కెరటం - 2
మనసు ఓ కెరటం
• పడిలేచే కెరటమా
పరుగెందుకు . . . అలుపెందుకు
పయనం
నీ గమ్యం కాదు . . .
మార్గం మాత్రమే .
• పడిలేచే కెరటమా
పరుగెందుకు . . . అలుపెందుకు .
• ఆటు పోటు లకు అతీతం
కాలేవు ఎన్నడూ . . .
ఆదమరచి ఉన్నా కూడా
ఆగవు
అలజడులు ఏ నాడు .
• అమావాస్య రాగాలు
ఘోషలు నిండిన ఉరకలు .
• పున్నమి కాంతులు
మౌనం నిండిన నీడలు .
• పడిలేచే కెరటమా
పరుగెందుకు . . . అలుపెందుకు
పయనం
నీ గమ్యం కాదు . . .
మార్గం మాత్రమే .
• నీ అందాల ఆలంబనం
ఈ సృష్టి రూప కల్పనం .
ఎగసి పడుతు ఉంటుంటే
అదే నీకు భారం .
• నిశ్చలంగా లేని నీ చలనం
దిశ లేని గమనం .
గమ్యం తెలియని నీ కాలం
నిశి లోని అయోమయం .
• పడిలేచే కెరటమా
పరుగెందుకు . . . అలుపెందుకు
పరుగెందుకు . . . అలుపెందుకు .
కెరటం అనగా మనసు
యడ్ల శ్రీనివాసరావు 16 June 2025 8:00 PM .
No comments:
Post a Comment