Wednesday, November 19, 2025

707. నీ వెవరో నీకు తెలియాలి

 

నీ వెవరో నీకు తెలియాలి




• తెలియాలి    తెలియాలి

  మనిషి కి    తానెవరో     తెలియాలి .

• తెలియాలి    తెలియాలి

  మనిషి కి    తన  జన్మకి   కారణ     తెలియాలి


• తెలియక    గడిపే   కాలం

  మనిషి కి    జన్మాంతరాలు   అంధకారం .

• తెలియక    గడిపే   జీవనం

  చుక్కాని    లేని    నావ   పయనం .


• అందుకే . . .

• తెలియాలి    తెలియాలి

  మనిషి కి   తానెవరో    తెలియాలి.

• తెలియాలి     తెలియాలి

  మనిషి కి  తన  జన్మకి   కారణ తెలియాలి .


• తన  మూలం   తెలియాలంటే

  అందుకు . . .

  చేయాలి   శివుని తో   నిత్యం   ధ్యానం యోగం .

• తన   మర్మం    తెలియాలంటే

  అందుకు . . .

  వినాలి    సత్య    బ్రహ్మ  జ్ఞానం .


• జ్ఞాన యోగాలు    తెలియక

  దుఃఖ సాగరం

  ఈదుతున్నాడు   నేటి   మనిషి .

• ఆశనిరాశ  ల    తీరు తో

  పాప పుణ్యాలు

  ఎరుగకున్నాడు   నేటి  మనిషి .


• శాంతి   సుఖము   ఎరుగక

  మనసు   అలజడుల తో   సహవాసం

  చేస్తూ  ఉంది .

• అల్ప   కాలిక    కోర్కెల తో

  బుద్ధి   అర్థాయుష్షు తో    జీవనం

  సాగిస్తుంది.


• అందుకే . . .

• తెలియాలి     తెలియాలి

  మనిషి కి    తానెవరో     తెలియాలి.

• తెలియాలి      తెలియాలి

  మనిషి కి    తన  జన్మకి   కారణ     తెలియాలి .


• తన   మూలం  తెలియాలంటే

  అందుకు . . .

  చేయాలి  శివుని తో   నిత్యం   ధ్యానం యోగం

• తన    మర్మం   తెలియాలంటే

  అందుకు . . .

  వినాలి    సత్య   బ్రహ్మ  జ్ఞానం .


• భక్తి లో   మిగులుతున్నది   రోదన .

  అందుకు   నిదర్శనం

  ఆలయాల  తొక్కిస   మరణాలు .


• భక్తి లో    కలుగుతున్నది   వేదన .

  అందుకు    నిదర్శనం

  ఆలయాలలో   ఖరీదైన   పూజలు .


• భక్తి లో    అనుభవిస్తున్నది   యాతన .

  అందుకు   నిదర్శనం

  ఆలయాలలో   గంటల   తరబడి    నిరీక్షణ.


• మనిషి కి    తానెవరో   తనకు

  తెలియని    కాలమంతా

  దైవాన్ని    శిల లోనే    చూస్తాడు .


• తానెవరో   తాను   తెలుసుకున్న నాడు

  శివుడే  తన తండ్రని   సత్య మెరిగి 

  తన   మనసు లోనే   చూస్తాడు .


• అందుకే . . .

• తెలియాలి    తెలియాలి

  మనిషి కి    తానెవరో     తెలియాలి.

తెలియాలి    తెలియాలి 

 మనిషి కి    తన   జన్మకి    కారణ  తెలియాలి .


• తన   మూలం   తెలియాలంటే

  అందుకు

  చేయాలి  శివుని తో   నిత్యం   ధ్యానం యోగం

• తన    మర్మం   తెలియాలంటే

  అందుకు

  వినాలి    సత్య   బ్రహ్మ  జ్ఞానం .


🌹🌹🌹🌹

• నేటి కలియుగం అంత్య సమయం లో , సృష్టి వినాశన కాలం లో మనిషి పూర్తి అచేతనుడై , అంధకారంలో  తాను ఎవరో తాను తెలుసుకో లేక , అన్ని  సంపదలు సమృద్ధిగా ఉన్నా  సరే , కష్టాలకు తాళలేక,  దుఃఖం భరించలేక మరియు మితి మీరిన కోరికల సఫలత కోసం , భగవంతుని పొందుట కోసం భక్తి చేస్తూ అనేక ఆలయాలు చుట్టూ తిరుగుతూ ప్రయాస పడుతున్నాడు అనేది వాస్తవం . 

కానీ , ఇందులో ముఖ్యంగా భాధపడ వలసిన అంశం, ఈ మధ్య కాలంలో తరచుగా ఆలయాల లో ప్రాణాలు కోల్పోతున్న కొందరి రోదన . . ‌.

