Monday, November 24, 2025

708. మనిషి మోసపోయాడా ?

 

మనిషి మోసపోయాడా ?



• అవును . . . మనిషి ఈ కలి కాలం ఆది నుంచి 

  మోస పోయాడా ?

  మోసపోతూ  ఉన్నాడా ?  . . .


 ఈ విషయం  మనం ఎప్పుడైనా ఆలోచించామా ?

 ఇది గ్రహించలేక   అమాయకత్వం తో ఉన్నామా ?


• మన అందరికీ తెలిసిన విషయం , మనిషి ఇతరులను మోసం చెయ్యగలడు . ఒక మనిషి , ఇతరులను  మోసం  చేస్తేనే , ఆ మోసం బయటపడితేనే   మోసగాడు గా   ఈ లోకం లో అందరూ అభివర్ణిస్తారు . ఒకవేళ ఆ మోసం గురించి అందరికీ అంతర్గతం గా  తెలిసినా కూడా  అది బహిర్గతం  కాకపోతే  ఆ మనిషి ని  దొర లాగే కొనియాడుతారు . ఇది ఎంతవరకు నిజం ? . . . ఆలోచించండి ?.

అసలు, ఒక మనిషి ఇతరులను మోసం చేయకుంటే తాను గొప్ప వాడు అయిపోతాడా ? 

తాను  మంచివాడి గా   కీర్తించ బడతాడా ? 

తాను   మంచి మనిషిగా  రూపు దిద్ధికున్నట్లేనా ?


వీటిన్నిటికి సమాధానం స్పష్టత మనలో ఉందా? . .


• అసలు  మోసం అంటే ఏమిటి ?

 నయవంచన, ద్రోహం, అబద్ధాలు చెప్పడం , నిజాన్ని వక్రీకరించడం ఇలా అనేక విధాలుగా చేసే కర్మ ని మోసం  అని  అంటాం , వింటాం  .

• కానీ , మోసం  అంటే ఒక నిజాయితీ కలిగిన ఆలోచనని , సత్యత కలిగిన విషయాన్ని  మభ్య పెట్టడం లో ఆరితేరిన  మాయతో  కూడిన చర్య ,  ప్రక్రియే  మోసం .

• సహజ సిద్ధంగా  ప్రతి మనిషి కి  మానవ ధర్మం అనేది  ఒకటి ఉంటుంది. దాని  ప్రకారం మనిషి కి  తన  విజ్ణత తో  నిజాయితీ అనేది తెలుస్తుంది . ఈ నిజాయితీ ని  మనిషి  తనలోని మాయతో  మభ్య పెట్టడం ద్వారా  చేసే చర్య (కర్మ) యే  మోసం . 

అనగా ఇది ఒక మనిషి మనసు లో నుంచి ఆరంభం అయినపుడు , ఇతరులను మోసం చేయడం అనే దాని కంటే కూడా, ముందుగా మనిషి తనను తాను మోసం చేసుకుంటాడు అనేది వాస్తవం . అనగా తనలో  ఉన్న నిజాయితీ ని   తానే  మభ్య పెట్టుకుంటాడు. ఇది మనిషి అంతరంగం లో అనాదిగా  పెరుగుతూనే  ఉంది అనేది యధార్థం. 

అందుకే మనిషి అనేక సార్లు తాను  ఆలోచించేది ఒకటి . . . మాట్లాడేది మరొకటి . . . చేసేది ఇంకొకటి గా ఉంటుంది. ఈ మూడింటి కి సమన్వయం వంద శాతం ఎప్పుడూ ఉండదు . దీనినే మనిషి తనను తాను  మోసం  చేసుకోవడం గా  పేర్కొనవచ్చు.

• మనిషి , మానవ ధర్మం ద్వారా ఆచరించడానికి , ఉద్భవించిన  తన ఆలోచనల లోని  సత్యతను , నిజాయితీని తానే వక్రీకరించుకుంటూ , తనకు అనుగుణంగా ఉండే విధంగా మార్పులు చేసుకుంటూ , అనుకూల మైన  విధంగా కార్యాచరణ చేస్తూ ఉంటాడు . అవునన్నా కాదన్నా ఇది నిజం. ఇందులోనే తనను తాను మోసం చేసుకునే ప్రక్రియ ఇమిడి ఉంది. మనిషి ఎన్నో జన్మలు గా దీనికి అలవాటు పడిపోయాడు. అందుకే మనిషి యొక్క స్పృహ  ఈ విషయం  నేడు గుర్తించ లేకపోతుంది . ఇతరుల పట్ల  జరిగే మోసాలను  చక్కగా గుర్తిస్తాడు  మనిషి ,  కానీ స్వయం  తన పట్ల తాను చేసుకుంటున్న మోసాన్ని  గ్రహించలేక పోతున్నాడు అనేది వాస్తవం.

• ప్రతీ మనిషి తనకు తోచిన విధంగా తాను జీవిస్తాను అని నిర్ణయించు కోవడం లోనే, తనను తాను మోసం చేసుకుంటున్నాను అనే విషయం గ్రహించ లేకనే మోసం చేసుకుంటున్నాడు.

మనిషి ఇతరులను మోసం చేయడం అనే దాని కంటే ముందు గానే తనను తాను మోసం చేసుకోవడం లో  సిద్ధహస్తుడు  అయినాడు . ఎందుకంటే తనను తాను మోసం చేసుకో గలిగిన వాడే ఇతరులను సమర్థవంతంగా మోసం చేయగలడు.

