మనో శతకం -9
వెండి గొండకు వెలుఁగు కొరతా
బండ బ్రతుకుకి భాధల్ భారమా
పరిపాకన మదిన ఆశల్ నొసగునా
కృశింజిన మొలకన్ చంద్రిక వరమా
సుందర గుణేశ్వరా ! సంపన్నేశ్వరా ! |22|
భావం:
వెండిగ మారిన కొండకి వెలుతురు కొదవా.
బండగ మారిన బ్రతుకు కి బాధలు బరువా.
పండిన మనసు లో ఆశలు నిండునా.
ఎండిన మొక్కకి వెన్నెల వరమా.
సుందర గుణములు కలిగిన ఈశ్వరా ! సంపన్నుడైన ఈశ్వరా!
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
ఎండన పద్మము స్వేదంబు గక్కునా
కాలిన భస్మంబు కలత నొందునా
కండల్ కరగని కాయంబు కలి కోమలం.
మది నిండెన్ ముక్కంటి బ్రతుకున్ మహోత్సవం.
సుందర గుణేశ్వరా ! సంపన్నేశ్వరా ! |23|
భావం:
ఎండ లోని తామర చెమట కక్కునా.
కాలినంతలో విభూది కలత చెందునా.
కష్టం చేయని శరీరం కలికాలమున సౌందర్యం.
మనసు శివుని తో నిండినా బ్రతుకంతా పండగే.
సుందర గుణములు కలిగిన ఈశ్వరా ! సంపన్నుడైన ఈశ్వరా!
యడ్ల శ్రీనివాసరావు 19 Dec 2024, 3:00 AM.
No comments:
Post a Comment