ఉన్నాడులే.... ఒకడున్నాడు లే
• ఉన్నాడు లే,
యుగమొక క్షణమును చేసే
యోగి ఒకడున్నాడులే.
• జగమున
జనముకు రక్షకుడైనాడులే
పరిరక్షకుడై యున్నాడులే.
• నట నాట్యం తో తాండవమెత్తి
ప్రక్రుతి పాలకుడై యున్నాడులే
ఒకడున్నాడు లే.
• తేటతెల్లమైన మేని విభూది తో
స్థితప్రజ్ఞడై శాంతి కాముకుడై
థ్యానముద్రకు ప్రతీకుడై యున్నాడులే.
• సుందర మనోహర
చిద్విలాస చిదానందుడి
కనుపాప బాష్పమునైన ధన్యం
నా ఈ జన్మ ధన్యం.
• ఓం నమఃశివాయ….శివాయఃనమః ఓం.
యడ్ల శ్రీనివాసరావు
No comments:
Post a Comment