్కడిదో
ఇంత కన్నీరు ఎక్కడిదో.
• పొంగి పొరలుతున్న నీరు
కంటి పొరలలో
ఎక్కడ దాగి ఉందో.
• మదిలోని మదనం “ఆవిరై”
కంటి లోని “కలవరంతో” కనపడె
నీ రూపం కన్నీటి స్వరూపం.
• సముద్రం లో నీరంతా ఉప్పే అయితే
నా కంటి వెనుక
ఎంత లోతైన సముద్రం ఉందో.
• తియ్యని మనసులకేనా
ఇంత ఉప్పుటి నీరు కన్నీరు.
• కంటజారే కన్నీరు తొలిసారి
నా పై కనికరం చూపిస్తుంది.
• ఎందుకంటే ఎందుకంటే
• చెలి చేరువతో కన్నీరు
నా కన్నీరు అమృతం కురిపిస్తుంది.
• ఈ అమృతం తో మృత్యువే లేదు
నా హృదయానికి
• కనులు తెరిచి చూస్తే…
కలలోని చెలి కంటి ముందు లేదు…
కాని…..కానీ….
కంటనీరు మాత్రం ఉప్పగా కా రు తూ నే....
కా రు తూ నే ఉంది.
సన్నగా….చెమ్మగా…ముద్దగా.
Gift of God on auspicious Day.
18 sept 6:30pm… YSR.
No comments:
Post a Comment