శైవం
• ఈ మానవ జన్మలో ఈ లౌకిక ప్రాపంచిక విషయాలు మద్యలో ఉండి భగవంతుని వెదుకుట అనేది శూన్యం లో పదార్థం గూర్చి వెదకటమే . ప్రతి మానవునికి దేహం లో పంచ కర్మేంద్రియాలతో పాటుగా , ఆత్మ లో "జ్ఞాన నేత్రం" అనేది ఆది నుంచి ఉంది . ఎందుకంటే ఆత్మ స్వరూపులమైన మనం ఆ మహా దేవుడైన పరమాత్మ శివుని సంతానం. తండ్రి శివుడు కలిగి ఉన్న జ్ఞాన నేత్రం, మనో నేత్రం మనలో కూడా ఉంది. కానీ ద్వాపర కలియుగాల నుంచి అనేక జన్మలు గా మనం అనేక పాప కర్మలు చేస్తూ, వికారాలకు వశం అయిపోవడం వలన , మన ఆత్మ తన యొక్క దివ్య శక్తులను పూర్తిగా కోల్పోయి మన లోని మనో నేత్రం, జ్ఞాన నేత్రం మూసుకుపోయి నేడు ఉంది .
• ఈ జ్ఞాననేత్రం లేదా మనో నేత్రం ఎప్పుడు మనలోనుండి ఈ లోకమును చూడగలుగుతుందో ఆ దశ మన జన్మ కి , జీవితానికి అత్యుత్తమ ఉచ్చ దశ అనుకోవచ్చు. ఈ దశ లో మనకు ప్రాపంచిక విషయాలు తో పాటు దైవిక చింతన మోక్ష మార్గ సాధన పరమాత్మ సాక్షాత్కారం ఇలా అనేకానేకమైన పరతత్వపు విషయాలు గోచరిస్తూ ఉంటాయి.
జ్ఞానాన్ని ఆపాదించడం అంటే మహా మహా క్రతువులు ఆచరించడం లేదా పరమ పాండిత్యాన్ని పొంది ఉండటం లేదా మరేదైనా ఉన్నత పదవులను అదిరోహించడం కాదు. సర్వ సంగ పరిత్యాగులుగా మారటం లేదా ఘోర అఘోర క్రియల్లో నైపుణ్యం కల్గి ఉండడం ఇవి మాత్రమే ఆధ్యాత్మికతకు కొలమానములు కావు , అలాగని ఇవి కలిగి ఉన్నవారు మోక్ష సాధకులు కారనీ చెప్పజాలను .
• నీయొక్క కర్మలను లేదా నీ నడవడికని సహేతుకమైనదిగా మార్చుకొని , మనసు ను అనుక్షణం దైవ చింతన , పరమాత్మ స్మృతి యందు ఏకాగ్రతం కావించన యెడల , నీ శిరస్సు పై ఉన్న వికర్మల భారం తొలగి జ్ఞానమార్గం వైపు పయనం ఆరంభం అగును. అదే ముక్తి మార్గం అదే శివుని మార్గం.
• కమల పుష్పం బురదలో వికసిస్తుంది. అదే విధంగా ఆకర్షణ లతో నిండిన ఈ మాయ లోకం లో నీవు. జీవిస్తూ నే . . . విస్తారము , లోతు తెలియని సంసారం అనే మహా సాగరం లో నీవు జీవిస్తూ నే , అతీతంగా నీ మనసును శివుని పై లగ్నం చేసిన నాడు నీవు తప్పక ఒక వికసిత కమలం అవుతావు అనడం లో ఏమాత్రం సందేహం లేదు .
• శివుని మార్గములో నీవు ఆచరించ వలసినది సత్కర్మ. అంతకు మించి ఏదీ లేదు. నీకు పరమాత్మ ఇచ్చిన విచక్షణ చేత , నీ బుద్ధి తో ఆలోచించి నిర్ణయాలు తీసుకుని , ఆచరణ చేయు నీ కర్మ ఫలితమే దైవ మార్గమునకు సూచికము , అదే శైవ మార్గము. ఒక్కసారి శైవ మార్గము లోకి వచ్చావో నీ బ్రతుకు పండిపోయినట్టే , నీవు కైలాస లోక ఆనందాది అనుభూతులతో నిత్యం శివ తేజస్సుతో వర్ధిల్లుతూ ఉంటావు.
గుర్తు పెట్టుకో "ఏకం దైవం విరసిత శైవం".
ఓం శాంతి
ఓం నమః శివాయః
యడ్ల శ్రీనివాసరావు 17 Nov 2025 2:00 PM.

No comments:
Post a Comment