ఏ దారి నీది ... ఓ గోదారి
• ఏ దారి నీది ... ఓ గోదారి
ఏ దారి నీది ... ఓ గోదారి
• నాశిఖ న మొదలై నా ఎదురు నిలిచావు.
ఉరకలు వేశావు ఒంపులు తిరిగావు.
పల్లం ఎరిగావు పాయలుగా చీలావు.
పరవళ్లు తొక్కుతూ సాగరంలో కలిసావు.
• ఏ దారి నీది ... ఓ గోదారి
ఏ దారి నీది ... ఓ గోదారి
• నిశ్చలమై వేకువన రవి తేజం తో మెరిసావు.
చలనమై నిశిలోన చంద్ర కాంత వయ్యావు.
• కళ కళ కాంతులతో కాంతు లీనావు.
మిల మిల మీనాలతో మైత్రి చేశావు.
• అలుపెరుగక అందాలు ఎన్నో ఆరబోస్తావు.
ప్రియురాలి వై కవులను పరవశింప చేస్తావు.
• నీ ప్రేమ లో మునిగే వారు ఎందరో
నీ ఒడి లో కలిసే వారు ఎందరో.
• ఏ దారి నీది ... ఓ గోదారి
ఏ దారి నీది ... ఓ గోదారి.
• నాశిఖ న మొదలై నా ఎదురు నిలిచావు.
ఉరకలు వేశావు ఒంపులు తిరిగావు.
పల్లం ఎరిగావు పాయలుగా చీలావు.
పరవళ్లు తొక్కుతూ సాగరంలో కలిసావు.
• ఏ దారి నీది ... ఓ గోదారి
ఏ దారి నీది ... ఓ గోదారి.
• ఇసుక తిన్నెలను తాకే నీ శృంగారం ...
ప్రతి రేయి వెన్నెల కు చోద్యం.
• చిలిపి గాలులను రేపే నీ సరాగం ...
ప్రతి పొద్దు మంచు కి ఒయ్యారం.
• నా జీవం లో కలిసావు కావ్యం అయ్యావు.
నా మనసులో నిండావు అఖండ మయ్యావు.
• ఏ దారి నీది ... ఓ గోదారి
ఏ దారి నీది ... ఓ గోదారి.
• నాశిఖ న మొదలై నా ఎదురు నిలిచావు
ఉరకలు వేశావు ఒంపులు తిరిగావు.
పల్లం ఎరిగావు పాయలుగా చీలావు.
పరవళ్లు తొక్కుతూ సాగరంలో కలిసావు.
యడ్ల శ్రీనివాసరావు 9 Dec 2024 1:30 AM .
No comments:
Post a Comment