ఈ అలవాటు అనేక జన్మలు గా అలవాటు పడి పోయి ఉండడం వలన నేడు మనిషి శక్తి హీనుడై తన లోని  మనసా శక్తి  మరియు వాచా శక్తిని పూర్తిగా కోల్పోయాడు. ఈ వాచా శక్తి నే వాక్ సిద్ది అంటారు. మనసా శక్తి ని  మనో శక్తి, సంకల్పాల శక్తి అంటారు .  అందుకే మనిషి చేసే కర్మలు కూడా వికర్మలు గా అయిపోయాయి . . . మనం ఈ అంశాన్ని స్పష్టంగా గమనిస్తే ,  నేటి కాలంలో ఏదైనా భగవంతుని పూజ గాని, వ్రతం గాని చేసేటప్పుడు మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధి తో ఉంటాను అని అంటూ ఉండడం గమనార్హం.

• కొన్ని యగాల క్రితం అనగా త్రేతా, ద్వాపర యుగాలలో మనిషి నోటి తో ఏది పలికితే అది సిద్దించేది , ఫలించేది . కానీ నేడు మనిషి తన నోటితో ఏదైనా పలికినా, మాట్లాడినా బయట వారి సంగతి  సరే ,  ఇంటిలోని  సొంత వారే  , రక్త సంబంధీకులే  మాట వినే వారు లేరు.

దీనికి కారణం  మనిషి తన మాట లోని శక్తి పూర్తిగా కోల్పోవడం . అందుకు ప్రతిగా బ్రతిమాలో, శాసించో , హింసించో తన మాట ఇతరులు వినేలా చేసుకుంటున్నాడు. దీనికి కారణం మనిషి తనను తాను మోసం చేసుకోవడానికి అనాదిగా అలవాటు పడి పోయి ఉండడం. ఆ విషయం కూడా గుర్తించే కనీస అంతర్ముఖ పరిజ్ఞానం మనిషి కోల్పోయాడు.

• ఒక మనిషి , ప్రకృతి మరియు సృష్టి ధర్మాన్ని అనుసరించి నిజాయితీ తో తన ఆలోచన ఉన్నప్పుడు , అప్పుడు నోటి ద్వారా వచ్చే మాట యొక్క శబ్దాన్ని  ,  మనసు ద్వారా ఆలోచించే  ప్రతి సంకల్పాన్ని  యధావిధిగా అమలు పరిచే బాధ్యత ప్రకృతి, విశ్వసృష్టి రెండు తీసుకుంటాయి అని అనడం లో ఏ మాత్రం సందేహం లేదు . ఇందులో మనిషి కి  ఏ భారం, కష్టం ఉండదు .

అందుకే పూర్వ కాలాలలో సత్యవంతులు నోటి తో వరం ఇచ్చినా , మనసు తో సత్ సంకల్పం చేసినా జరిగి తీరేది.

• కానీ నేడు మనిషి అదే విధంగా ఎందుకు చేయలేక పోతున్నాడు ? అంటే కారణం ఒకటే మనిషి తనను తాను మోసం చేసుకోవడానికి అలవాటు పడి , పూర్తి శక్తి హీనుడు గా  అయిపోయాడు. అందుకే నేటి మనిషి లో సంపూర్ణత లేక  మానసిక అనాధ గా మిగిలి జీవిస్తున్నాడు .

ఇందులో  ప్రస్తుత కలియుగం లో ఉన్న ఏ మనిషి కి మినహాయింపు లేదు. అందుకే అన్నాను , మనిషి మహా మోసగాడు. … ముఖ్యం గా తనను తాను మోసం చేసుకోవడం లో మాత్రమే మహా మోసగాడు .

• మనిషి పొందే ఈ స్థితి కి కారణం కూడా లేకపోలేదు. అదే మనిషి కి కమ్మేసిన మాయ. ఆ మాయ నే  వికారాల బలహినత అని అంటారు.

• మనిషి తన బలహీనతలను యధార్థ రీతిలో తెలుసుకొని అధిగమించి నాడు అద్వితీయమైన శక్తి స్వరూపుడు అవుతాడు. ఈ బలహీనతలను అధిగమించాలి అంటే, విఘ్నాలను ఎదుర్కోవడానికి శివ స్మరణ , పరమాత్మ శివుని యొక్క సాంగత్యం, శివుని తో అనుక్షణం మానసిక సాన్నిహిత్యం అత్యంత అవసరం.

• అనాది గా మనిషి తనను తాను మోసం చేసుకోవడం వలనే తనలో ఉద్భవించే దుఃఖానికి అశాంతికి  నేడు కారణభూతుడు  అవుతున్నాడు. తాను మోసపోకుండా, తనను తాను మోసం చేసుకోకుండా ఉండ గలిగే  అభ్యాసం , శివ పరమాత్మ జ్ఞానం తో రచించబడిన బ్రహ్మ కుమారీస్ రాజయోగ శిక్షణ ద్వారా మాత్రమే విని ఆచరించడం వలన సాధ్యం .


  ఓం శాంతి 🙏

  ఓం నమఃశివాయ 🙏

  యడ్ల శ్రీనివాసరావు 24 Nov 2025 9:00 PM.


No comments:

Post a Comment

708. మనిషి మోసపోయాడా ?

  మనిషి మోసపోయాడా ? • అవును . . . మనిషి ఈ కలి కాలం ఆది నుంచి    మోస పోయాడా ?   మోసపోతూ  ఉన్నాడా ?  . . .  ఈ విషయం  మనం ఎప్పుడైనా ఆలోచించామా...