Friday, December 13, 2024

571. సాగర సల్లాపం భావ యుక్తం

 

సాగర సల్లాపం భావ యుక్తం.


ఈ   సాగర     సల్లాపం

  అమరం         అఖిలం.

• ఈ   సాగర     సల్లాపం

  ఆనందం        ఆహ్లాదం.


• ప్రకృతి    పాటవం     ఇహ  సంభూతం

  కడలి    సాంగత్యం    పర   సమ్మోహం.

• దివి భువి    మిలనం       ఈ కెరటం

  నఖ శిఖ     పర్యంతం       సంతుష్టం.


ఈ   సాగర     సల్లాపం

  అమరం         అఖిలం.

• ఈ   సాగర     సల్లాపం

  ఆనందం        ఆహ్లాదం.


సితారలు    సిరు లీనే    ఈ  పసిడి   తోరణం.

  జాబిలి        గిరి  గీసే     ఈ   వెండి    వాకిలి.


• పాలపుంత  పరికిణీ లో 

  జాలువారె     ఈ   అందాలు

• అలల      ఆరాటంతో

  నడయాడే    ఈ నయగారం.


• మొక్కవోని    మాను లో

  చిగురించే       ఓ సంతోషం.

• ధరణి లోని     దాక్షిణ్యం

  కనువిందు   చేసే    ఈ చిత్రం.


• ఈ   సాగర     సల్లాపం

  అమరం         అఖిలం.

• ఈ   సాగర     సల్లాపం

  ఆనందం        ఆహ్లాదం.


భావ యుక్తం 


• ఈ సాగరం తో    పరస్పర   సంభాషణం     

  చిరకాలమైనది,    నిత్యం   ఉండేది.

• ఈ సాగరం తో     పరస్పర  సంభాషణం

  ఆనందకరమైనది,    ఉత్సాహమైనది.


ప్రకృతి  నైపుణ్యం   

  ఈ లోకం  కోసం   జన్మించింది.

• సముద్రం తో    స్నేహం   

  మోక్షానికి    ఆకర్షణం.


• భూమి   ఆకాశం    కలయిక      ఈ కెరటం.

• పాదము  నుంచి  శిరసు   వరకు   సంతోషం.


• ఈ సాగరం తో     పరస్పర    సంభాషణం     

  చిరకాలమైనది,       నిత్యం ఉండేది.

• ఈ సాగరం తో      పరస్పర   సంభాషణం

  ఆనందకరమైనది,     ఉత్సాహమైనది.


• నక్షత్రాలు   వెలుగులతో   నింపే 

  ఈ   బంగారు తోరణం.

• చందమామ  వలయం తో   నింపే

  ఈ  వెండి వాకిలి.


• పాలపుంత   పరికిణీ  నుంచి  

  జారాయి   ఈ అందాలు.

• అలలు   ఉరకలు   సంచరిస్తున్నాయి 

  మృదు   మనోహరం గా.


• వంగని  చెట్టు లో   

  చిగురించెను   సంతోషం.

• భూమి  తన    ప్రేమతో  

  కనువిందు   చేసే   ఈ చిత్రం.


• ఈ సాగరం తో      పరస్పర     సంభాషణం     

  చిరకాలమైనది,        నిత్యం   ఉండేది.

• ఈ సాగరం తో       పరస్పర    సంభాషణం

  ఆనందకరమైనది,      ఉత్సాహమైనది.



 యడ్ల శ్రీనివాసరావు 13 DEC 2024 , 9:30 PM .





No comments:

Post a Comment

574. భగవాన్

  భగవాన్ • భగవాన్    అనేది  సంస్కృత పదం. అర్థం   భగవంతుడు. • భ   +    అగ్   +    వా   +    ఆ  +  న్   భూమి   + అగ్ని + వాయువు + ఆకాశం...