పదముల చెలి చెలిమి
• పదములు కలమున వదలక గాంచిన(చూసిన)
చెలిమి సంతసించే.
• పదములు పిదపన(తదుపరి)
చెలిమి మనసున్ దోచెన్.
• పదముల నాట్యమే
చెలిమి ఊగిసలాడే వాలుజడ వలపు
నడక విన్యాసం.
• పదముల అభినయమే
చెలిమి నేత్రారవింద శృంగం (తామర పుష్పం ).
• పదముల పదనిసలే
చెలిమి తలపుల్ వలపుల్ కులుకుల్.
• పదముల సరిగానం
చెలిమి మేనిన హొయల్
వర్ణించలేని భాండాగారం.
• పదముల ప్రవాహంలో జలకాలాడే
చెలిమి నిత్యానంద శోభమయం.
• పదముల కదలికలే
చెలిమి ఎదలోతుల్లో ప్రకంపనల్.
• పదముల ప్రతి పాదమున
చెలిమి తన ముఖారవిందం గాంచెన్.
• పదముల విరహం
చెలిమి మోమున అలకతో అథరం అదిరెన్.
• పదముల పుట్టుక తనకైనని తలచిన
చెలిమి రక్తియై అనురక్తియై నేలకామడ
ఆడుతుండే మయూరిలా నాట్యమాడుతుండే.
• పదమా. పంచభూతాల ఆకర్షితమా
ప్రకృతిని ( చెలిమిని) పరవశింపజేసే
పంచతంత్రమా.
• పదముల పరువానికి ప్రణమిల్లే చెలిమికి
పదములు రాసేడువాడు
శూన్యంబుగా గాంచెను ఎన్నడు.
• పదము పైన ప్రేమ చెలిమి సొత్తు
పదము గాంచిన వాడు విభుడి(ఈశ్వరుడు) సొత్తు.
యడ్ల శ్రీనివాసరావు
No comments:
Post a Comment