పిట్ట కథ
సుమారు 100 రోజు ల తరువాత అర్థాంతరంగా , రోజుకు ఒకరు చొప్పున నలుగురు మిత్రులు నిష్క్రమించారు. మిగిలిన స్నేహితులకి ఆశ్చర్యం, కారణం కోసం వెతికారు…. ఫలితం శూన్యం….. అందరు బాధ పడ్డారు. అందరి తో కలిసి మెలసి కొంత కాలం ఉన్నప్పుడు , వ్యక్తిగత కారణాల వల్ల నిష్క్రమించాలనుకున్నపుడు మిగిలిన స్నేహితులకి తెలియపరచాలి అనే కనీస ధర్మం తెలియని వారి పరిణితి చూసి మిగతా వారు భాథపడ్డారు.
ఆ తర్వాత కలిసి ఉన్న మిగతా స్నేహితులు మాత్రం యధాలాపంగా పార్క్ లో కూర్చుని ఇలా అనుకున్నారు. ” సరే పోనీలే…పాపం…విడిపోయన వాళ్లు కూడా మన స్నేహితులే కదా……ఎక్కడ….ఎలా.....ఏపరిస్థితిలో ఉన్నా సంతోషం గా ఉంటే చాలు. జీవితం లో ఎవరు ఇంకొకరికి పూర్తిగా అర్థం అవ్వాలనే నియమం ఏమీ లేదు. కానీ కనీసం ఎవరికి వారిమే కొంతైనా మిగతా వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, చేతనైతే చేయూత ఇవ్వాలి. ……. ఎందుకంటే ప్రతీ ఒక్కరూ ఎవరికి వారే చాలా విలువైన వారు. ఎప్పుడు, ఏ వయసులో, ఏ సమయంలో, ఎవరి నుండి ఎటువంటి సహకారం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందో మనకి తెలియదు. దీనికి ఎవరూ……అతీతం కాదు. ఎందుకంటే మనం బ్రతికేసిన కాలం కంటే కూడా బ్రతకాల్సిన కాలం చాలా తక్కువ. “ అని మిగతా స్నేహితులు అనుకున్నారు. ఎందుకంటే మిగతా స్నేహితులకు తెలుసు …వారంతా సంతోషం గా శేష జీవితాన్ని గడపగలరని.
యడ్ల శ్రీనివాసరావు 18 May 2020.
No comments:
Post a Comment