కళాశాల
(మూలం: ఇంటర్మీడియట్ కళాశాలలో తన వద్దకు వచ్చిన ఎంతో మంది యువతీ యువకులను చూసి కళాశాల తనలో తను అనుకుంటుంది )
నేను ఎన్నో చూసా
రంగురంగుల చొక్కాలు
రంగురంగుల చొక్కాలు
రంగురంగుల పైజామాలు
రంగురంగుల పరికిణీీలు.
• సిగ్గు తెరల మాటున
చిలిపి జంటల హొయలు ఎన్నో చూశా.
• నూనూగు మీసాల పలకరింపులు
చిలక నవ్వుల తొలకరి సిగ్గులు.
• ఓరచూపు నీలి కళ్లు
అదిమిపట్టే పెదవులు.
• ఎదురే లేదన్న దైర్యం తో
గోడలెక్కిన ఎన్నో క్రాఫులు (అబ్బాయిలు).
భయం మాటున దాగి దాగి
నడుస్తున్న ఎన్నో కొప్పులు (అమ్మాయిలు).
• కండ కలిగిన బాహువులు
కోయిల లాంటి కంఠస్వరాలు
ఎన్నో చూసా ... నేను ఎన్నో చూసా.
• నాలో (కళాశాల) అడుగు పెట్టగానే
ఆవిరైన బాధలు,
చిగురు తొడిగిన చిరునవ్వులు.
• చెట్టు చాటు మాటలు
గడ్డిపైన బాటలు
చేయి చేయి స్పర్శలు.
• గాలికి ఊగే ఝంకాలు
అలజడి చేసే అధరాలు.
• బొద్దుగా ఉండే చెక్కిళ్ళు
గోదావరి పాయ లాంటి పాపిళ్లు.
• వాలు జడల వలపు హోయలు
జడ గంటల గలగలు.
• కాలి మువ్వల సవ్వడులు
నిటారు నడకలు.
రివ్వున ఎగిరే పరికిణీలు
వేయికళ్లకు ఆనందాలు.
• ఊగిసలాడే మనసులు
ఊహలో తేలే వయసులు
ఆనందం....ఆనందం
ఎటు చూసిన హద్దే లేని ఆనందం.
• ఒకటేమిటి
ఎన్నో చూసాను
నేను ఎన్నో చూసాను.
• ఆకలి లేని రోజులు
నిద్రలేని రాత్రులు
తొలి పొద్దు కోసం ఎదురుచూపులు.
• ఉనికి చాటుకునేందుకు ఉపాయాలు
ఉరకలు వేసే ఉత్సాహాలు
లక్ష్యాల కోసం విశ్రాంతి లేని పోరాటాలు
• ఒకరి కష్టానికి పదిమంది చేయూత
పదిమంది సంతోషానికి వందమంది ప్రేరణ
• కాలచక్రం తిరిగిపోయింది
రెండు సంవత్సరాలు
• దగ్గరలోనే దూరం
దూరం లోనే దగ్గర
• భారమైన మనసులు
మూగబోయిన ఆశలు
• ఏకాకిలా వచ్చారు
జంటలుగా వెళుతున్నారు
• కొందరిది స్నేహం
కొందరిది ప్రేమ
మరి కొందరిది ఏకాంతం
• అర్థం కాని అనుభవాల తో
వయసు పడే ఆరాటం
మనసు చేసే పోరాటం.
• జీవితం ఎవరిని గెలిపిస్తుందో
ఎవరిని ఓడిస్తుందో
కానీ ఉండాలి అందరూ ఆనందంగా .
ఎందుకంటే
నా (కళాశాల) సాక్ష్యం తోనే
కలిశారు కదా మీరంతా!
యడ్ల శ్రీనివాసరావు 16 May 2020
యడ్ల శ్రీనివాసరావు 16 May 2020
No comments:
Post a Comment