స్నేహితులందరికీ మనవి, నన్ను మన్నించాలి, నా ఆలోచనలను దయచేసి అర్థం చేసుకోండి . నేను ముందుగా వివరణ ఇచ్చినట్లు ఈ రాత ఒక వ్యక్తి రాసినది కాదు..... ముమ్మాటికి కానేకాదు. వ్యక్తి ఎప్పుడూ ఒంటరి వాడే...కానీ వ్యక్తికి శక్తి కలిస్తేనే సంఘటితం అవుతుంది. ఆ శక్తే ఇక్కడ "మనం". మనలో ప్రతి ఒక్కరికి బడిలో అపురూపమైన అనుభవాలు ఉన్నాయి.
ఈ రాతలో ప్రతి అక్షరం ఒక విద్యార్థి. అంటే ప్రతి ఒక్కరి సంతోషం, ఆనందం, అనుభవాల సమ్మేళనమే ఈ రాత.
మనమందరం కలిసి మనకు మనమే కృతజ్ఞతలు చెప్పుకోవాలి.. ఎందుకంటే ఈ రోజు మన బాల్య సంతోషాన్ని మనమే నెమరువేసుకుంటున్నాము, పండుగ వాతావరణం సృష్టించుకున్నాము. అందుకు నిదర్శనమే ఈ రోజు.
నన్ను క్షమించాలి అర్థం చేసుకోవాలి, మన వాళ్ళ యొక్క కృతజ్ఞతలను వ్యక్తిగా నేను స్వీకరించలేక పోతున్నాను.
ఒకటి మాత్రం నిజం......ఇది చదివిన ఆనందించిన ప్రతి ఒక్కరం భాగస్వామ్యులమే, ఎవరికి వారే స్వయంగా, స్వీయ అనుభవంతో రాసుకున్నదే ఇది.
ఎందుకంటే బాల్య భావాలు బయటకు అందరం వ్యక్త పరచ లేకపోవచ్చు . భగవంతుడి ఆశీస్సులు ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో మనపై ఆ వర్షం పడుతుంది. ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైంది. " ఓం శ్రీ గురుభ్యోనమః" ....... Praise the lord.... "జీసస్".
"నేను" పలికి చూడండి రెండు పెదవులు కలవవు.
"మనం " పలికి చూడండి రెండు పెదవులు కలుస్తాయి .
ఏదైనా "నేనేదో చేసేసాను.... నేనేదో చేస్తాను.... నావల్లే ఇదంతా అనుకుంటే" మిగిలేది ఏకాంతం , ఒంటరితనం.
కానీ "మనం ....మనది.... మనమంతా కలిసి చేసాం" అనుకుంటే మిగిలేది కోటి దివ్వెల కాంతి, సంతోషం .
ఆ "మనం" లోనే ...."నేను" చిన్నగా ఒక ప్రక్కన ఉంటాడు.
అదే "నేను" కు "ఆనందం" ….... "మనం" కు బలం.
మీ మిత్రుడు
యడ్ల శ్రీనివాసరావు
No comments:
Post a Comment