విద్యార్థి…….ఓ……విద్యార్థి
(విద్యార్ధి…జీవితం….. లక్ష్యం)
• విద్యార్థి...ఓ విద్యార్థి...విద్యను అర్జించే ఓ ఆర్థి.
• మేలుకో....మేలుకో ఇకనైనా మేలుకో.
• చదువంటే పుస్తకాలే కాదు....చదువంటే జీవితం.
• జీవితమంటే బ్రతకడమే కాదు....బ్రతికి చూపించటం.
• బ్రతుకంటే సంపాదనే కాదు.....బ్రతుకంటే బాధ్యత.
• విద్యార్థి....ఓ విద్యార్ధి.....మేలుకో ఇకనైనా మేలుకో.
• బాధ్యతంటే కుటుంబం....కుటుంబం అంటే రక్తసంబంధం….రక్తసంబంధం అంటే నీ రక్తం ఆవిరైయంత వరకూ ఎన్నో జీవుల తో ముడిపడిన బంధం.
• బాధ్యత అంటే సమాజం....సమాజం అంటే నీ ఉనికి....ఉనికి అంటే నీ ఆలోచనల ప్రభావం.
• విద్యార్థి....ఓ విద్యార్ధి....మేలుకో ఇకనైనా మేలుకో.
• బ్రతికి చూడు.....బ్రతుకు చూడు.
• లక్ష్యం వైపు నీ పయనం లో మొదటి ఓటమి నీ బలం అని తెలుసుకో.
• నీ బలం లోని శక్తిని స్పృశించి చూడు.....అది నీకు దాసోహం కాకపోతే చూడు.
• దాసోహమైన నీ శక్తి నిన్ను కీర్తి శిఖరాలకు చేర్చినపుడు....నీ కనుపాప లోని భాష్పం ఈ విశ్వానికి ఓ సాక్ష్యం.
• విద్యార్థి....ఓ విద్యార్ధి...మేలుకో ఇకనైనా
మేలుకో.
• జవాబులేని గణితం లేదు....పరిష్కారం లేని సమస్య లేదు.
• కేంద్ర బిందువు లేని వృత్తం లేదు.....నీ ఉనికి లేని భూ వృత్తం లేదు.
• చాటుకో.....చాటుకో.....చోటు లేని చోట కూడ చాటుకో.....హద్దులే లేని ఆలోచనల ఆకాశంలో నీ అంశని.
యడ్ల శ్రీనివాసరావు 4 May 2020
No comments:
Post a Comment