చిన్నారుల సంబరాలు
• చిట్టి పొట్టి ఆటలు
చిన్నారి సంబరాలు
చిన్నారి సంబరాలు . . .
• నా చిన్నారి సంబరాలు
చిటుకు చిటుకు మంటూ
చెల రేగాయి చెలిమి తో .
• కోతి కొమ్మ లాటలు
పొన్నారి సోయగాలు
పొన్నారి సోయగాలు . . .
• నా పొన్నారి సోయగాలు
తళుకు తళుకు మంటూ
కలబోసాయి కలిమి గా .
• చినుకుల గెంతుల తో
చిలిపిగా ఆడాము .
పేపరు పడవల తో
కేరింతలు కొట్టాము .
• బురద లో మాధుర్యం
చవి చూసాము .
వరద లా ఆనందం
అనుభవించాము .
• చెప్పలేని భావాలు
ఈ చిత్రాలు .
చెప్పి న ర్థం చేసు కో లేవు
ఎన్నో బాల్యాలు .
• చిట్టి పొట్టి ఆటలు
చిన్నారి సంబరాలు .
కోతి కొమ్మ లాటాలు
పొన్నారి సోయగాలు .
• తైతక్క లాటడుతూ
కొంటె చేష్టలు చేసాము .
ఎంగిలి తాయిలాల ను
పంచుకు తిన్నాము .
• ఈడు లోని తోడు లో
స్నేహం చూసాము .
అనుభూతులు ఉద్వేగాలు
పంచుకున్నాము .
• చెప్పలేని భావాలు
ఈ చిత్రాలు .
చెప్పి న ర్థం చేసుకో లేవు
ఎన్నో బాల్యాలు .
• చిట్టి పొట్టి ఆటలు
చిన్నారి సంబరాలు .
కోతి కొమ్మ లాటలు
పొన్నారి సోయగాలు .
• బాల్యం లో మేమంతా
ఎగిరే తూనీగలం .
అలుపెరుగని ఆటలతో
ఆరితేరాము .
• కోరికలు ఎరుగని
కడు సామాన్యులం .
చిరుతిళ్ళు తోనే
సంతోష పడ్డాము .
• సినిమాల కెళితే
చిరంజీవి లం .
బడి లోన మాత్రం
బిక్కు బిక్కు ఉడత లం .
• తరగని ఆత్మీయత లే
మా ఆస్తి .
అందు కే నేటి కీ
పొందలే దు మేము సుస్తీ .
• చిట్టి పొట్టి ఆటలు
చిన్నారి సంబరాలు .
కోతి కొమ్మ లాటలు
పొన్నారి సోయగాలు
• చిన్నారి సంబరాలు . . .
నా చిన్నారి సంబరాలు
• పొన్నారి సోయగాలు . . .
నా పొన్నారి సోయగాలు
పొన్నారి = మనోహర మైన
సోయగాలు = అందాలు
యడ్ల శ్రీనివాసరావు 26 June 2025 10:30 PM
No comments:
Post a Comment