Sunday, November 2, 2025

703. నెగిటివ్ శక్తి మార్పిడిల చక్రాన్ని బ్రేక్ చేయడం

 


 నెగిటివ్ శక్తి మార్పిడిల చక్రాన్ని బ్రేక్ చేయడం 



• మన జీవితంలో  ఎప్పుడూ , ఎవరో ఒకరైనా  అసౌకర్యం  కలిగించే వ్యక్తి  ఉంటారు. వారు దాదాపు అన్ని సమయాలలో చికాకు పెట్టే విధంగా ఏదో ఒకటి చేస్తారు లేదా వారు చేసే పని మనల్ని చికాకు పెట్టే విధంగా ఉందని మనం అనుకుంటాము.

కొన్నిసార్లు అవతలి వ్యక్తికి ఆ ఉద్దేశ్యం లేనప్పటికీ, వారి స్వభావం మాటిమాటికీ గుర్తు పెట్టుకొని వారు ఆ విధంగానే ఉన్నారని మనం భావిస్తాము. దీనికి ప్రతిచర్యల  రూపంలో  మనం బదులిచ్చినటువంటి ప్రతీది  ఒక నెగెటివ్ ప్రభావం క్రియేట్ చేస్తుంది. 

ఈ నెగిటివ్ భావాల ప్రభావాలు   మన వరకే పరిమితమైనట్లైతే , అవి మనకు మాత్రమే అసౌకర్యాన్ని కలిగిస్తాయి . 

 కానీ ఈ భావాలు   చర్యలు (actions) చేయడం ఆరంభిస్తే,  నెగెటివ్  చర్య (action) ప్రతిచర్యల (reaction) చక్రాన్ని  ప్రారంభిస్తాయి, తద్వారా అలాంటి హానికరమైన భావాలు అవతలి వ్యక్తికి చేరుకుంటాయి.


• ఈ ఎనర్జీ ని   స్వీకరించినప్పుడు , అవతలి వ్యక్తి మనల్ని  నెగిటివ్ గా అనుకోవడం , స్పందించడం లేదా మన గురించి నెగటివ్ గా ఆలోచించడం ప్రారంభిస్తాడు. మనకు మరియు అవతలి వ్యక్తికి మధ్య  కనిపించని  యుద్ధం  ప్రారంభమవుతుంది. నెగిటివ్ ఆలోచనలు, భావాలు, వైఖరులు, మాటలు మరియు చేతలు ఇచ్చిపుచ్చుకుంటాము . అవతలి వ్యక్తితో నెగిటివ్ కర్మల ఖాతాలు లేదా బంధనాలు సృష్టించబడతాయి. 

ఈ నెగిటివ్ కర్మల ఖాతాలు పెరుగుతూ ఉంటాయి. అటువంటప్పుడు,  మనం లేదా అవతలి వ్యక్తి , ఎప్పటికప్పుడు , భౌతికంగా  లేదా ఆలోచనలు సంకల్పాలతో   పాజిటివ్ గా  వ్యవహరించినా లేదా ప్రతిస్పందించినా , నెగిటివ్ బంధనాలు బ్రేక్ చేసి సంబంధాన్ని పాజిటివ్ గా మారుస్తుంది లేదా బంధనాలను  చాలా తగ్గిస్తుంది. 

కానీ , తక్కువ పాజిటివ్‌ తో  పాటు ఎక్కువ నెగెటివ్‌లు ఉంటే ,  నెగటివ్‌ ప్రభావాలను కొద్దిగా తగ్గిస్తుందే కానీ పూర్తిగా తొలగించదు.


 💐  💐  💐  💐  💐


• ఒక వ్యక్తితో నెగిటివ్ శక్తి మార్పిడి యొక్క చక్రాన్ని బ్రేక్ చేయడానికి మొదటి పద్ధతి  స్వపరివర్తన .

స్వ పరివర్తన యొక్క మొదటి మెట్టు ఎదుటి వ్యక్తికి మాటల్లో తిరిగి నేను ప్రతిస్పందించను . కానీ నేను ఇతరుల నుండి పొందిన నెగిటివ్ శక్తిని , భౌతిక రూపాల్లో అనగా  నెగిటివ్ ఆలోచనల హావభావాలు , అంతర్ దృష్టి , మరియు చేతల ద్వారా ఇతరులకు  వ్యక్తపరుస్తూ  నెగిటివ్ వాతావరణాన్ని  సృష్టిస్తాను . 

