Thursday, November 19, 2020

18. సుడిగుండాలు

సుడిగుండాలు


వికసించే విరజాజి   మంచు వెన్నెల జాబిల్లి

పరిమళాల సంపెంగ   కోటి తారల కాంతిమయి

ఆనందవల్లి

• ఏది ఆది   ఏది అంతం

ఈ పయనం ఎందాకో  ఎందుకో 


• బందమో 

   అనుబంధంమో  ఋణానుబందమో


• బందమా  అంటే 

   బాధ్యతలు కాన రావడం లేదు

• అనుబంధమా అంటే 

   అనుభవాలు కాన రావడం లేదు.

• మరి ఇక మిగిలినది

   ఋణానుబందమే కదా


• కలయిక చిత్రం కాదు 

   విచిత్రం కానే కాదు 

   యాదృచ్ఛికం అంతకంటే కాదు.


• అవుతుందా

   అర్థం అవుతుందా

   శక్తిని చూడలేం  కాని అనుభవించగలం


• చూడు  మనసు పొరలు చీల్చి చూడు

   నీ పట్ల ఈ ప్రకృతి లీల కనిపిస్తుంది.


• పడ్డావు  పడ్డావు  

   సుడులు తిరిగే సుడిగుండాలే  

   ఆయాసపడే కష్టాలు పడ్డావు.


• సుడిగుండాల్లో  సుడులెన్నునా  

   సున్నితమే  నీ  సుందరాభరణం.


• ఆ సుందరాభరణానికే 

   ఎగిరే రెక్కల గుర్రం ఎక్కించుకుంది.


• విహరించు  వినీలాకాశాన్ని

   ఆలంబనతో ఆస్వాదించు 

   సుడులు తిరిగే సుడిగుండాలని.


• సాగరం లో శాంతిని చూసే 

   నీ మనసే నీకు  శ్రీ రామ రక్ష

• ఉన్నాడు  ఒకడున్నాడు 

   ఈ సర్వం జగత్ వ్యాపించి ఉన్నాననే

   వాడొకడున్నాడు.  

   వాడిని చూడాలంటే 

   ఎన్నో సుడిగుండాలు  దాటాలి మరి.  

   వాడు అనుగ్రహిస్తే 

   ఏదో ఒక దేహం తో దర్శనమిస్తాడు.


యడ్ల శ్రీనివాసరావు









No comments:

Post a Comment

806. మౌనంగా అందరినీ వదిలేయండి-4

  మౌనంగా అందరినీ వదిలేయండి (నాల్గవ భాగం) దయచేసి . . .  మొదటి మూడు భాగాలు     (803 ,804 ,805 ) చదివిన తరువాత మాత్రమే ఈ రచన చదువగలగరు 🙏   ఇ...