ఈషా రంగ ప్రవేశం
• ఇదే ఇదే . . . రంగ ప్రవేశం
సృష్టి స్థితి లయ రులకు
స్వాగతం . . . సుస్వాగతం .
• ఇదే ఇదే . . . రంగ ప్రవేశం
సృష్టి స్థితి లయ రులకు
స్వాగతం . . . సుస్వాగతం .
• నయ గ రాల నయనం
ఈ నృత్యం .
సప్త మాతృకల సదనం
ఈ నాట్యం .
• కళా సాగరం . . . కూచిపూడి నర్తనం
అది జన్మాంతరాల భాగ్యం .
• ఈశ్వరు ని భంగిమ ల జీవం
ఈషా ని అభిన య రూపం .
• దేవతల ఇష్టకామ్యం
ఈ కూచిపూడి నాట్యం .
• దేవదేవుని ఆశీర్వాదం
ఈ నాటి ఆరంగేట్రం .
• ఇదే ఇదే . . . రంగ ప్రవేశం
సృష్టి స్థితి లయ రులకు
స్వాగతం . . . సుస్వాగతం .
• ఇదే ఇదే . . . రంగ ప్రవేశం
సృష్టి స్థితి లయ రులకు
స్వాగతం . . . సుస్వాగతం .
• గురువిణి తీర్చి న ఈ శిల్పం
లయ భావాల పారిజాతం .
• పాదాలు చేసేను . . .
పదనిసల సమన్వయం .
• నేత్రాలు ఆడేను
సరిగమల సావధానం .
• గమకాలు ప్రాసలు . . .
ఈ నాటి అతిధులు .
• సంతోష తాళాలు . . .
ఈషా కి దీవెనలు .
• ఇదే ఇదే . . . రంగ ప్రవేశం
సృష్టి స్థితి లయ రులకు
స్వాగతం . . . సుస్వాగతం .
• ఇదే ఇదే . . . రంగ ప్రవేశం
సృష్టి స్థితి లయ రులకు
స్వాగతం . . . సుస్వాగతం .
ఓం నమఃశివాయ 🙏
ఓం శాంతి 🙏
🌹 🌹 🌹 🌹 🌹 🌹
• చాలా కాలం తరువాత, ఈ రోజు మెసేజ్ వచ్చింది . . .
నా చిన్ననాటి ఇంటర్మీడియట్ మిత్రుడు బొడ్డు శ్రీ హరి , స్నేహానికి విలువలకు వ్యక్తిత్వానికి ప్రతిరూపం , నాకు ఎన్నో విషయాల లో ప్రేరణ , ఆదర్శం . తను 2000 సంవత్సరం లో అమెరికా వెళ్లి స్థిరపడ్డాడు. తన కుమార్తె చిరంజీవి “ Eesha ” అమెరికా లో పుట్టి, పెరిగింది.
ఈషా అనగా సంస్కృత అర్దం ఈశ్వరుడు .
• తన ఫస్ట్ birthday India లో జరిగినపుడు మరియు ఒక పది సంవత్సరాల క్రితం ఇండియా వచ్చినప్పుడు మాత్రమే చూడడం జరిగింది. ఆమె బాల్యం నుంచి కూచిపూడి నాట్యం యజ్ఞం వలే నేర్చుకుంది. సాంస్కృతిక కళలను అభినయించడం పూర్వ జన్మల సుకృతం మరియు శివుని అనుగ్రహం.
• కుమారి ఈషా కూచిపూడి నృత్య రంగ ప్రవేశం, 2025 ఆగష్టు 2వ తేదీ న అమెరికా న్యూజెర్సీలో జరుగుతున్న సందర్భంగా , నా మిత్రుడు బొడ్డు శ్రీహరి ఈ రోజు ఆహ్వానం తెలియ పరిచాడు .
ఇది చాలా చాలా సంతోషం అనిపించింది .
భారతీయ సంస్కృతి, కళలను ప్రపంచానికి మరింత విస్తరింప చేసే శక్తి , కుమారి ఈషా ఆ శివుని ద్వారా పొందాలని , మంచి శాస్త్రీయ నృత్య కారిణి గా ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి పొందాలని . . . ఈశ్వరుని తో కలిసి యోగదానం చేయడమైనది .
• అమెరికాలో అందుబాటులో అవకాశం ఉన్న సాహితీ పాఠకులు మరియు కళాభిమానులు ఈ కార్యక్రమానికి హాజరై వీక్షించి, కుమారి ఈషా కి మీ శుభ దీవెనలు కోరుతూ 🙏
మరియు . . .
ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల లో నిరంతరం ఈ బ్లాగు ను వీక్షిస్తున్న తెలుగు సాహితీ అభిమానుల యొక్క మనో శుభాశీస్సులు కోరుతూ 🙏
Please click the invitation link 👇 .
https://sites.google.com/view/eeshaboddurp/eesha-boddus-kuchipudi-rangapravesam?authuser=0
కళలను ప్రోత్సహించడం దివ్యత్వం.
For Eshaa's prior video in my article అర్థనారీశ్వరం please click here 👇 .
https://yedlathoughts.blogspot.com/2023/03/blog-post.html
యడ్ల శ్రీనివాసరావు 20 June 2025 1:30 AM.
🙏🙏🙏
No comments:
Post a Comment