Sunday, May 24, 2020

10. బిచ్చగాడు

బిచ్చగాడు

అమ్మా దానం
  అయ్యా  ధర్మం 
  రెండు దినాలు అయింది తిని
  జీవం లేని కంఠంతో పీలగా.

అందుకు సాక్ష్యం 
  ఈ మెట్లు .... ఆ గుడి గంట.

గుడి కి  వచ్ఛేపోయే వారిని 
  చూస్తే కోటి వెలుగుల కాంతి.

భగవంతుని ముందు భక్తులు
  భక్తుల ముందు మేము.

మూతపడే మా కళ్ళకు
  మీ చిల్లర శబ్దం ఓ మెరుపు.

గుప్పెడు నాణెల కోసం 
  బరువు మోయలేనంత గుండె భాథ.

ఛీ .. ఛీ ... ఛీత్కారాలే మాకు ఆశీస్సులు
  పో‌ .. పో ... ఈసడింపులే మాకు ఆప్యాయతలు.

అలంకార వి-గ్రహానికి నైవేద్యం
  ఆకలి ని-గ్రహానికి  దారిద్ర్యం.

ఏమిటో ఈ మాయ
  ఏమిటో ఈ వింత.

దేవుని మొక్కే మీకు అను-గ్రహం
  మిమ్మల్ని మొక్కే మాకు ఉత్త-గ్రహం.

గుప్పెడు మెతుకులు కోసం ఆరాటం
  చావలేక బ్రతుకు తో పోరాటం.

ఎంగిలి ఆకుల కోసం పడే అన్వేషణ 
   కొంచెం అయినా తీరక పోతుందా 
   మా ఆకలి నిరీక్షణ.

బిచ్చగాడికి దేవుడు లేడా
  ఉంటే గుడిలోని దేవుడు మాకు కాడా.


భగవంతుడా
  ఎందుకీ శిక్ష … ఎందుకీ కక్ష
  మా పై ఎందుకీ వివక్ష.

అమ్మా దానం
  అయ్యా ధర్మం రెండు దినాలైంది తిని.


యడ్ల శ్రీనివాసరావు  May 2021











No comments:

Post a Comment

715. బలహీనతలే - లోపాలు - శాపాలు

  బలహీనతలే - లోపాలు - శాపాలు • మనిషికి తన బలహీనతలే లోపాలు శాపాలా ?   అవును ముమ్మాటికీ . . .  మనిషి కి  తన  లోలోని  బలహీనతలే  లోపాలు గా   ...