Thursday, November 19, 2020

28. బాల్య మిత్రుల కలయిక రూపమా అపురూపమా?....

 బాల్య మిత్రుల కలయిక రూపమా..... అపురూపమా...

• ఉన్నాం.. ఉన్నాం...అందరం ఒకేలా ఉన్నాం.... ఏం ఒకేలా లేకుంటే మరి ప్రతిబింబాలు ఎలా కా గలిగాం... మాట్లాడు మిత్రమా.... ఓ నేస్తమా ..

• ముప్పది సంవత్సరాల ఎడబాటును మైమరిపించే మహత్తరమైనదా!  మన స్నేహం ?
• అవును.....కాదనేది ఎవరు?   జ్ఞాపకాలు పదిలం.... అనుభవాలు మధురం.... బాల్య బంధం తాజాగా పరిమళంతో  ఉన్నప్పుడు కాలంతో.... వయసుతో... పని ఏముంది మిత్రమా ..


• కంటికి కనిపించని స్నేహ తరంగాలు ఎన్నో ఉన్నా....... నీ అంతరంగాన్ని స్పృశిస్తే  కనువిందుచేసే అలలే బాల్య మిత్రులు....

• సంతోషం సంబరపడుతోంది......ఆనందం ఆశ్చర్య పడుతుంది..... బాల్య మిత్రుల కలయికకి....

• తనువులు వేరైనా,  మనసులు వేరైనా,  ఒకే మూలంలో (ప్రదేశం) , సరిసమానమైన స్పర్శలతో కలిసి పెరిగాం…....మరి  ఆ జీవ స్పర్శ  మన జీవనాడి లో లేదంటారా.. మిత్రులారా....ఓ మిత్రులారా...

• ఏ క్షణాన ఏమి జరుగునో ఎవరికి తెలుసు .....వెనుకకు తిరిగి చూస్తే ఎంతో కొంత బరువులు అందరికీ ఉన్నాయి ( పేరు ,హోదా, ధనము, ఋణము, అనారోగ్యము, దుఃఖము) .....ఏది శాశ్వతం?  

• ఆరోగ్యంతో ఆనందమయమై.... వర్తమానంతో వర్ధిల్లాలంటే .....ఒకటే ఔషధం .... మనసుకు ఊరట....అది దొరికేది మన అందరి లోనే......కావున..... మిత్రులారా…..
• చేతులు కలుపుదాం........ చేయూత నిచ్చుకుందాం......
• మాటలు కలుపుదాం .......మనసుని బలోపేతం చేద్దాం…..

• మిత్రమా !  తెరవకు ..... తడమకు .....నీ అంతర్మథనం లోని చీకటి కోణాన్ని (అహంకారం, గర్వం,ఈర్ష్య, అసూయ,పగ, ప్రతీకారం, ద్వేషం,హేళన, వెకిలి మాటలు, వెకిలి చేష్టలు, మోసం).....పొరపాటున.... తెరిచినా.....తడిమినా.... చీకటిలో ఏకాకిగా  అంతరించిపోవాలి …..... సిద్ధమేనా ఆలోచించు …….. తదుపరి   చీకటి   కూడా  నీ చిరునామా కనుగొనలేదు……ఇది అక్షర సత్యం.... జాగ్రత్త... మిత్రమా.


• సరియైన శక్తి మాత్రమే...... నీ దశ తిరిగే దిశను చూపిస్తుంది.....ఏం  కాదనగలరా   మిత్రులారా.....



యడ్ల శ్రీనివాసరావు
St. Theresa's RCM High school
SSC 1987-88 .
Pedabodde Palli 
Narsipatnam .
Visakha.


20 Nov 2020.




No comments:

Post a Comment

709. భగవంతుని జ్ఞానం - మనిషి భక్తి

  భగవంతుని జ్ఞానం - మనిషి భక్తి • భగవంతుని జ్ఞానం ఆధారంగా శాస్త్రాలలో ఎన్నో విషయాలు పొందుపరచబడ్డాయి. భక్తి మార్గం లో ఈ విషయాలను కధల రూపం లో...