అలజడి..
• అలజడి అలజడి ఈ చిరు ఆదః అధరాల అలజడి ఎందుకో నాకే ఎందుకో...
• సూర్యోదయ మంచు పొరల తెరలతో చెలిమి చేసి, చొరవతో చొరబడే వెచ్చా వెచ్చని సూర్యకిరణాలు ....రేప రెపలాడే పైరుపై చల్లా చల్లని స్వేద బిందువులు .....ఇసుక తిన్నెల వాలు జారే హోయలు పోయే నడుము పైన సన్నని పరికిణీ చిరుగాలి రెపరెపలు.
• అలజడుల నా మనస్ సవ్వడి .....గలగల నా తుమ్మెద రవళి .
• పైరుగాలి పై విహరించే పక్షి కిలకిలలా.......ఉరకలతో ఎగిసిపడుతోంది నా మనస్ సలజడి .....
• పొలము గట్టు బోదేలో స్వచ్ఛమైన ఉరకలేసే నీరులా....విప్పారిన కన్నులతో నిశ్చలమైన నిరీక్షణ... నా మనస్ కోసం ...
• నడినెత్తిన సూర్యుడు ......క్షీణంతో , సహనంతో , వేడిమిని ఆస్వాదిస్తున్న పైరులా .....ఎదురు చూపుల బలహీనతే చిగురుటాకులా....నా మనస్ కోసం నిరీక్షణ.
• అస్తమించిన సూర్యుడు, పైరుగాలి సవ్వడులు, పక్షుల గలగలలు, పునః తేజానికి ఆరంభాలు....ప్రకృతి నాకు ఇచ్చే , నా శక్తే నా నిరీక్షణ , నా మనస్ కోసం....
• తెలుసు నా మనసు.... నాది కాదని తెలుసు.... నా దరికి రాదని తెలుసు .....అయినా నేను ప్రకృతిలో మమేకమై ఉన్నాను కదా అందుకే అచంచలమైన చిరకాల నిరీక్షణ.
యడ్ల శ్రీనివాస్
No comments:
Post a Comment