భగవంతుని కోసం చేసే ఖరీదైన వ్రతాలు , కళ్యాణాలు పూజలు  , తీర్థయాత్రలు , పుష్కరాలు , గంగా స్నానాల పేరుతో  చేసే అమాయక పేదవారి అప్పుల వేదన  . . . 

భగవంతుని దర్శనం కోసం రోజులు గంటలు తరబడి Q లైన్ల లో నిరీక్షణ తో అనారోగ్యాల బారిన పడే మహిళలు , వృద్ధుల యాతన .

  ఆలోచించండి . ‌ . . వీటన్నింటితో

• నిజం గా భగవంతుడు మనిషికి లభిస్తున్నాడా ?

• భగవంతుడు మనిషికి సాక్షాత్కారం ఇస్తున్నాడా ?

• భగవంతుడిని ,  మనిషి స్వయం గా మనసు తో నిరంతరం  అనుభవం చేయగలుగుతున్నాడా ?


• ఓ మనిషి ముందు అసలు నీవు ఎవరో తెలుసుకో , అసలు నువ్వు ఎక్కడ నుంచి ఈ భూమి మీదకు  వచ్చావో , అసలు ఎందుకు వచ్చావో  తెలుసు కో.  ఏ కారణం లేకుండా నీవు జన్మించవు కదా ?  . . .  ఇది తెలుసుకున్న నాడు , భగవంతుడు స్వయంగా నీ చేతిని స్పృశించడం ఆరంభిస్తాడు . 

అందుకోసం నీవు   ఈ వేదన రోదన యాతన పడవలసిన అవసరం లేదు. నిత్యం వేకువజామున నిద్రలేచి , ఇంటి లోనే ఉండి శివుని తో అనుసంధానం అయి ధ్యాన యోగం చెయ్యి . శివుని యొక్క సత్యమైన బ్రహ్మ జ్ఞానం, నీకు దగ్గర లో ఉన్న బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం వారి , ఓం శాంతి ధ్యాన ఆశ్రమం నందు ఉచితం గా ఒక అరగంట విను . అప్పుడు భగవంతుని తో నీ ప్రయాణం ఎంత అత్యుత్తమంగా ఉంటుందో కనీసం ఊహించడానికి , నీ శక్తి కూడా సరిపోదు.

• శివుని ని , నీ మనసు లో   ప్రేమ తో తండ్రి గా ఆరాధించు , మాట్లాడు . నీకు ఏ ప్రయాస వేదన రోదన యాతన ఉండదు. నీకు మిగిలేది అనంతమైన ఆనందం సంతోషం . నీ జీవితానికి సఫలత లభిస్తుంది . ఇంతకు మించి నీకేం కావాలి ? ఆలోచించు. పోయేది ఏమీ లేదు. 


గమనిక : క్షమించాలి .... ఇది ఏ ఒక్కరి భక్తి యెక్క మనోభావాలను  ఉద్ధేశించి కాదు .  భక్తి ద్వారా అనేక జన్మలు నుంచి మనిషి పొంద వలసిన సఫలత పొంద లేక ఇంకా దుఃఖం అనుభవిస్తూ నే ఉన్నాడు .   దీనికి కారణం భగవంతుని యధార్థం ఏమిటో తెలియక పోవడం. మరియు మనిషి కి తన యధార్థం  ఏమిటో తెలియక పోవడం.  భగవంతుడికి  చేసే భక్తి , తాను ఉన్న చోట నుండి, తాను ఉంటున్న స్థితి నుంచి  మనసు ను భగవంతుని తో అనుసంధానం చేయడం ద్వారా తన జన్మ కు , జీవితానికి సఫలత పొందగలడు.  ఇది ధ్యానం యోగం ద్వారా సాధ్యం అవుతుంది.

రెండు కళ్ళ తో చూసిన భగవంతుని ప్రతిబింబం దేహం లో  తాత్కాలికంగా కొన్ని సెకన్లు ఉంటుంది . మనో నేత్రం, జ్ఞాన నేత్రం తో చూసే భగవంతుని జ్యోతి బిందు స్వరూపం  మనసు లో శాశ్వతంగా ఉంటుంది .



  ఓం శాంతి 🙏

  ఓం నమఃశివాయ 🙏.


యడ్ల శ్రీనివాసరావు 19 Nov 2025 6:30 PM.


No comments:

Post a Comment

714 . మనసు మాయ

  మనసు మాయ   • భ్రమ లలో    బ్రతుకు    భారము   మనసా   ఓ   మనసా   భ్రమ లలో    బ్రతుకు    భారము . • భ్రమ చుట్టూ    భ్రమణమే   మాయ   అది యే ...