అగ్ని చైతన్యం
By
రామకృష్ణ తులసి
• నీ శరీరం లో నిత్యం అగ్ని చైతన్యం ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. అది సర్వకాల సర్వావస్తల యందు నిన్ను నడిపిస్తూ ఉంటుంది. దానిని ప్రాణం అని, జీవం అని కొందరి భావన. అదే ఆత్మ.
• ఆ నిత్యాగ్ని హోత్రం , నీలో జ్వలింపచేసి రగిలించి నిలిపిన వాడు “అగ్గి కంటి” (పరమాత్మ శివుడు). అది కొండెక్కిన నాడు , నీ శరీరం ఉత్త తోలు బొమ్మ మాత్రమే. నీ చుట్టూ చేరిన జీవితపు కవ్వింతల కరి మబ్బులు , చీకటి ఛాయలు . అవి నీ బ్రతుకు ముంగిట కురియు వానలు. ఇవేవీ కూడా నీలోని బడబాగ్నిని చల్లార్చక నిన్ను నిలబెట్టువాడు “నిరంజనుడు”.
• నీ కర్మల ఫలములు గతం లో అనుభవించిన జన్మల ప్రాపకములు బేరీజు వేసి, నీ వేడిని వాడిని నిర్దేశించువాడు “కాల కాలుడు”. నీవు ఒత్తివి ఉత్తుత్తి తోలు తిత్తివి మాత్రమే. నీలోని రుద్రం రౌద్రం అన్నీ లయకారుడైన “శంకరుడే”. అందుకే నిత్య స్మరణం , సదాశివం సర్వాదాశివం.
ప్రాపకము = ఆధారము, పొందినది.
ఓం నమఃశివాయ 🙏
Written By రామకృష్ణ తులసి.
Image by
యడ్ల శ్రీనివాసరావు. 8 Dec 2024 12:00 PM.
No comments:
Post a Comment