Tuesday, November 4, 2025

704 .కార్తీక భామ

 

కార్తీక  భామ



• ఓ భామ   . . .  చందభామ

  నిండు    పౌర్ణమి లో

  నీ పలకరింపు    ఓ  పులకింత .


• ఓ   భామ   . . .   చందభామ

  ఓ   భామ   . . .   చందభామ .


• నీ    చిరుమందహాసం తో 

  చీకట్లను     లాలించి . . .

  నిశి   లోని     నింగి ని

  నా   ముందు   పరిచావు .


• నీ   మౌన     భావం తో 

  మేఘాలను    దాటించి . . .

  ఇల  లోని   కొంగు గా

  నా  చుట్టు   చుట్టావు .


• ఓ   భామ   . . .   చందభామ

  నిండు   పౌర్ణమి లో

  నీ  పలకరింపు    ఓ   పులకింత .


• కన్నయ్య     మనసు కి

  వెన్న    తినిపించేను    నీ   వెన్నెల .

• ముత్యాల     మురిపాలు

  పొంగి    పొర్లేను     నా   కన్నుల .


• కార్తీక పౌర్ణమి న      నీ   దర్శనం

  పరమ    పవిత్రం .

• నీ  ఒడి ని   తాకే      నా  చూపు

  నోములు    అర్పితం .


• ఓ   భామ.   . . .   చందభామ

  ఓ    భామ    . . .   చందభామ .


• దారి  తెలియని    నీ   దూరానికి

  రహదారి  యే      నా   పదం .

• ఆశ   తెలియని    నా  మనసు కి

  ఆరాధనే      నీ    ప్రకాశం .


• ఓ    భామ   . . .   చందభామ

  ఓ    భామ    . . .   చందభామ .


  నోములు = వ్రతం .


చంద్రుని పై   ప్రేమ తో   ఓ  రోహిణి .

యడ్ల శ్రీనివాసరావు 4 Nov 2025 9:00 pm.


No comments:

Post a Comment

705. దర్పణం

  దర్పణం  • తలతు  ను    నీ   నామ ము   తపన  తో      నీ   ధ్యాన ము    వెరసి న     యోగ మే    ఈ కాల ము . • మనసు  న     శూన్య ము   మరపు   న    ...