దీని వలన  ఇతరుల మనస్సులలో   ఆ వ్యక్తి గురించి   నెగిటివ్ అవగాహన  కలిగిస్తుంది. ఆ వ్యక్తి వలన  సంబంధాల సఖ్యత కు హాని జరిగినందున భౌతిక స్థాయిలో నష్టం జరుగుతుంది. నష్టం జరిగాక నియంత్రించవలసి   ఉంటుంది, ఇది కొన్నిసార్లు చాలా ఆలస్యం అవుతుంది. ఎందుకంటే మనం ఈ నెగిటివ్ సమాచారాన్ని చుట్టూ ఉన్న ఇతరులకు , మరియు కొన్నిసార్లు  మనకు హాని చేసినట్లుగా  మనం ముందుగా భావించిన వ్యక్తికి  కూడా  చేరవేస్తాము .


స్వ పరివర్తన యొక్క కొంచెం లోతైన రెండవ పద్ధతి స్థాయి ఏమిటంటే, నాకు హాని చేసిన వ్యక్తి కి నేను ప్రతిస్పందించకపోవడమే  కాకుండా నాకు సన్నిహితంగా ఉండే వ్యక్తులెవరితోనూ   ఆ వ్యక్తి గురించి వ్యతిరేకంగా మాట్లాడను. కానీ నేను అవతలి వ్యక్తి గురించి నెగిటివ్ గా ఆలోచిస్తూనే ఉంటాను. అటువంటి సందర్భాలలో, నా ఆలోచనలు మరియు భావోద్వేగాలు పూర్తిగా నా నియంత్రణలో లేనందున, హావభావాలనే  తెరల వెనుక తెలియకుండా మరియు గుప్తంగా జరుగుతుంది. అటువంటి ఆలోచనలను తెలిసి చేసినా లేదా అంతర్గత బలం లేకపోవడం వల్ల అవి అనుకోకుండానే చేసినా ఆలోచనలు, భావోద్వేగాలు ఈ రకంగా ఉండటం, ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాథమిక అంశాల ప్రకారం తప్పు. ఈ నెగిటివ్ ఆలోచనలు మరియు భావోద్వేగాలు ఒక సూక్ష్మ స్థాయిలో అవతలి వ్యక్తికి చేరుకుంటాయి, ఆ వ్యక్తితో సంబంధాలను దెబ్బతీస్తాయి.


స్వ పరివర్తన యొక్క మూడవ మరియు లోతైన స్థాయి నా ఆలోచనలు, భావాల క్వాలిటి మార్చుకునే శక్తిని నేను పెంచుకుంటాను . నా ప్రతిచర్యలకు  మూలమైన లోపాన్ని (బలహీనతను) తొలగించడానికి నేను మానసికంగా శక్తిని పొందుతాను, తద్వారా నన్ను బాధపెట్టేది ఏదీ కూడా  ఇకపై ఇది వరలా  బాధపెట్టలేదు . తద్వారా అందరూ కోరుకున్నట్టుగా  సంబంధాలను కాపాడుకోగలను  . 

ఇముడ్చుకునే శక్తి,  స్వపరివర్తనలను ఉత్తమంగా ఆచరించినట్లవుతుంది. ఇందులోనే మరొకరితో నెగిటివ్ శక్తి మార్పిడిని ఆపగల సామర్ధ్యం పుష్కలంగా  ఉంటుంది .


యడ్ల శ్రీనివాసరావు 21 Oct 2025 11:30 AM



703. నెగిటివ్ శక్తి మార్పిడిల చక్రాన్ని బ్రేక్ చేయడం

   నెగిటివ్ శక్తి మార్పిడిల చక్రాన్ని బ్రేక్ చేయడం  • మన జీవితంలో  ఎప్పుడూ , ఎవరో ఒకరైనా  అసౌకర్యం  కలిగించే వ్యక్తి  ఉంటారు. వారు దాదాపు అన...