చలనం...నిశ్చలనం
• సాగర కెరటమంత చలనం గా
నీ ఆలోచనలు (అల్లకల్లోలం గా)
సాగర గర్భమంత నిశ్చలం గా నీ మనసు.
• ఏల సాధ్యం ఎలా సాధ్యం.
• సాగర గర్భాన్ని పున్నమి చంద్రుని వెన్నెల
తాకినందుకా అంత నిశ్చింత నిశ్చలనం.
• నీ నోట నుండి మాట రాకపోయినా
తనువు నుండి తరంగాలు తాకుతూనే ఉన్నాయి.
• నీ నోట మాట పదాల పదనిసలు
లయ తప్పవచ్చు
కానీ నీ మనసు సరిగమలు శ్రుతి తప్పవు.
• నీ రాతలు రూపాంతరమై
భావవ్యక్తీకరణ కాకపోతేనేం
నా హ్రుదయం అనుసంధానమై ఉంది కదా.
• నా కనులకు చూడాలని అంటాయి
కానీ మనసు మార్గం తెలియదు అంటుంది.
• నా మనసు మాట్లాడలని అంటుంది
కానీ కంఠం మూగపోతుంది.
• ఇక స్వేచ్చగా ఉన్నది ఈ చేయి
అందుకే ఇదంతా రాస్తుంది.
• బంథంలో జీవమున్నపుడు
ఎన్ని బంథనాలున్నా చిరకాలం చిరస్మరణీయమే.
• అర్థం నీవు అర్థం కావాలంటే
నీ మౌనం చాలు ఈ హ్రుదయానికి
• మరి అర్థం నేను అర్థం కావాలంటే
చీకటి లో కూడా చూడు
నీడనై నీ నీడనై ఉన్నాను ఆత్మగా.
• చూడగలుగుతున్నావా కనిపిస్తున్నానా
యడ్ల శ్రీనివాసరావు
No comments:
Post a Comment