భావనలు
• భావన లో బలము ఉంది.
భావన లో బలహీనత ఉంది.
• బ్రతుకే ఓ భావన
అందు నుంచి పుట్టాయి భావోద్వేగాలు.
• అవి మనిషి ని నడిపే రథచక్రాలు.
• భావన లో బలము ఉంది.
భావన లో బలహీనత ఉంది.
• బలమైన భావనలు
నిను దేని కీ బంధీ కానివ్వవు.
• బలహీన భావనలు
కడ కు కొండంత దుఃఖాన్ని చేర్చును.
• భావనలు ఊహలు కావు.
భావనలు కలలు కావు.
• భావనలు నీ ఆత్మ శక్తి కి
స్వరూపాలు . . . స్వరూపాలు.
• భావన లో బలము ఉంది.
భావన లో బలహీనత ఉంది.
• బలమైన భావనలు
నిను భగవత్ సన్నిధి చేర్చును.
• బలహీన భావనలు
తుదకు రావణ భ్రష్టుని గా మార్చును.
• భావనలు గాలి బుడగలు కావు.
భావనలు నీటి అలలు కావు.
• భావనలు నీ మనసు లోతు లో
దీపికలు . . . దీపికలు.
• భావన లో బలము ఉంది.
భావన లో బలహీనత ఉంది.
• భావన లో బ్రతుకు ఉంది.
భావన లో మరణం ఉంది.
దీపిక = వెలిగే జ్యోతి, దీపం.
యడ్ల శ్రీనివాసరావు 17 Dec 2024, 9:30 PM.
No comments:
Post a Comment